Whatsapp Features: వాట్స‌ప్‌లో కొత్త ఫీచ‌ర్లు.. ఏంటో తెలుసుకోండి

WhatsApp (ప్రతీకాత్మక చిత్రం)

Whatsapp : ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్ (Social media Plat Form) ​వాట్సాప్​ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఛాటింగ్​తో పాటు ఎంతో కీలకమైన డేటా వాట్సాప్​లో (WhatsApp) ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫీచర్లను ఆసక్తికరంగా మారుస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది వాట్సాప్‌.

 • Share this:
  ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్ (Social media Plat Form) ​వాట్సాప్​ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఛాటింగ్​తో పాటు ఎంతో కీలకమైన డేటా వాట్సాప్​లో (WhatsApp) ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫీచర్లను ఆసక్తికరంగా మారుస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది వాట్సాప్‌. మ‌నం రోజూ వాడే వాట్స‌ప్‌కి సంబంధించిన ప‌లు ఫీచ‌ర్లు ఉంటాయి. వాటిని ఉప‌యోగిస్తే వాట్స‌ప్ మ‌రింత సౌక‌ర్యంగా ఉంటుంది. వాటి గురించి తెలుసుకొదాం. అలాంటి ఫీచ‌ర్ల‌లో ఒక‌టి గ్రూప్‌ చాట్‌ విండో (Group chat Window) ద్వారా ఆ కాల్‌లో యూజర్లు జాయిన్‌ కావచ్చు. గ్రూప్‌ చాట్‌ ఐకాన్‌లో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన బటన్‌ను యూజర్లు చూడవచ్చు. అంతే కాకుండా కొత్త ఫోన్​ కొన్నప్పుడుపాత ఫోన్​లోని డేటాను కొత్త దానిలోకి ట్రాన్స్​ఫర్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు చాలా మంది.ఈ క్రమంలో ఒక ఫోన్‌లోని వాట్సప్ డేటా మరో ఫోన్‌లోకి సులభంగా ట్రాన్స్‌ఫర్‌ (WhatsApp Data Transfer) చేసుకునేందుకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

  వాట్సప్​ డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయండిలా..
  వాట్సప్‌ హోమ్‌ పేజీలో కుడి వైపు కనిపించే త్రీ డాట్స్‌ వైపు వెళ్లి క్లిక్‌ చేసి అక్కడ కనిపించే సెట్టింగ్స్‌/చాట్‌/చాట్‌ బ్యాకప్‌లో బ్యాకప్‌పై ట్యాప్‌ చేయాలి.లోకల్‌ బ్యాకప్‌ క్రియేట్‌ అయిన తర్వాత గూగుల్‌ డ్రైవ్ర్ ప్రాంప్ట్‌ను మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. మీ ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజీలో లోకల్‌ బ్యాకప్‌ క్రియేట్ అవుతుంది. లోకల్‌ బ్యాకప్‌ రెడీ అయిన తర్వాత మీరు మీ పాత డివైస్‌లో వాట్సప్‌ అన్‌ ఇన్‌స్టాల్‌ చేయవచ్చు.

  Best Smartphones Under Rs 30,000: బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి


  గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి RAR యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని సెటప్‌ పూర్తి చేయాలి. మీ మొత్తం వాట్సప్‌ డేటాను సింగిల్‌ ఫైల్‌గా కంప్రెస్‌ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

  RAR కాకపోతే మీకు నచ్చిన వేరే ఏదైనా యాప్‌ ఎంచుకోవచ్చు. RAR యాప్‌లో మీరు మీ ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజీ డైరెక్టరీని చూడవచ్చు. అందులోని ‘కామ్‌ వాట్సప్‌’ ఫోల్డర్‌ను ఎంచుకోండి. దాని పక్కనుండే టిక్‌ మార్క్‌ సెలక్ట్ చేసి ఆ ఫోల్డర్‌ పైన కనిపించే+ సింబల్​పై క్లిక్​ చేయండి.మొత్తం ఫోల్డర్‌ ఒక .rar ఫైల్‌లో సేవ్​అవుతుంది. మీ మొత్తం వాట్సప్‌ డేటాను కంప్రెస్‌ చేసేందుకు చాలా టైమ్‌ పడుతుంది. దానికి బదులుగా మీరు .zip ఫైల్‌ ఎంచుకోవడం మంచిది.

  గ్రూప్ చాట్‌కు అవ‌కాశం..
  గ్రూప్‌ చాట్‌ ద్వారా కాల్‌లోకి కనెక్ట్‌ అయ్యే ఫీచర్‌ను నేటి నుంచి అందిస్తున్నాం. చాట్‌ ట్యాబ్‌ ద్వారా ఇప్పుడు నేరుగా గ్రూప్‌ కాల్స్‌లో జాయిన్‌ అవ్వచ్చు. గ్రూప్‌ కాల్స్‌కు ఆదరణ పెరుగుతున్న క్రమంలో జాయినబుల్‌ కాల్స్‌ ద్వారా వాట్సాప్‌ యూజర్స్‌కు కొత్త అనుభూతి అందుతుంది. ఎంతో సులభంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల గ్రూప్స్‌ తో కనెక్ట్ కావచ్చ’ని వాట్సాప్‌ ప్రకటించింది. గ్రూప్‌ కాల్‌లో ఎవరైనా మిస్‌ అయితే కాల్‌ డిస్‌కనెక్ట్ చేసి మళ్లీ కాల్‌ చేసే అవసరాన్ని ఈ కొత్త ఫీచర్‌ తొలగిస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజర్స్‌ కాల్‌లో జాయిన్‌ కావచ్చు. కాల్‌లో మాట్లాడుతున్న వాళ్ల పేర్లు కాకుండా గ్రూప్‌ పేరును నోటిఫికేషన్‌ చూపుతుంది. అయితే గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నవారు మాత్రమే కాల్‌లో జాయిన్‌ కాగలరు. యాప్‌ ఒపెన్‌ చేసిన వెంటనే చాట్‌ లిస్టును కాల్‌ చూపిస్తుంది కాబట్టి ఏ గ్రూపులో కాల్స్‌ నడుస్తున్నాయో చూసి యూజర్స్‌ అందులో జాయిన్‌ అవచ్చు. దీని కోసం ఒక ప్రత్యేకమైన రింగ్‌ టోన్‌ను వాట్సాప్‌ కేటాయించింది. ఇది చాలా హాయిగా మెసేజ్‌ పంపించడం, అందుకోవడం తరహాలో ఉంటుంది.
  Published by:Sharath Chandra
  First published: