మరింత కఠినంగా వాట్సాప్..వినియోగదారులకు చేదువార్త

‘వాట్సాప్’ వినియోగదారులతో  ఈ మధ్య చాలా కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందులో కీలకమైనది.. కేవలం ఐదుగురికి మాత్రమే మెసేజ్‌లు ఫార్వార్డ్ చేసే పరిమితి పెట్టడం. అయితే ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: January 22, 2019, 5:29 AM IST
మరింత కఠినంగా వాట్సాప్..వినియోగదారులకు చేదువార్త
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
‘వాట్సాప్’ వినియోగదారులతో  ఈ మధ్య చాలా కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందులో కీలకమైనది.. కేవలం ఐదుగురికి మాత్రమే మెసేజ్‌లు ఫార్వార్డ్ చేసే పరిమితి పెట్టడం..అయితే ఈ పరిమితి కేవలం ఇండియాలో ఇంతవరకు అమలులో ఉంది. ఇప్పుడీ నిబంధనను ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది ‘వాట్సాప్’. కారణం.. వాట్సాప్‌లో విచ్చలవిడిగా ఫేక్ న్యూస్‌ వ్యాప్తి చెందుతుందని దాని యాజమాన్యం భావిస్తోంది.  దీంతో ఫేక్ న్యూస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సోమవారం ‘వాట్సాప్’ తన బ్లాగ్ ద్వారా వెల్లడించింది. ఈ కొత్త నిర్ణయం వల్ల ఇకపై ప్రైవేటు మెసేజ్‌లను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం వుంటుందని పేర్కొంది. ఈ  నిర్ణయం అమలు కావడంతో.. లేటెస్ట్ వెర్షన్ యూజర్లందరూ ఇప్పటి నుంచి మెసేజ్‌లను కేవలం ఐదుగురికి మాత్రమే ఫార్వార్డ్ చేయగలుగుతారు.
First published: January 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading