WHATSAPP ADDS SHOPPING BUTTON ALLOWS USERS NEW SHOPPING EXPERIENCE AND HELPS BUSINESSES TO CONNECT CUSTOMERS SS
WhatsApp Shopping: వాట్సప్‌లో షాపింగ్ చేయొచ్చు... కొత్త ఫీచర్ వచ్చేసింది
WhatsApp Shopping: వాట్సప్‌లో షాపింగ్ చేయొచ్చు... కొత్త ఫీచర్ వచ్చేసింది
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp Shopping | మీరు ఇకపై షాపింగ్ చేయాలంటే వాట్సప్ ఓపెన్ చేస్తే చాలు. వాట్సప్‌లో కొత్తగా షాపింగ్ ఫీచర్ ప్రారంభమైంది. ఎలా షాపింగ్ చేయాలో తెలుసుకోండి.
వాట్సప్ యూజర్లకు శుభవార్త. ఇకపై మీరు వాట్సప్‌లో షాపింగ్ చేయొచ్చు. యాప్‌లో మీకు ఇకపై షాపింగ్ బటన్ కనిపించనుంది. డైరెక్ట్ క్యాటలాగ్ ఓపెన్ చేసి ప్రొడక్ట్స్ కొనొచ్చు. బిజినెస్ అకౌంట్స్ ఉన్నవారికి ఈ షాపింగ్ ఫీచర్ పనిచేస్తుంది. కేటలాగ్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని ఓపెన్ చేసి, చూసి, నచ్చితే వెంటనే వాట్సప్‌లోనే కొనొచ్చు. ప్రపంచవ్యాప్తంగా షాపింగ్ ఫీచర్‌ను యాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. వాయిస్ కాల్ బటన్ ప్లేస్‌లో ఇక షాపింగ్ బటన్ కనిపించనుంది. కాల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వాయిస్ లేదా వీడియో కాల్ సెలెక్ట్ చేయొచ్చు. ఇక గతంలో బిజినెస్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే కేటలాగ్ కనిపించేది. ఇప్పుడు అక్కడ షాపింగ్ బటన్ కనిపిస్తుంది. కాబట్టి ప్రొడక్ట్స్‌ని బ్రౌజ్ చేసి షాపింగ్ చేయొచ్చు. బిజినెస్ అకౌంట్ ఉన్న వ్యాపారులు తమ సేల్స్ పెంచుకోవడానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం రోజూ వాట్సప్ బిజినెస్ అకౌంట్లో 17.5 కోట్ల మంది మెసేజెస్ పంపిస్తున్నారని వాట్సప్ లెక్కలు చెబుతున్నాయి. ప్రతీ నెలలో 4 కోట్ల మంది బిజినెస్ క్యాటలాగ్ చూస్తున్నారు. వారిలో 30 లక్షల మంది ఇండియా నుంచే ఉన్నారు. ఇటీవల జరిపిన ఓ సర్వేలో 'వ్యాపారులతో కాంటాక్ట్ అయ్యేవారి దగ్గరే వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు' 76 శాతం మంది తెలిపారు.
వాట్సప్‌లో షాపింగ్ బటన్ ఎలా పనిచేస్తుందంటే... వాట్సప్‌లో ఎవరిదైనా బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ పక్కన షాపింగ్ బటన్ కనిపిస్తుంది.
షాపింగ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ కేటలాగ్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రొడక్ట్స్ జాబితా కనిపిస్తుంది. ప్రొడక్ట్స్ బ్రౌజ్ చేసిన తర్వాత మీకు నచ్చిన వస్తువు సెలెక్ట్ చేయాలి. నేరుగా ఆ బిజినెస్ నిర్వహించేవాళ్లను కాంటాక్ట్ చేసి ప్రొడక్ట్ కొనొచ్చు. షాపింగ్ బటన్ ద్వారా యూజర్లకు షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్ సులభం చేయడంతో పాటు వ్యాపారులు ఎక్కువ మంది కస్టమర్లతో కాంటాక్ట్ అయ్యేందుకు ఉపయోగపడేలా చేయాలనుకుంటోంది వాట్సప్. ఇక ఇటీవలే ఇండియాలో వాట్సప్ పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై ఎవరికైనా డబ్బులు పంపాలన్నా, స్వీకరించాలన్నా వాట్సప్‌లో సాధ్యం.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.