Home /News /technology /

WHATSAPP CHAT THREADS WHATSAPP CHAT THREAD FEATURE RELEASED DO YOU KNOW HOW IT WORKS MK GH

WhatsApp Chat Threads: వాట్సాప్​ ‘చాట్​ థ్రెడ్’​ ఫీచర్ విడుదల..ఎలా పనిచేస్తుందో తెలుసా?

WhatsApp Privacy

WhatsApp Privacy

ఫేస్​బుక్​ యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్​ తీసుకురావడంపై దృష్టి పెట్టింది. నూతన ప్రైవసీ పాలసీ​ ద్వారా యూజర్స్​ను చేజార్చుకోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.

ఇంకా చదవండి ...
ఫేస్​బుక్​ యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్​ తీసుకురావడంపై దృష్టి పెట్టింది. నూతన ప్రైవసీ పాలసీ​ ద్వారా యూజర్స్​ను చేజార్చుకోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. అందులో భాగంగానే గత ఏడాది డిసప్పియరింగ్​ మెసేజ్​, వాట్సాప్​ రీడ్​, డిలీట్​ ఇన్​ బల్క్​, షాపింగ్​ వంటి 10కి పైగా ఫీచర్లను చేర్చిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా ఈ ఏడాది కూడా యూజర్స్​కు మెరుగైన ఫీచర్స్​ను తీసుకొస్తామని ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్స్​తో వినియోగదారుల అనుభవాన్ని గతంలో కంటే మెరుగుపర్చనున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మెసేజింగ్​ను మరింత యూజర్​ ఫ్రెండ్లీ చేసేలా మరో అద్భుతమైన ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. అదే ‘వాట్సాప్​ చాట్​ థ్రెడ్’​ ఫీచర్. ఈ ఫీచర్​ ద్వారా ఇకపై యూజర్లు తమ సమస్యలను వాట్సాప్​కు సులభంగా నివేదించవచ్చు. అంతేకాక, కేవలం 48 గంటల్లో సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు.​ ప్రస్తుతానికి కొంతమంది బీటా యూజర్స్​కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్​ను అతి త్వరలోనే ఆండ్రాయిడ్​ యూజర్స్​ అందరికీ పరిచయం చేస్తామని వాట్సాప్​ స్పష్టం చేసింది. ఒకవేళ మీరు వాట్సాప్ బీటా యూజర్ అయినా సరే, ప్రస్తుతానికి ఇది మీకు అందుబాటులో లేకపోతే వాట్సాప్​ బీటా వెర్షన్​ను అప్​డేట్​ చేసుకోవాలని సూచించింది. తద్వారా మీకు కూడా వాట్సాప్​ థ్రెడ్​ ఫీచర్​ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

ఆండ్రాయిడ్​ బీటా యూజర్స్​కు మాత్రమే..
అయితే, ఈ ఫీచర్​ మీకు అందుబాటులో ఉందా? లేదా? అనే విషయం తెలుసుకోవడం చాలా సులభం. దీని కోసం మీరు వాట్సాప్ సెట్టింగ్స్​లోకి వెళ్లి, హెల్ప్​ ఆప్షన్​ను ఎంచుకోండి. దానిలో కాంటాక్ట్​ అస్​ అనే ఆప్షన్​ఫై క్లిక్​ చేయండి. మీకు ఒకవేళ వాట్సాప్ చాట్ థ్రెడ్‌ యాక్సెస్​ ఉంటే, అక్కడ ఒక డైలాగ్​ బాక్స్​ కన్పిస్తుంది. లేదంటే ఎటువంటి డైలాగ్​ బాక్స్​ కన్పించదు. మీకు ఫీచర్​ అందుబాటులో ఉంటే.. దానిలో మీరు ఎదుర్కొంటున్న టెక్నికల్​ సమస్యను నమోదు చేయండి. అనంతరం మీరు థ్రెడ్‌ను ప్రారంభించగానే.. వాట్సాప్ మీ సమస్యకు పరిష్కారాన్ని గ్రూప్ చాట్‌లో చూపిస్తుంది. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు.. మీ డివైజ్​ సమాచారం, ఇతర టెక్నికల్​ వివరాల యాక్సెస్​ పర్మిషన్​ అడుగుతుంది. ఈ సమాచారాన్ని వాట్సాప్​తో పంచుకోవాలా? లేదా? అనే ఆప్షన్​ కూడా ఇస్తుంది. అయితే, ఒకవేళ మీ డివైజ్​ సమాచారం మాతో పంచుకున్నా సరే.. ఆ సమాచారం సెక్యూర్​గానే ఉంటుందని వాట్సాప్​ తెలిపింది. కాగా, ఈ ఫీచర్​ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్​ పరికరాల్లో మాత్రమే రోల్​ అవట్​ అవుతోంది. iOS పరికరాల్లో అందుబాటులో లేదు. ఈ ఏడాది చివరి కల్లా వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందరికీ రోల్​ అవుట్​ చేస్తుందని భావిస్తున్నారు.



మరిన్ని వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు చానెల్ సబ్ స్క్రయిబ్ చేయండి...

First published:

Tags: Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు