WHATSAPP ARE WANT TO CHANGE FONT SIZE IN WHATSAPP KNOW THIS SIMPLE TRICK USEFUL TO YOU GH EVK
WhatsApp: వాట్సాప్లో ఫాంట్ సైజ్ మార్చుకోవాలా?.. అయితే, ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయిపోండి
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp | వాట్సాప్ ప్రస్తుత స్మార్ట్ ఫోన్(Smart Phone) యుగంలో ప్రతి ఒక్కరూ దీనిని వాడుతున్నారు. మొదటగా ఏవైనా ఫొటోలు(Photos), ఆడియో ఫైల్స్, వీడియోలు(Videos) తెలిసిన వాళ్లకు పంపించేందుకు వాడిన వాట్సాప్ వినియోగం దినదినం (Day By Day) అమాంతం పెరిగిపోయింది.
వాట్సాప్ (WhatsApp) ప్రస్తుత స్మార్ట్ ఫోన్(Smart Phone) యుగంలో ప్రతి ఒక్కరూ దీనిని వాడుతున్నారు. మొదటగా ఏవైనా ఫొటోలు(Photos), ఆడియో ఫైల్స్, వీడియోలు(Videos) తెలిసిన వాళ్లకు పంపించేందుకు వాడిన వాట్సాప్ వినియోగం దినదినం (Day By Day) అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటే వాట్సాప్ లేనిదే రోజూ వారి కార్యక్రమాలు జరగని పరిస్థితి. ఇది పర్సనల్ ఛాటింగ్కే కాకుండా ఆఫీసు పనులకు కూడా కీలకంగా మారింది. అందుకే, మరింత మంది యూజర్లను చేర్చుకునేందుకువాట్సాప్రోజురోజుకూ ఏదో ఒక కొత్త ఫీచర్(Feature)ను పరిచయం చేస్తూవస్తుంది.ఈ ఫీచర్లు వినియోగదారులకు(Customers) మంచి అనుభూతిని అందిస్తున్నాయి. ఇప్పటికే వాట్సాప్ లో అనేక రకాల ఫీచర్లు మనకు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫీచర్లతో మనకు రోజు ఇంకా సులభంగా(Simple) గడుస్తుంది. కానీ అన్ని ఫీచర్లు అందరికీ తెలియవు. ఈ ఫీచర్ల గురించి మనకు పూర్తిగా తెలియకపోతే మెస్సేజులు(Messages) చేసే సమయంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టే ఫీచర్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మనం ఎవరికైనా మెస్సేజులు చేసినా లేక వచ్చిన మెస్సేజులు చదవాలని అనుకున్నా ఫాంట్ సైజ్ మరీ ముఖ్యం. ఫాంట్ సైజ్ సరిగ్గా లేకపోతే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాట్సాప్ ను వాడేటపుడు ఫోన్ లో సెట్ చేసిన ఫాంట్ సైజ్ వాట్సాప్ లో కూడా వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అలా రాదు. వాట్సాప్ యాప్ లో మనం ప్రత్యేకంగా ఫాంట్ సైజ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఫాంట్ సైజ్ ను వాట్సాప్ యాప్ లో ఎలా సెట్ చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ కొన్ని సింపుల్ ట్రిక్స్ ను ఫాలో అయితే వాట్సాప్ లో ఫాంట్ సైజ్ ఎంచుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మనకు కావాల్సిన విధంగా ఫాంట్ సైజ్ సెట్ చేసుకున్న తర్వాత మెస్సేజులు చేయడం చాలా ఈజీగా ఉంటుంది.
ఇలా వాట్సాప్ లో ఫాంట్ సైజ్ సెట్ చేయడం కోసం మీరు ముందుగా మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్ లో ఉన్న త్రీ డాట్స్ మీద మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. అలా దాన్ని క్లిక్ చేసినపుడు మీకు ఒక పాప్ అప్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు చాట్ సెట్టింగ్ లను ఎంచుకుంటే సరిపోతుంది. తర్వాత చాట్ లపై క్లిక్ చేయండి. చాట్ విభాగం ఎంచుకున్న తర్వాత మీకు ఫాంట్ సైజ్ విండో ఓపెన్ అవుతుంది.
ఆ విండోలో మీరు మీకు నచ్చిన విధంగా ఫాంట్ సైజులను ఎంచుకుంటే సరిపోతుంది. ఈ విధానం ద్వారా వాట్సాప్ ఫాంట్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. ఇలా ఫాంట్ సైజ్ ను మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం వలన మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా మెసేజ్లనుచేసుకోవచ్చు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.