Home /News /technology /

WHATSAPP ATTACKED BY PEGASUS MALWARE WHAT IS PEGASUS MALWARE HOW CAN YOU DETECT IT SS

WhatsApp Pegasus Malware: వాట్సప్‌పై 'పెగసస్ మాల్‌వేర్' ఎటాక్... ఎంత ప్రమాదమో తెలుసా?

WhatsApp Pegasus Malware: వాట్సప్‌పై 'పెగసస్ మాల్‌వేర్' ఎటాక్... ఎంత ప్రమాదమో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Pegasus Malware: వాట్సప్‌పై 'పెగసస్ మాల్‌వేర్' ఎటాక్... ఎంత ప్రమాదమో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Pegasus Malware | మరి మీ స్మార్ట్‌ఫోన్‌ను పెగసస్ మాల్‌వేర్ ఎటాక్ చేసిందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది అంత సులువుకాదు. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ డివైజ్‌లను పెగసస్ మాల్‌వేర్ ఎటాక్ చేసిందని పరిశోధకులు గుర్తించారు.

    వాట్సప్ యూజర్లకు హెచ్చరిక. వాట్సప్‌పై పెగసస్ మాల్‌వేర్‌తో ఎటాక్ చేశారు హ్యాకర్లు. ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన స్పైవేర్ ఇది. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో వీఐపీల ప్రొఫైల్స్‌ని పెగసస్ మాల్‌వేర్‌తో టార్గెట్ చేశారు హ్యాకర్లు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగుతోంది. అసలేంటి ఈ పెగసస్ మాల్‌వేర్? ఎంత ప్రమాదకరం? ఈ మాల్‌వేర్ తమ ఫోన్‌లోకి ఎలా ఎటాక్ చేస్తుంది? మాల్‌వేర్ ఎటాక్ అయిన విషయం ఎలా తెలుస్తుంది? దీని నుంచి తప్పించుకునేది ఎలా? ఇలా వాట్సప్ యూజర్లలో అన్నీ ప్రశ్నలే. మరి పెగసస్ మాల్‌వేర్ ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. యూజర్ల మెసేజెస్, మెయిల్స్ చెక్ చేయడం దగ్గర్నుంచి కాల్స్ వినడం వరకు పూర్తిగా నిఘా పెడుతుంది పెగసస్ మాల్‌వేర్. అంతేకాదు... మీ బ్రౌజర్ హిస్టరీని చెక్ చేస్తూ మీ డిజిటల్ లైఫ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌కు తెచ్చుకుంటుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఎన్‌క్రిప్టెడ్ వర్షన్‌లో ఉన్న ఆడియోఫైల్స్, టెక్స్ట్‌ ఫైల్స్‌ని కూడా యాక్సెస్ చేయగలదు పెగసస్ మాల్‌వేర్.

    వాట్సప్‌ యూజర్లపై పెగసస్ మాల్‌వేర్ ఎటాక్ చేసిందని యూఏఈకి చెందిన మానవ హక్కుల కార్యకర్త అహ్మద్ మన్సూర్ మొదటిసారిగా గుర్తించారు. పెగసస్ మాల్‌వేర్‌కు టార్గెట్ అయిన వ్యక్తుల్లో తను కూడా ఒకరు. ఆయన ఫోన్‌కు అనుమానాస్పద మెసేజెస్ వచ్చాయి. అందులో ఉన్న లింక్స్‌పై అనుమానం వచ్చింది. దీంతో ఆయన సిటిజన్ ల్యాబ్‌కు చెందిన సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌కు ఆ మెసేజెస్‌ని ఫార్వర్డ్ చేశారు. అది పెగసస్ మాల్‌వేర్‌ టార్గెట్‌గా సదరు సైబర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఓ డివైజ్‌ని పూర్తిగా టార్గెట్ చేసేలా పెగసస్ మాల్‌వేర్‌ను రూపొందించినట్టు డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ క్యాస్పర్‌స్కీ వెల్లడించింది.

    మరి మీ స్మార్ట్‌ఫోన్‌ను పెగసస్ మాల్‌వేర్ ఎటాక్ చేసిందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది అంత సులువుకాదు. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ డివైజ్‌లను పెగసస్ మాల్‌వేర్ ఎటాక్ చేసిందని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది మీ డివైజ్‌లో ఎక్కడ ఉంటుందో తెలియదు. సర్వర్ నుంచి 60 రోజుల పాటు ఎలాంటి కమాండ్ అందకపోతే ఆటోమెటిక్‌గా పెగసస్ మాల్‌వేర్ డిలిట్ అవుతుంది. పెగసస్ మాల్‌వేర్ గురించి తెలియగానే యాపిల్ సెక్యూరిటీ అప్‌డేట్‌ని రిలీజ్ చేసింది. గూగుల్ కూడా సెక్యూరిటీ ప్యాచ్ రిలీజ్ చేయబోతోంది. మీ ఫోన్‌లో ఏదైనా అప్‌డేట్ మెసేజ్ వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ అప్‌డేట్ చేయండి.

    LG W30 Pro: ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్ ప్రారంభం... ఫోన్ ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    PAN Card: పాన్ కార్డు లేదా? ఈ రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చు

    Jio New Plans: రిలయెన్స్ జియో కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

    WhatsApp Banking: వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు... ఇవే లాభాలు
    First published:

    Tags: DATA BREACH, Data theft, Malware, Personal Data, Smart phone virus, Spy, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు