Home /News /technology /

WHATSAPP BANNED OVER 16 LAKH INDIAN ACCOUNTS IN APRIL FOR VIOLATING GUIDELINES HERE DETAILS NS

WhatsApp: 16 లక్షల మంది భారతీయుల ఖాతాలు బ్లాక్ చేసిన వాట్సాప్.. ఎందుకంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దాదాపు 16 లక్షల మంది వినియోగదారులకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించనందుకు గాను వారి ఖాతాలను బ్లాక్ చేసింది.

    ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) లక్షల సంఖ్యలో ఖాతాలను బ్యాన్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏప్రిల్ నెలలో 16 లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ (India IT Rules) ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉన్న డిజిటల్ కంపెనీలు ఈ వివరాలను ప్రతి నెలా ప్రచురించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన వివరాలను వాట్సాప్ విడుదల చేసింది. రిపోర్టులోని డేటా ప్రకారం.. మెటా మెసేజింగ్ ప్లాట్ ఫాం అయిన వాట్సప్ ఒక్క ఏప్రిల్ లోనే 16లక్షల 66వేల ఖాతాలు బ్యాన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. ఐటీ యాక్ట్ రూల్ 4(1)(d) ప్రకారం.. రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ సేవల్లో తాము నంబర్ 1 గా ఉన్నామని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.

    ఈ నేపథ్యంలో వేధింపులను అడ్డుకోవడమే లక్ష్యంగా డేటా సైంటిస్టులు, ఇంజినీర్లు, అనలిస్టులు, రీసెర్చర్లు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిపుణులు, ఆన్‌లైన్ సేఫ్టి, టెక్నాలజీ డెవలప్‌మెంట్ నిపుణులతో కూడి బృందాలను నియమించినట్లు వెల్లడించింది వాట్సాప్.
    WhatsApp: వాట్సప్‌లో మెసేజ్ తప్పుగా పంపారా? ఎడిట్ చేయొచ్చు

    ఎవరికైనా యూజర్లకు ఇబ్బందికరమైన కంటెంట్ ఏమైనా కనిపిస్తే.. వారే స్వయంగా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది వాట్సాప్. సదరు కాంటాక్ట్‌ను బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. తమకు అందిన పలు వాట్సాప్ ఖాతాలను సైతం బ్యాన్ చేసినట్లు తెలిపింది వాట్సాప్.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు