హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: రోజు రోజుకీ కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సప్.. ఇక డిలీట్ ఆప్షన్ ఎన్ని రోజుల తర్వాత చేయొచ్చంటే!

WhatsApp: రోజు రోజుకీ కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సప్.. ఇక డిలీట్ ఆప్షన్ ఎన్ని రోజుల తర్వాత చేయొచ్చంటే!

 రోజు రోజుకీ కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సప్.. ఇక డిలీట్ ఆప్షన్ ఎన్ని రోజుల తర్వాత చేయొచ్చంటే!

రోజు రోజుకీ కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సప్.. ఇక డిలీట్ ఆప్షన్ ఎన్ని రోజుల తర్వాత చేయొచ్చంటే!

డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ టైమ్ లిమిట్‌ను వాట్సాప్ సైలెంట్‌గా పెంచేసింది. ప్రస్తుతం వాట్సాప్(WhatsApp) యూజర్లందరూ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ టైమ్‌ లిమిట్‌ను 2 రోజుల కంటే ఎక్కువ సమయం పొందగలుగుతున్నారు. గతంలో బీటా టెస్టర్లందరికీ 2 రోజుల 12 గంటల క్రితం పంపించిన మెసేజ్‌లను సైతం డిలీట్ (Delete)చేసుకునేలా వీలు కల్పించినట్లు వాట్సాప్ ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన యూజర్లు అత్యంత మెరుగ్గా కమ్యూనికేట్ చేసుకునేలా కొత్త ఫీచర్ల(Features)ను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తోంది. గతంలో ఈ మెసేజింగ్ యాప్ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ (Delete For Everyone) ఫీచర్ పరిచయం చేసింది. పంపించిన మెసేజ్‌(Message)ను అందరికీ డిలీట్ చేయాలంటే యూజర్లు ఈ ఆప్షన్‌నే ఉపయోగిస్తారు. ఈ ఆప్షన్ అనేది ఇంతకు మునుపు మెసేజ్ పంపిన 1 గంట, 8 నిమిషాల 16 సెకన్ల వరకే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఈ టైమ్ లిమిట్‌ను వాట్సాప్ సైలెంట్‌గా పెంచేసింది. ప్రస్తుతం వాట్సాప్ యూజర్లందరూ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ టైమ్‌ లిమిట్‌ను 2 రోజుల కంటే ఎక్కువ సమయం పొందగలుగుతున్నారు. గతంలో బీటా టెస్టర్లందరికీ 2 రోజుల 12 గంటల క్రితం పంపించిన మెసేజ్‌లను సైతం డిలీట్ చేసుకునేలా వీలు కల్పించినట్లు వాట్సాప్ ప్రకటించింది. అయితే ఇప్పుడు రెగ్యులర్ యూజర్లందరికీ కూడా ఈ సదుపాయాన్ని కల్పించింది.

ప్రస్తుతం యూజర్లు రెండు రోజుల క్రితం పంపించిన పాత మెసేజ్‌లను కూడా డిలీట్ చేసుకోగలరు. ఇంతకుముందు ఉన్న లిమిట్ కంటే ఇది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఇప్పుడు, రెండు రోజుల క్రితంనాటి మెసేజ్‌లకు కూడా “డిలీట్ ఫర్ ఎవ్రీ వన్” ఆప్షన్‌ కనిపిస్తుంది. అంటే పరిమితి కనీసం రెండు రోజుల వరకు పొడిగించడం జరిగిందని స్పష్టం అవుతోంది. ఈ ఫీచర్ విడుదల చేసినట్లు వాట్సాప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వాట్సాప్ హౌ టు డిలీట్ మెసేజెస్ FAQ పేజీలో కూడా "డిలీట్ ఫర్ ఎవ్రీ వన్" ఆప్షన్ మెసేజ్ పంపిన దాదాపు గంట మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:  Politicians Promises: దేశంలో ఉచిత పథకాల లిస్ట్ ఇదే..! కలర్ టీవీల నుంచి రోబోల వరకూ ఉచితంగా పంచినవే ఇవే..!!


అయితే Android, iOS రెండింటిలో టెస్ట్ చేస్తే 2 రోజుల, 8 గంటల క్రితం పంపిన మెసేజ్‌లు కూడా అందరికీ డిలీట్ అయిపోయాయి. యూజర్లు కూడా ఈ మార్పును గమనిస్తున్నారు. గంటకి మించిన సమయం తర్వాత కూడా మెసేజ్ లను అందరికీ డిలీట్ చేయగలుగుతున్నారు. దీనివల్ల ఇప్పుడు మర్చిపోయినా తర్వాత డిలీట్ చేసుకోవడం సాధ్యమవుతోంది. ఫలితంగా అబ్బా, డిలీట్ చేయడం మర్చిపోయామేనంటూ చింతించాల్సిన పనిలేదు.

మీకు ఫీచర్ అందుబాటులోకి వచ్చిందో లేదో చెక్ చేయడానికి మీరు మీ వాట్సాప్‌లోని ఏదైనా చాట్‌లోకి వెళ్లి, రెండు రోజుల ఓల్డ్ మెసేజ్‌ను డిలీట్ చేయడానికి ప్రయత్నించాలి. డిలీట్ చేస్తున్నప్పుడు ఆ మెసేజ్‌కు కూడా డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ కనిపిస్తే ఈ ఫీచర్ మీకు కూడా అందుబాటులోకి వచ్చినట్లు లెక్క. లేదంటే కొద్దిరోజులపాటు వెయిట్ చేయక తప్పదు. అసభ్యకర మెసేజ్‌లను గ్రూప్‌లో నుంచి డిలీట్ చేసే సామర్థ్యాన్ని అడ్మిన్‌కు అందించే ఒక కొత్త ఫీచర్‌ను కూడా వాట్సాప్ విడుదల చేయనుంది.

First published:

Tags: Android, Smartphone, Tech news, Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు