Delete Facebook: ఫేస్‌బుక్ డిలిట్ చేయండి... వాట్సప్ కో-ఫౌండర్ సలహా

Delete Facebook | మీ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫేస్‌బుక్ డిలిట్ చేసి తన బాటలో నడవాలని పిలుపునిచ్చాడు వాట్సప్ కో-ఫౌండర్ బ్రియాన్ యాక్టన్. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో ఈ కామెంట్లు చేశాడు.

news18-telugu
Updated: March 15, 2019, 10:32 AM IST
Delete Facebook: ఫేస్‌బుక్ డిలిట్ చేయండి... వాట్సప్ కో-ఫౌండర్ సలహా
Delete Facebook: ఫేస్‌బుక్ డిలిట్ చేయండి... వాట్సప్ కో-ఫౌండర్ సలహా
news18-telugu
Updated: March 15, 2019, 10:32 AM IST
ఫేస్‌బుక్... నెటిజన్ల జీవితంలో ఓ భాగమైపోయింది. మంచం దిగకముందే ఫేస్‌బుక్‌లో గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడం చాలామందికి అలవాటు. ఆ అలవాటు వ్యసనంగా మారిపోతోందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇదొక్కటే కాదు ఫేస్‌బుక్ వల్ల చాలా దుష్పరిణామాలు ఉన్నాయన్న వాదనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ డిలిట్ చేయాలంటూ వాట్సప్ కో-ఫౌండర్ బ్రియాన్ యాక్టన్ విద్యార్థులకు సలహా ఇవ్వడం సంచలనంగా మారింది. మీ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫేస్‌బుక్ డిలిట్ చేసి తన బాటలో నడవాలని పిలుపునిచ్చాడు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో ఈ కామెంట్లు చేశాడు.

whatsapp cp-founder, Brian Acton, Delete Facebook, Jan Koum, Mark Zuckerberg, facebook addiction, డిలిట్ ఫేస్‌బుక్, వాట్సప్ కో-ఫౌండర్, బ్రియాన్ యాక్టన్, జాన్ కౌమ్, ఫేస్‌బుక్ వ్యసనం, మార్క్ జుకర్‌బర్గ్
వాట్సప్ కో-ఫౌండర్ బ్రియాన్ యాక్టన్
(Image: Reuters)


యాహూ మాజీ ఉద్యోగులైన బ్రియాన్ యాక్టన్, జాన్ కౌమ్ కలిసి 2009లో ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సప్‌ను ప్రారంభించారు. 2014లో వాట్సప్‌ను ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది. మానెటైజేషన్ విషయంలో ఫేస్‌బుక్‌తో వాట్సప్ ఫౌండర్లకు విభేదాలొచ్చాయి. 2017లో బ్రియాన్ యాక్టన్ వాట్సప్ నుంచి వెళ్లిపోయాడు. 2018లో జాన్ కౌమ్ కూడా కంపెనీని వదిలేశాడు. కొంతకాలంగా బ్రియాన్ యాక్టన్ ఫేస్‌బుక్‌ను డిలిట్ చేయమంటూ పోరాడుతుండటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఫేస్‌బుక్‌ను డిలిట్ చేయాలని బ్రియాన్ యాక్టన్ అనడం ఇదే మొదటిసారి కాదు... 2018లో కేంబ్రిడ్జి అనలిటికా స్కాండల్ సంచలనం సృష్టించిన సమయంలోనూ ఇలాగే అన్నాడు. ఇప్పుడు మరోసారి 'డిలిట్ ఫేస్‌బుక్' అంటూ తన నినాదాన్ని వినిపించాడు.

Photos: ఈ లేడీ బైకర్ ఆన్‌‌లైన్ సెన్సేషన్... అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్



ఇవి కూడా చదవండి:
Loading...
Post Office Schemes: 5 ఏళ్లలో రూ.5 లక్షలు కావాలంటే ఇలా ఇన్వెస్ట్ చేయండి

SBI PPF Scheme: అధిక వడ్డీ కావాలా? ఎస్‌బీఐ పీపీఎఫ్ స్కీమ్ ట్రై చేయండి

WhatsApp Reverse Image Search: ఫేక్‌న్యూస్ గుర్తించేందుకు వాట్సప్‌లో కొత్త ఫీచర్
First published: March 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...