Whats App: వాట్సాప్లో కొత్త ఫీచర్.. మీ లాస్ట్ సీన్ టైమ్ ఇతరులు చూడకుండా హైడ్ చేసుకోవచ్చు

ప్రతీకాత్మకచిత్రం

Whats App New Feature: యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీజర్లను జోడిస్తోంది. ఇదే స్పీడ్లో వాట్సాప్ తాజాగా ఓ కొత్త ఫీచర్పై పనిచేస్తుంది.

  • Share this:
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whats App) అంటే తెలియని వారుండరు. చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా ప్రతి మొబైల్ యూజర్ దీన్ని వాడుతుంటారు. ప్రస్తుతం వాట్సాప్ చూడనిదే రోజు గడవదు అనే పరిస్థితి నెలకొంది. ఈ ప్రపంచంలో వాట్సాప్ యాప్ లేని స్మార్ట్ ఫోన్ (Smart Phone) ఉండదంటే అతిశయోక్తికాదు. అందుకే సోషల్ మీడియా (Social Media) ఇప్పటికీ వాట్సాప్ దే అగ్రస్థానం. ఈ స్థానాన్ని కొనసాగించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీజర్లను జోడిస్తోంది. ఇదే స్పీడ్ లో వాట్సాప్ తాజాగా ఓ కొత్త ఫీచర్ (Whats App News Feature) పై పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ కాంటాక్ట్లోని ఎవరినైనా మీ లాస్ట్ సీన్ టైమ్ చూడకుండా హైడ్ చేయవచ్చు. దీనికోసం ప్రైవసీ సెట్టింగ్లో ఇప్పటివరకు నో బడీ, ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్లు కనిపించేవి. అయితే వాట్సాప్ ఇప్పుడు ఈ మూడింటితో పాటు ‘మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ అనే ఆప్షన్ను కూడా జోడించనుంది.

ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ సెట్టింగ్.. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఎంచుకున్న యూజర్కు మీ లాస్ట్ సీన్ కన్పించదు. అంటే, మీరు చివరగా ఎప్పుడు వాట్సాప్ ఉపయోగించారో వారు తెలుసుకోలేరు. ఈ అద్భుతమైన ఫీచర్ను వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్ లో భాగంగా తెస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రైవసీ సెట్టింగ్ ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ కు అందుబాటులో ఉంది.

ఇది చదవండి: అమ్మాయిలు మీరు వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారా..? అయితే.. మీ డేటా వాళ్ల చేతుల్లోకి..!


వాట్సాప్ స్టేటస్ (Whats App Status) ను నిర్దిష్టమైన యూజర్ చూడకుండా ఉండేందుకు మనం వారిని హైడ్ చేసే అవకాశం ఉంది. కానీ లాస్ట్ సీన్ విషయంలో మాత్రం గతంలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. ఇప్పుడు ఇది కూడా అందుబాటులోకి రావడంతో యూజర్లకు మరింత ప్రైవసీ చేకూరనుంది. కాగా, ప్రస్తుతం ఈ సెట్టింగ్ను కేవలం ఐఓఎస్ యూజర్ల కోసం పరీక్షిస్తుండగా త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం అందుబాటులోకి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది చదవండి: గూగుల్ క్లాక్‌ యాప్‌లో కొత్త బగ్.. మూగబోతున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ అలారం.. సమస్యను ఎలా పరిష్కరించాలంటే..


బీటా టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్..
WABetaInfo నివేదిక ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో చూపించనప్పటికీ.. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను మాత్రం షేర్ చేసింది. ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని, అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని WABetaInfo తెలిపింది. వాట్సాప్ ఇటీవల మైగ్రేట్ అనే ఒక కొత్త ఫీచర్‌ని ప్రకటించింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వాడే యూజర్ల చాట్‌లను ఒక ఓఎస్ నుండి మరొక ఓఎస్కి మైగ్రేట్ చేసేందుకు అనుమతిస్తుంది.
Published by:Purna Chandra
First published: