Home /News /technology /

WHATSAPP ADDING ADVANCED SEARCH FEATURE KNOW HOW IT WILL HELP YOU GH VB

WhatsApp: వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్.. ఈ ఫీచర్‌తో ఉపయోగాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) కొత్త సంవత్సరంలో సరికొత్త ఫీచర్లతో(New Features) యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. బిజినెస్ (WhatsApp Business) యూజర్ల కోసం కూడా అదిరిపోయే ఫీచర్లను అందించడానికి వాట్సాప్ సిద్ధమవుతోంది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) కొత్త సంవత్సరంలో సరికొత్త ఫీచర్లతో(New Features) యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. బిజినెస్ (WhatsApp Business) యూజర్ల కోసం కూడా అదిరిపోయే ఫీచర్లను అందించడానికి వాట్సాప్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం వాట్సాప్ అడ్వాన్స్‌డ్ సెర్చ్ (Advanced Search) అనే ఓ కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు యాప్‌లో చాలా సులభంగా మెసేజ్‌లు సెర్చ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు చాట్‌బాక్స్‌లో సెర్చ్ చేసేందుకు వీలుగా కాంటాక్ట్స్, నాన్ కాంటాక్ట్స్, అన్‌రీడ్ అనే మూడు ఫిల్టర్లను పొందుతారు. ఈ ఫిల్టర్లపై క్లిక్ చేస్తూ ఈజీగా మెసేజ్‌లను వెతుక్కోవచ్చు. వాట్సాప్ సంస్థ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ యూజర్ల కోసం కూడా ఈ ఫీచర్‌(New feature) ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

Zodiac Signs: ఈ రాశుల వారు ప్రేయసి వద్ద ఆ విషయంలో ముందుంటారు.. మీరు ఈ రాశి వారేనా..?


సాధారణంగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్లలో చాట్‌బాక్స్‌లో చాలా థ్రెడ్‌లు ఉంటాయి. వాటిని బ్రౌజ్ చేయలేక ప్రస్తుతం బిజినెస్ యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వీరికి అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. అయితే దీనివల్ల వాట్సాప్ వినియోగదారులకు అంతగా ఉపయోగం లేదని.. అందుకే దీన్ని వాట్సాప్ రెగ్యులర్ యూజర్లకు తీసుకు రావడం లేదని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

“అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫిల్టర్‌లను ఉపయోగించి మీ చాట్‌లు, మెసేజ్‌లను ఫిల్టర్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఇప్పుడు విడుదల చేస్తోంది. ఈ ఫీచర్ వచ్చాక వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌లో చాట్‌లు, మెసేజ్‌ల కోసం సెర్చ్ చేసినప్పుడు.. కాంటాక్ట్‌లు, నాన్-కాంటాక్ట్‌లు, అన్‌రీడ్ అనే కేటగిరీలు కనిపిస్తాయి." అని వాట్సాప్ బీటా ఇన్ఫో రాసింది. యూజర్లు ఈ ఆప్షన్స్ ఉపయోగించి తమకు నచ్చిన రిజల్ట్స్ త్వరగా వీక్షించవచ్చు. మీరు నాన్-కాంటాక్ట్స్ మెసేజ్‌లు చదవాలనుకుంటే.. సెర్చ్ ఐకాన్‌పై క్లిక్ చేసి నాన్ కాంటాక్ట్స్ అనే ఫిల్టర్ పై ట్యాప్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇప్పటికే అవైలబుల్‌లో ఉన్న సెర్చ్ ఫిల్టర్లను కొత్త ఫిల్టర్లతో కలిపి వాడుకోవచ్చు. నాన్-కాంటాక్ట్స్‌లోని ఫొటోలను చూడాలనుకుంటే.. సింపుల్‌గా సెర్చ్ బార్ కింద 'Photos'.. 'Non-contacts' ఫిల్టర్లపై క్లిక్ చేస్తే సరిపోతుంది.

Astrological Remedies: ఉద్యోగం కోసం చూస్తున్నారా.. ప్రమోషన్ రావడం లేదా.. అయితే ఈ జ్యోతిష్య పరిహారాలు పాటించండి..


వాట్సాప్ బీటా ఇన్ఫో స్క్రీన్‌షాట్ ప్రకారం.. ఆండ్రాయిడ్ వాట్సాప్ బిజినెస్ యాప్ లో ఫోటోలు, గిఫ్ లు, వీడియోలు, ఆడియో, లింక్‌లు, డాక్యుమెంట్స్ వంటి ప్రస్తుత ఆప్షన్స్‌‌తో పాటు పైన పేర్కొన్న విధంగా మూడు అదనపు కేటగిరీలు కనిపించాయి. ఈ అదనపు కేటగిరీలు యూజర్ల సెర్చ్ టైమ్ ను బాగా తగ్గిస్తాయి.
Published by:Veera Babu
First published:

Tags: Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు