వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్, ఎమోజీలకు కొత్త లుక్

WhatsApp Fingerprint | ఫింగర్‌ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ ఆథెంటికేషన్ సిస్టమ్‌ను బీటావర్షన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2.19.21 స్టేబుల్ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత యూజర్లు ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ వాడుకోవచ్చు.

news18-telugu
Updated: January 28, 2019, 10:36 AM IST
వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్, ఎమోజీలకు కొత్త లుక్
వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్, ఎమోజీలకు కొత్త లుక్ (image: Reuters)
news18-telugu
Updated: January 28, 2019, 10:36 AM IST
మీరు మీ వాట్సప్ అప్‌డేట్ చేశారా? మీ దగ్గర బీటా వర్షన్ 2.19.21 ఉన్నట్టైతే వాట్సప్‌లో కొత్త ఫీచర్లు వాడుకోవచ్చు. ఈ వర్షన్‌లో ఎమోజీ లేఔట్‌ను మార్చేసింది వాట్సప్. అంతేకాదు ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ రికగ్నిషన్ కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్లు బీటా వర్షన్ 2.19.21 ఉన్నవారికే ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఎమోజీలనే కాస్త మార్చింది వాట్సప్. వాటిని జాగ్రత్తగా గమనిస్తే తప్ప మార్పులు గుర్తించలేరు. మారిన ఎమోజీలు ఇలా ఉండబోతున్నాయి.

WhatsApp Fingerprint, WhatsApp face id, WhatsApp new features, WhatsApp features 2019, WhatsApp Emojis, WhatsApp New Emojis, వాట్సప్ ఫింగర్‌ప్రింట్, వాట్సప్ కొత్త ఫీచర్లు, వాట్సప్ ఫీచర్లు 2019, వాట్సప్ ఎమొజీ, వాట్సప్ ఫేస్ ఐడీ

ఇది కూడా చదవండి: WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

వాట్సప్‌కు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని ముందే చెప్పే WABetaInfo బ్లాగ్‌పోస్ట్‌లో ఈ కొత్త మార్పుల గురించి వివరించడం విశేషం. మొత్తం 357 ఎమోజీలను మార్చేందుకు కొంతకాలం క్రితమే కసరత్తు మొదలుపెట్టింది వాట్సప్. దాంతో పాటు గతంలోనే చెప్పిన ఫింగర్‌ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ ఆథెంటికేషన్ సిస్టమ్‌ను బీటావర్షన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2.19.21 స్టేబుల్ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత యూజర్లు ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ వాడుకోవచ్చు. ఒకసారి ఈ అప్‌డేట్ చేసిన తర్వాత వాట్సప్‌ని కూడా యాప్ లాకర్‌లా వాడుకోవచ్చు. మీరు వాట్సప్ యాప్ ఓపెన్ చేయాలనుకుంటే ఫింగర్ ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి.ఇది కూడా చదవండి: WhatsApp Dark Mode: వాట్సప్‌లో డార్క్ మోడ్ ఇలాగే ఉండబోతోంది

ఈ కొత్త ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు లభిస్తుంది. ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు అందజేయనుంది. ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో కన్నా ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నవాళ్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే మీ యాప్‌కు ఫుల్ ప్రొటెక్షన్ లభించినట్టే. ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ మాత్రమే కాదు... ఈ ఏడాది మరిన్ని కొత్త ఫీచర్లు అందించేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. అందులో డార్క్ మోడ్, మీడియా ప్రివ్యూ, స్టిక్కర్ సెర్చ్, కాన్‌సెక్యుటీవ్ వాయిస్ మెసేజ్ లాంటివి ఉండబోతున్నాయి.
Loading...
ఇవి కూడా చదవండి:

IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...

Income Tax: డెడ్‌లైన్ దగ్గరపడుతోంది... ట్యాక్స్ ఇలా ఆదా చేయొచ్చు

SBI Recurring Deposit: ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్‌తో లాభాలు ఇవే
First published: January 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...