WHATSAPP ANOTHER NEW SECURITY FEATURE FROM WHATSAPP DOUBLE VERIFICATION CODE FOR ACCOUNT LOGIN GH VB
WhatsApp: వాట్సాప్ నుంచి మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. అకౌంట్ లాగిన్‌కు డబుల్ వెరిఫికేషన్ కోడ్..
ప్రతీకాత్మక చిత్రం
వాట్సాప్ డబుల్ వెరిఫికేషన్ (Double Verification) అనే ఒక కొత్త వెరిఫికేషన్ సిస్టమ్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp)లో యూజర్ల సంఖ్య పెరుగుతూ ఉంటే మరోవైపు స్కామ్స్ (Scams) కూడా పెరుగుతున్నాయి. అమాయక యూజర్లను మోసం చేసి వారి వాట్సాప్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు ఈజీగా యాక్సెస్ చేస్తున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ డబుల్ వెరిఫికేషన్ (Double Verification) అనే ఒక కొత్త వెరిఫికేషన్ సిస్టమ్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది. "మరొక డివైజ్ నుంచి వాట్సాప్ అకౌంట్‌కు లాగిన్ (Log-in) అవ్వడానికి అదనపు వెరిఫికేషన్ కోడ్ కూడా అవసరమయ్యేలా వాట్సాప్ డబుల్ వెరిఫికేషన్ అనే కొత్త సెక్యూరిటీ ఫీచర్‌పై పని చేస్తోంది" అని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉన్న ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ అప్‌కమింగ్ బీటా వెర్షన్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
* డబుల్ వెరిఫికేషన్ కోడ్ ఎలా పని చేస్తుంది?
ప్రస్తుతం, మీరు మీ వాట్సాప్ అకౌంట్‌కు వేరే డివైజ్ ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు, 6-అంకెల వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ 6 డిజిట్ నంబర్ ఎంటర్ చేయగానే వాట్సాప్‌కు యాక్సెస్ లభిస్తుంది. అయితే వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, డబుల్ వెరిఫికేషన్ ఫీచర్ వల్ల ఈ కోడ్ సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ చేసినా.. వాట్సాప్ అకౌంట్‌కి లాగిన్ అవ్వడానికి మరొక 6-అంకెల కోడ్‌ను కూడా మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్ మీ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. ఈ ఎస్ఎంఎస్లో లాగిన్ అట్టెంప్ట్ గురించి ఒక అలర్ట్ కూడా అందుతుంది.
ఆ విధంగా ఈ లాగిన్ అట్టెంప్ట్ను మీరు కాకుండా ఇతరులు చేస్తున్నట్లయితే మీకు ఈజీగా తెలుస్తుంది. అలా ఇతర వ్యక్తి మీ వాట్సాప్ అకౌంట్‌కి లాగిన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు మీరు గ్రహించవచ్చు. తద్వారా మీకు వచ్చిన సెకండ్ వెరిఫికేషన్ కోడ్‌ను ఎవరితో పంచుకోకుండా జాగ్రత్త పడొచ్చు. ఈ రెండో వెరిఫికేషన్ కోడ్ తెలిస్తే తప్ప ఎవరూ మీ అకౌంట్‌ను యాక్సెస్ చేయలేరు. ఫలితంగా మీ అకౌంట్లోని సున్నితమైన సమాచారం, పర్సనల్ డేటా ఇతర వ్యక్తుల చేతుల్లో పడే అవకాశమే ఉండదు. అలానే వాట్సాప్ అకౌంట్లను స్వాధీనం చేసుకునే స్కామర్ల బెడద తగ్గుతుంది.
ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు విడుదలైనప్పుడు మరొక డివైజ్ నుంచి యూజర్‌కు సంబంధించిన వాట్సాప్ అకౌంట్‌కు లాగిన్ అవ్వాలంటే అదనపు వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయడం తప్పనిసరి. ఈ ఫీచర్ బీటా టెస్టర్లతో పాటు సాధారణ యూజర్లందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి ఇతర వ్యక్తులు సిక్స్ డిజిట్ కోడ్‌ను అడిగితే వాటిని షేర్ చేయకపోవడమే మంచిది. వాట్సాప్ ఇంకా మరిన్ని ఫీచర్లు పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. స్టేటస్ రిప్లై ఇండికేటర్ ఫీచర్, డిలీటెడ్ మెసేజ్‌లను అన్డూ చేసే ఫీచర్, మెసేజ్ ఎడిట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను లాంచ్ చేసే పనిలో వాట్సాప్ నిమగ్నమైంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.