WhatsApp: యూజర్లను బ్యాన్ చేస్తున్న వాట్సప్... ఎందుకో, మీరేం చేయాలో తెలుసుకోండి

WhatsApp | గ్రూప్స్ పేర్లు, సభ్యుల పేర్ల విషయంలో స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నాయి. వాట్సప్ యూసేజ్ పాలసీ చూస్తే ఈ వివరాలు తెలుస్తుంది. మరి మిమ్మల్ని వాట్సప్ బ్యాన్ చేయొద్దంటే మీరు ఏం చేయాలో, వాట్సప్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: November 13, 2019, 6:31 PM IST
WhatsApp: యూజర్లను బ్యాన్ చేస్తున్న వాట్సప్... ఎందుకో, మీరేం చేయాలో తెలుసుకోండి
WhatsApp: యూజర్లను బ్యాన్ చేస్తున్న వాట్సప్... ఎందుకో, మీరేం చేయాలో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్... ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. వాట్సప్ కారణంగా తప్పుడు సమాచారం ఎక్కువగా సర్క్యులేట్ అవుతుందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నవే. ఫేక్ న్యూస్‌ను అడ్డుకునేందుకు వాట్సప్ కూడా పలు చర్యలు తీసుకుంది. వాట్సప్ ఫార్వర్డ్ లిమిట్‌ను తగ్గించింది. అయితే ఇటీవల వాట్సప్ కందరు యూజర్లను బ్యాన్ చేస్తుందన్న వార్తలొస్తున్నాయి. వాట్సప్ గ్రూప్‌లో ఉన్న సభ్యుల వివరాలు సరిగ్గా లేవన్న కారణంతో వాట్సప్ వారిని బ్యాన్ చేస్తుందని కొందరు యూజర్‌లు ఆన్‌లైన్‌లో కంప్లైంట్ చేస్తున్నారు. అయితే చైల్డ్ సెక్యువల్ అబ్యూస్ అంటే పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన గ్రూపులు, అలాంటి పోస్టులు ఫార్వర్డ్ చేస్తున్న సభ్యుల్ని బ్యాన్ చేస్తోంది వాట్సప్. గ్రూప్స్ పేర్లు, సభ్యుల పేర్ల విషయంలో స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నాయి. వాట్సప్ యూసేజ్ పాలసీ చూస్తే ఈ వివరాలు తెలుస్తుంది. మరి మిమ్మల్ని వాట్సప్ బ్యాన్ చేయొద్దంటే మీరు ఏం చేయాలో, వాట్సప్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

మీ వాట్సప్ గ్రూప్ పేరును ఫన్నీగా పెట్టుకోవచ్చు. కానీ... అభ్యంతరకరంగా ఉండకూడదు. మీరు ఏదైనా వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసేముందు ఓసారి వాట్సప్ సెక్యూరిటీ బ్లాగ్‌, యూసేజ్ రూల్స్ తెలుసుకోవడం మంచిది. ఒకవేళ మీరు వాట్సప్ అడ్మిన్ అయితే మీరు, మీ కో-అడ్మిన్లు గ్రూప్ వివరాలను మార్చొచ్చు అన్న విషయం తెలుసుకోండి. గ్రూప్ సెట్టింగ్స్‌లో గ్రూప్ పేరు, గ్రూప్ ఇన్ఫో లాంటివి మార్చొచ్చు. మీ గ్రూప్‌లోని సభ్యులు ఏవైనా అభ్యంతరకరమైన పోస్టులు ఫార్వర్డ్ చేస్తే హెచ్చరించొచ్చు. నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్టైతే ఆ సభ్యులను తొలగించొచ్చు. ఒకవేళ మీరు యూజర్ అయితే ఏ గ్రూప్‌లో మిమ్మల్ని చేర్చుకోవాలో మీరే నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం ప్రైవసీలో సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఎవరు మిమ్మల్ని వాట్సప్‌ గ్రూప్‌లో చేర్చాలో మీరు సెట్టింగ్స్ చేయొచ్చు. దీని ద్వారా మీరు కోరుకున్నవాళ్లు మాత్రమే గ్రూప్‌లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది.

ఒకవేళ మిమ్మల్ని వాట్సప్ ఇప్పటికే బ్యాన్ చేసినట్టైతే మీ వాట్సప్ గ్రూప్ చైల్డ్ సెక్యువల్ అబ్యూస్‌కు సంబంధించినది కాదని మీరు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. వాట్సప్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న హెల్ప్ ఛానెల్స్ వాడుకొని వాట్సప్‌ను సంప్రదించొచ్చు.

Xiaomi Mi CC9 Pro: 108 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ ఎంఐ సీసీ9 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సప్ యూజర్లకు మరో గుడ్ న్యూస్... కొత్త ఫీచర్ వచ్చేసింది
Loading...
WhatsApp: మీరు పంపిన వాట్సప్ మెసేజ్‌ను 5 సెకండ్లలో మాయం చేయొచ్చు

WhatsApp: వాట్సప్ 1000 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితంగా ఇస్తోందా?
First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...