WHATSAPP BUG IS RANDOMLY DELETING OLD MESSAGES FOR SOME ANDROID USERS SS
WHATSAPP BUG: వాట్సప్‌లో మీ మెసేజెస్ మాయం... ఎందుకో తెలుసా?
WHATSAPP BUG: వాట్సప్‌లో మీ మెసేజెస్ మాయం... ఎందుకో తెలుసా?
WHATSAPP BUG | చాలామంది వాట్సప్‌లో పాత ఛాట్ హిస్టరీ డిలిట్ అయిపోతుంది. కొందరు యూజర్లలో పాతవి కాకపోయినా మెసేజ్‌లు డిలిట్ అయిపోతున్నాయట. యూజర్లు ఈ విషయాన్ని వాట్సప్ దృష్టికి తీసుకెళ్లినా అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.
వాట్సప్‌లో మెసేజెస్ డిలిట్ అయిపోతున్నాయి. అవును... మీరు గమనించారో లేదో, మీ వాట్సప్‌లో పాత మెసేజెస్ అన్నీ మాయమైపోతున్నాయి. మీకు మాత్రమే కాదు... ఆండ్రాయిడ్ యూజర్లు చాలామంది తమ ఛాట్ హిస్టరీ ఆటోమెటిక్‌గా డిలిట్ అయిపోతుందని అంటున్నారు. ఇందుకు కారణం వాట్సప్ బగ్. ఇప్పుడు కాదు... నెల రోజులుగా ఇదే జరుగుతోంది. వాట్సప్ బగ్ పాత మెసేజెస్‌ని డిలిట్ చేస్తోంది. WABetaInfo ట్వీట్ ప్రకారం మోటో జీ4 ప్లస్ గత నెలలోనే ఈ సమస్యను ప్రపంచానికి తెలిపింది.
It looks this issue persists for some Android users.
Are you still experiencing it? pic.twitter.com/piBXEUopIt
చాలామంది వాట్సప్‌లో పాత ఛాట్ హిస్టరీ డిలిట్ అయిపోతుంది. కొందరు యూజర్లలో పాతవి కాకపోయినా మెసేజ్‌లు డిలిట్ అయిపోతున్నాయట. యూజర్లు ఈ విషయాన్ని వాట్సప్ దృష్టికి తీసుకెళ్లినా అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.
It looks this issue persists for some Android users.
Are you still experiencing it? pic.twitter.com/piBXEUopIt
ఈ సమస్య ఆండ్రాయిడ్ యూజర్లలోనే ఉంది. ఐఓఎస్ యూజర్ల మెసేజ్‌లకు వచ్చిన ముప్పేమీ లేదు. యూజర్లు వరుసగా కంప్లైంట్లు చేస్తున్నా వాట్సప్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అసలు మెసేజ్‌లు ఎందుకు డిలిట్ అవుతున్నాయో ఎవరికీ అంతుచిక్కట్లేదు. అయితే వాట్సప్ యూజర్లు తమ ఛాట్స్‌ని గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసుకోకపోతే డిలిట్ చేస్తామని గతేడాది నవంబర్లోనే ప్రకటించింది వాట్సప్. ఏడాదిగా బ్యాకప్ చేసుకోని వారి మెసేజ్‌లు ఆటోమెటిక్‌గా తొలగిస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే పాత మెసేజ్‌లు డిలిట్ చేస్తోందా? లేక ఏదైనా సమస్య ఉందా అన్నది తేలాల్సి ఉంది.