వాట్సాప్ (Whatsapp Latest News) లో కొత్త అప్డేట్ వస్తుంది అంటే.. దానిపై విపరీతమైన ఆసక్తి చూపుతారు నెటిజన్లు. కొత్తగా చేర్చే ఫీచర్ల గురించి ఆరా తీసి, టెస్టింగ్ చేస్తుంటారు. అయితే వాట్సాప్ తాజాగా విడుదల చేసిన సరికొత్త ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో కొత్తగా కమ్యూనిటీ ఫీచర్ (Community Feature) కనిపించింది. అంటే వాట్సాప్ గ్రూప్ ఫీచర్ పేరు మారుతుందా లేదా ఫేస్బుక్ (Facebook) ఎన్క్రిప్టెడ్ మెసెంజర్లో సోషల్ ఫీచర్స్ కొత్తగా ఏమైనా చేరతాయా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.ఈ కొత్త కమ్యూనిటీ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ విడుదల చేసిన లేటెస్ట్ వెర్షన్లో XDA డెవలపర్స్ గుర్తించింది. వాట్సాప్ బీటా వెర్షన్ 2.21.21.6కు సంబంధించిన APKను విశ్లేషించడం ద్వారా ఇందులో కొత్త కమ్యూనిటీ ఫీచర్ కోడ్ ఉన్నట్టు తేలింది. ఇది ప్రస్తుతం వాట్సాప్‌లో ఉన్న గ్రూప్ ఫీచర్‌కు భిన్నంగా ఉంది.
సోషల్ మీడియా ఫంక్షనాలిటీని దీనిద్వారా అందించవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులోని ఫీచర్ ఫిల్టర్‌ను బట్టి ఇది యూజర్స్‌కు గ్రూప్స్‌ను మరింత మెరుగ్గా ఆర్గనైజ్ చేసుకునేందుకు కల్పించే మరో వెసులుబాటు కూడా కావచ్చని ఈ నివేదిక అభిప్రాయపడుతోంది.
వాట్సాప్ గ్రూస్ అనేది మన దేశంలోనే కాదూ బ్రెజిల్‌లోనూ బాగా పాపులర్. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా కమ్యూనిటీలో గ్రూప్స్ ఏర్పాటు చేసుకునే సౌకర్యం యూజర్స్‌కు కల్పిస్తుందని ఈ నివేదిక సూచించింది. అయితే ఇవన్నీ ఊహగానాలు మాత్రమే. యాప్‌లోకి రాబోయే ఈ ఫీచర్‌కు సంబంధించి కేవలం రెఫరెన్సులను మాత్రమే XDA గుర్తించింది. అదే సమయంలోని ఇందులోని రోల్ ఫిల్టర్‌ను బట్టి చూస్తే కొత్తగా ఏమి ఉండకపోవచ్చని, యాప్‌లో గ్రూప్స్‌ను చక్కగా హ్యాండిల్ చేసే సదుపాయాన్ని కల్పిస్తుందని అర్థమవుతోంది.
తాజా అప్డేట్తో గ్రూప్ ఓనర్స్ (లేదా కమ్యూనిటీ ఓనర్స్) యూజర్స్‌కు కొత్త బాధ్యతలు అంటే కమ్యూనిటీ అడ్మినిస్ట్రేషన్ వంటి బాధ్యతలు అప్పగించవచ్చు. తద్వారా గ్రూప్స్‌పై మరింత నియంత్రణ పొందడం సాధ్యమవుతుంది. గుర్తించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కొత్త అప్డేట్ కారణంగా మెసేజులను పెద్ద కమ్యూనిటీతో షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం లేదు.
ఈ నివేదికలోని అంశాలన్నింటినీ చూస్తే గ్రూప్స్ నుంచి కమ్యూనిటీగా మీ పాత్రకు వాట్సాప్ కొత్త పేరు పెడుతుందననే విషయం తెలుస్తోంది. యాప్‌కు సంబంధించి భవిష్యత్ వెర్షన్స్‌పై కంపెనీ చేపట్టే చర్యల ఆధారంగా ఈ పాత్రకు ఉండే సామర్ధ్యం ఏంటనే విషయం మనకు తెలుస్తుంది. అన్ని అప్లికేషన్లలో బీటా ఫీచర్ల మాదిరిగానే కొత్త ఫీచర్ అమలు చేయడం సాధ్యం కాకపోతే దాన్ని డ్రాప్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Facebook, Technology, Whatsapp