WhatsApp: షాక్... మీ వాట్సప్ హ్యాక్ చేయొచ్చు... ఈ వీడియోనే సాక్ష్యం

WhatsApp Hacking | వాట్సప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉందని ఆ సంస్థ పదేపదే చెబుతోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా మెసేజ్ పంపిన వ్యక్తి, పొందిన వ్యక్తి తప్ప ఇంకెవరూ హ్యాక్ చేసి మెసేజ్‌లు చూడలేనంత భద్రంగా ఉందని వాట్సప్ అనేకసార్లు వెల్లడించింది.

news18-telugu
Updated: August 9, 2019, 6:34 PM IST
WhatsApp: షాక్... మీ వాట్సప్ హ్యాక్ చేయొచ్చు... ఈ వీడియోనే సాక్ష్యం
WhatsApp: షాక్... మీ వాట్సప్ హ్యాక్ చేయొచ్చు... ఈ వీడియోనే సాక్ష్యం (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 9, 2019, 6:34 PM IST
మీరు వాట్సప్ వాడుతున్నారా? మీ వాట్సప్‌ని ఏ క్షణానైనా హ్యాక్ చేయొచ్చు. అంతేకాదు... మీ మెసేజ్‌లను మార్చొచ్చు. అంటే ఎడిట్ చేయొచ్చు. వాట్సప్‌లో ఛాటింగ్‌ సమయంలో పంపే మెసేజ్‌లను హ్యాకర్లు తమకు నచ్చినట్టుగా ఎడిట్ చేయడం సులువు. మెసేజ్‌ను మార్చడం, అవాస్తవాలను సృష్టించడం, గ్రూప్‌లో కొందరికి మాత్రమే మెసేజ్ చేరేలా చేయడం పెద్ద కష్టమేమీ కాదని తేలిపోయింది. వాట్సప్‌లో తాజాగా బయటపడ్డ ఈ లోపం సంచలనంగా మారింది. వాట్సప్‌ను ఎవరైనా హ్యాక్ చేసి మెసేజెస్‌ని మార్చెయ్యడం సులువని ఆధారాలతో సహా బయటపడింది. ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్ ఈ విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు... వాట్సప్‌ని హ్యాక్ చేసి మెసేజెస్‌ని మార్చడం ఎంత ఈజీనో ఆధారాలతో సహా చూపిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇదే.

వాట్సప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉందని ఆ సంస్థ పదేపదే చెబుతోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా మెసేజ్ పంపిన వ్యక్తి, పొందిన వ్యక్తి తప్ప ఇంకెవరూ హ్యాక్ చేసి మెసేజ్‌లు చూడలేనంత భద్రంగా ఉందని వాట్సప్ అనేకసార్లు వెల్లడించింది. కానీ మెసేజ్ వెళ్లకముందే డీక్రిప్ట్ చేసి మెసేజ్‌ను మార్చడం సులువని చెక్‌పాయింట్ బయటపెట్టింది. వాట్సప్ ఎన్‌క్రిప్షన్ ఆల్గరిథమ్‌ను రివర్స్ ఇంజనీర్ చేసింది చెక్‌పాయింట్. వాట్సప్ మెసేజ్‌ను డీక్రిప్ట్ చేయడం ద్వారా దాన్ని ఎలాగైనా మార్చే యాక్సెస్ లభిస్తుందని రుజువు చేసింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో అతిపెద్ద లోపం బయటపడటంతో ఆ విషయాన్ని వాట్సప్‌కు తెలిపింది చెక్ పాయింట్ సంస్థ.

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు




ఇవి కూడా చదవండి:

WhatsApp: మీ వాట్సప్‌ని అద్బుతంగా మార్చే 8 ఫీచర్లు ఇవే
Loading...
Amazon Sale: అమెజాన్‌ సేల్‌లో ఈ 9 గ్యాడ్జెట్స్‌పై అద్భుతమైన ఆఫర్స్

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...