ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) తరచుగా సరికొత్త ఫీచర్లను (New Features) పరిచయం చేస్తూ యూజర్ ఎక్స్పీరియన్స్ ను మెరుగుపరుస్తోంది. ఈ ఏడాది మరిన్ని ఫీచర్లను పరిచయం చేసే దిశగా వాట్సాప్ అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రూప్స్ (Groups)కు సంబంధించి వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లను ప్రకటించింది. వేర్వేరు గ్రూప్స్ లోని మెంబర్స్ ఒకే చోట కమ్యూనికేట్ అయ్యేందుకు వీలుగా కమ్యూనిటీస్ ఫీచర్ (Communities Feature)ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. అంతేకాదు, గ్రూప్స్ కోసం అడ్మిన్ డిలీట్ (Admin Delete), లార్జ్ వాయిస్ కాల్స్ (Large Voice Calls), మెసేజ్ రియాక్షన్లు (Message Reactions), లార్జ్ ఫైల్ షేరింగ్ (Large File Sharing) అనే నాలుగు కొత్త ఫీచర్లను కూడా ఆవిష్కరించింది.
వాట్సాప్ కమ్యూనిటీస్ ఫీచర్
కమ్యూనిటీస్ ఫీచర్ సాయంతో యూజర్లు మొత్తం కమ్యూనిటీకి పంపిన అప్డేట్లను రిసీవ్ చేసుకోవచ్చని, ముఖ్యమైన అప్డేట్లపై స్మాల్ డిస్కషన్ గ్రూప్స్ ఆర్గనైజ్ చేయవచ్చని వాట్సాప్ పేర్కొంది. ఈ ఫీచర్ అడ్మిన్ల కోసం కొత్త టూల్స్‌ని కూడా తీసుకువస్తుంది. ఇందులో అందరికీ పంపే అనౌన్స్మెంట్ మెసేజెస్ విషయంలో ఏయే గ్రూప్‌లను చేర్చవచ్చో అడ్మిన్లు నిర్ణయించుకోవచ్చు. ఈ ఫీచర్‌తో స్కూళ్లు, లోకల్ క్లబ్‌లు, తదితర సంస్థలు ఒకే తాటిపైకి ఈజీగా వచ్చేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వాట్సాప్. దీనివల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ అనేదే ఉండదు.
కొత్త వాట్సాప్ గ్రూప్ ఫీచర్లు
గ్రూప్స్ కోసం రియాక్షన్లు, అడ్మిన్ డిలీట్, ఫైల్ షేరింగ్, లార్జ్ వాయిస్ కాల్స్ అనే నాలుగు కొత్త ఫీచర్లను వాట్సాప్ జోడిస్తుంది.
రియాక్షన్లు
కొత్త మెసేజ్ లతో చాట్లను ముంచెత్తకుండా యూజర్లు తమ అభిప్రాయాలను త్వరగా పంచుకోవడానికి వాట్సాప్ ఎమోజీ రియాక్షన్లను తీసుకొస్తోంది. అయితే మెసేజ్ కి రియాక్ట్ అవ్వాలి అంటే గ్రూప్ లో ఎవరైనా ఒక మెసేజ్ పంపించాల్సి ఉంటుంది.
అడ్మిన్ డిలీట్
వాట్సాప్ ఇప్పుడు గ్రూప్ అడ్మిన్లను ప్రతి ఒక్కరి చాట్ నుంచి వివాదాస్పద, ఇబ్బందికర, తప్పుడు, ప్రాబ్లమ్యాటిక్ మెసేజెస్ లను డిలీట్ చేయడానికి అనుమతిస్తుంది. గ్రూప్ అడ్మిన్ వీటిని ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు.
ఫైల్ షేరింగ్
యూజర్లు 2జీబీ వరకు సైజు ఉన్న ఫైల్‌లను షేర్ చేసుకునేలా ఫైల్ షేరింగ్ లిమిట్ ను కూడా వాట్సాప్ పెంచుతోంది.
లార్జ్ వాయిస్ కాల్స్
వాట్సాప్ గతంలో 4 నుంచి 8 మంది మెంబర్లు గ్రూప్ కాల్స్ చేసుకునేందుకు అనుమతించింది. ఇప్పుడు వాట్సాప్ ఒకేసారి 32 మంది మెంబర్లు వాయిస్ కాల్స్ చేసేందుకు అనుమతిస్తోంది. వాయిస్ కాల్స్ ఇంటర్ఫేస్ను కూడా వాట్సాప్ రీడిజైన్ చేసింది. ఈ ఫీచర్లు మరికొద్ది వారాల్లో అందుబాటులోకి రానున్నాయని వాట్సాప్ వెల్లడించింది. బీటా యూజర్లు వీటిని అందరికంటే ముందు వాడొచ్చని వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్లు మొదటగా బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తాయి, ఆ తర్వాత రెగ్యులర్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.