Home /News /technology /

WHATSAPP CHATS WANT TO HIDE WHATSAPP CHAT PERMANENTLY FOLLOW THESE STEPS GH VB

WhatsApp Chats: వాట్సాప్‌ చాట్‌ను పర్మినెంట్‌గా హైడ్ చేయాలనుకుంటున్నారా..? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

వాట్సాప్‌లో ఏదైనా చాట్‌ కన్వర్జేషన్‌ను పర్మినెంట్‌గా హిడెన్ చేయవచ్చు. చాట్‌ను హైడ్ చేసేందుకు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏవో చూద్దాం.

యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు అనేక ఫీచర్లను(Features) అందుబాటులోకి తీసుకొస్తుంటుంది మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌. ఏదైనా చాట్ లిస్ట్‌ను పర్మినెంట్‌గా హైడ్ చేసే ఫీచర్‌ను వాట్సాప్(WhatsApp) గతంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ చాట్‌ను దాచటానికి సాధారణంగా archive ఫీచర్‌ను ఉపయోగిస్తాం. అయితే కొత్త మెసేజ్ వస్తే ఆర్కైవ్డ్ చాట్‌కు సంబంధించిన నోటిఫికేషన్(Notification)కనిపిస్తుంది. కానీ ఈ ఫీచర్‌ను వాట్సాప్ అప్‌డేట్‌ చేసింది. ఇప్పుడు కొత్త మెసేజ్(Message) వచ్చినా అర్కైవ్డ్ చాట్(Chat) నోటిఫికేషన్ అలర్ట్ రాకుండా చాట్‌ను పర్మినెంట్‌గా హిడెన్ చేయవచ్చు.

చాట్‌ను హైడ్ చేసేందుకు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్

స్టెప్1: మొబైల్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి అర్కైవ్ చేయాలనుకుంటున్న చాట్ కన్వర్జేషన్‌ను ఎంచుకోండి.

స్టెప్2: చాట్ పేజ్ పై భాగంలో అర్కైవ్ ఆప్షన్ ఐకాన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇది రివర్స్ యారో రూపంలో ఉంటుంది.

స్టెప్3: మీ చాట్ స్ట్రీమ్ టాప్‌లో అర్కైవ్‌ సెక్షన్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ సెక్షన్‌కు వెళ్లి.. మీ సీక్రెట్ చాట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

స్టెప్4: యూజర్లు చాట్‌ను అన్ అర్కైవ్‌ చేయాలనుకుంటే.. ఆ చాట్‌ను లాంగ్ ప్రెస్ చేసి అన్ అర్కైవ్‌ ఆఫ్షన్‌‌పై క్లిక్ చేయాలి.

స్టెప్5: అన్ని చాట్‌లను అర్కైవ్‌ చేయాలనుకుంటే Chats pageకి వెళ్లండి.

స్టెప్6: ఇప్పుడు సెట్టింగ్స్ పేజ్ ఓపెన్ చేయండి.

స్టెప్7: ఇందులో చాట్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి.

స్టెప్8: ఆ తర్వాత చాట్ హిస్టరీ పేజీకి వెళ్లండి

స్టెప్9: ఇప్పుడు మొత్తం చాట్‌లను అర్కైవ్‌ చేయండి

CBSE 12th CLASS: సీబీఎస్‌ఈ 12వ తరగతి టర్మ్1 ఫలితాలపై అభ్యంతరాలు ఉన్నాయా..? ఇలా ఫిర్యాదు చేయండి..


అర్కైవ్‌ చేసిన అన్ని చాట్స్‌ను యూజర్లు తిరిగి పొందవచ్చు. ఇందుకు ముందుగా వాట్సాప్‌ను ఆన్ చేయాలి. చాట్ స్క్రీన్‌ను కిందకు స్క్రోల్ చేస్తే అర్కైవ్‌ అనే ఆఫ్షన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి. చాట్‌‌పై లాంగ్ ప్రెస్ చేసి, ఆపై అన్‌ అర్కైవ్‌ సింబల్‌పై ట్యాప్ చేయడి. దీంతో మొత్తం చాట్‌ను తిరిగి పొందవచ్చు.

వాట్సాప్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్‌ యూజర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులను ఎంటర్టైన్ చేస్తుంది. 2022లో వాట్సాప్‌ తన యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది.

నో డిలీట్‌.. ఓన్లీ లాగ్‌అవుట్‌
వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఉన్న ‘డిలీట్‌ మై అకౌంట్‌’ బటన్‌ ఇక కనిపించకపోవచ్చు. దానికి బదులుగా ‘వాట్సాప్ లాగ్‌అవుట్‌’ ఫీచర్ రానుంది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌యాప్స్‌కు ఉన్న లాగ్‌అవుట్ సదుపాయాన్నీ వాట్సాప్‌ తన యూజర్లకు అందివ్వనుంది. డిలీట్‌ అకౌంట్‌ ఫీచర్‌తో మన నంబర్‌పైన ఉన్న వాట్సాప్‌ను తొలగించడమే కాకుండా.. ఆ ఖాతాకు సంబంధించిన చాట్‌, మీడియా ఫైల్స్‌ను వాట్సాప్‌ పూర్తిగా తొలగిస్తుంది.

వాట్సాప్ ‘రీల్స్‌’
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చూడాలంటే.. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లనవసరం లేదు. డైరెక్ట్‌ వాట్సాప్‌లోనే చూసేయొచ్చు. వాట్సాప్‌ స్టేటస్‌, చాట్స్‌, కాల్స్‌ పక్కన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ను మరో సెక్షన్‌గా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లకు మరింత ఎంటర్టైన్ కానున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Chat, New technology, Technology, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు