WhatsApp Banking: బ్యాంకింగ్ సేవలు మీ వాట్సప్‌లో పొందొచ్చు ఇలా

WhatsApp Banking: బ్యాంకింగ్ సేవలు మీ వాట్సప్‌లో పొందొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Banking | టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు మరింత సులువుగా అందుతున్నాయి. వాట్సప్‌లో కూడా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.

  • Share this:
    మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? మీ వాట్సప్ నుంచే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా లాంటి బ్యాంకులు వాట్సప్ ద్వారా బ్యాకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. కస్టమర్లకు కావాల్సిన బ్యాంకింగ్ సమాచారాన్ని వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లకు రియల్ టైమ్‌లో అందిస్తాయి బ్యాంకులు. వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవల్ని పొందేందుకు ఎలాంటి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మరి వాట్సప్‌లో ఏఏ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చో, ఈ సర్వీస్‌కు ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి.

    WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది... వాడుకోండి ఇలా

    ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు ట్రాయ్ షాక్... ఈ ప్లాన్స్ రద్దు

    వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా లభించే సేవలు ఇవే...


    అకౌంట్ బ్యాలెన్స్
    చివరి మూడు లావాదేవీల వివరాలు
    క్రెడిట్ కార్డుల ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్
    క్రెడిట్ కార్డ్ లిమిట్
    డెబిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్ బ్లాక్ చేయడం లేదా అన్‌బ్లాక్ చేయడం
    ప్రీ-అప్రూవ్డ్ లోన్ల వివరాలు తెలుసుకోవడం
    ఇన్‌స్టా సేవ్ సేవింగ్స్ అకౌంట్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయడం

    Smartphone: మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్... ధర రూ.5,774 మాత్రమే

    SBI: ఈ బ్యాంకింగ్ సేవలకు మిస్డ్ కాల్‌, ఎస్ఎంఎస్ చాలు

    వాట్సప్ బ్యాంకింగ్ సేవలు పొందండి ఇలా...


    మీరు కూడా వాట్సప్ బ్యాంకింగ్ సేవలు పొందాలనుకుంటే ముందుగా మీ బ్యాంకుకు సంబంధించిన వాట్సప్ నెంబర్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలి. ఆ వాట్సప్ నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు టెక్స్ట్‌ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ వాట్సప్ నుంచి బ్యాంకు నెంబర్‌కు Hi అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. ఆ తర్వాత వాట్సప్ బ్యాంకింగ్ నియమనిబంధనల్ని అంగీకరించాలి. ఇక అప్పట్నుంచి మీరు వాట్సప్‌లోనే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. వాట్సప్‌లో ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఉంది కాబట్టి మీ మెసేజ్‌లు సురక్షితమే. అయితే వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించేటట్టైతే మీ వాట్సప్‌ యాప్‌కు పాస్‌వర్డ్ లేదా పిన్ ఉపయోగించడం మంచిది.
    Published by:Santhosh Kumar S
    First published: