WhatApp Stickers: వాట్సప్‌లో స్టిక్కర్లు మీరే తయారు చేసుకోండి ఇలా...

WhatApp Stickers: వాట్సప్ స్టిక్కర్ల తయారీ కోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించేముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు డౌన్‌లోడ్ చేసేది థర్డ్ పార్టీ యాప్ కాబట్టి వాటికి పర్మిషన్లు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.

news18-telugu
Updated: January 12, 2019, 9:44 PM IST
WhatApp Stickers: వాట్సప్‌లో స్టిక్కర్లు మీరే తయారు చేసుకోండి ఇలా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాట్సప్ స్టిక్కర్స్... ఈమధ్యకాలంలో వాట్సప్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. వాట్సప్‌లో డిఫాల్ట్‌గా వచ్చే స్టిక్కర్లతో పాటు యాప్ స్టోర్‌ నుంచి స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకొని మూడ్, ఈవెంట్‌కు తగ్గట్టుగా వాటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మీరూ సొంతగా వాట్సప్ స్టిక్కర్స్ తయారు చేయొచ్చు. ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. వాటిని తయారు చేయడమే కాదు, ఆ స్టిక్కర్లను మీ వాట్సప్‌లోకి పబ్లిష్ చేయడం కూడా సులువే. జస్ట్ కొన్ని నిమిషాల్లో మీకు కావాల్సినట్టు స్టిక్కర్స్ తయారు చేయొచ్చు. అయితే వాట్సప్ స్టిక్కర్ల తయారీ కోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించేముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు డౌన్‌లోడ్ చేసేది థర్డ్ పార్టీ యాప్ కాబట్టి వాటికి పర్మిషన్లు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్ మీ డేటాను కాజేసే ప్రమాదం కూడా ఉంది. ఇవి తెలుసుకున్న తర్వాతే థర్డ్ పార్టీ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసి ఉపయోగించండి.

వాట్సప్‌లో స్టిక్కర్లు ఎలా తయారు చేయాలి?



గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సప్ స్టిక్కర్ మేకర్ అని టైప్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఆ యాప్‌లో న్యూ స్టిక్కర్ ప్యాక్‌పైన క్లిక్ చేయాలి.
స్టిక్కర్ ప్యాక్‌, ఆథర్ నేమ్ టైప్ చేయాలి.
స్క్రీన్‌లో 30 టైల్స్ కనిపిస్తాయి. ఏదైనా ఓ టైల్ సెలెక్ట్ చేసుకొని గ్యాలరీలోంచి ఫోటో సెలెక్ట్ చేయాలి.
మీకు కావాల్సినట్టుగా ఫోటో షేప్ కట్ చేయాలి.క్రాప్ చేయడం పూర్తైన తర్వాత స్టిక్కర్ సేవ్ చేయాలి.
మూడు స్టిక్కర్లు యాడ్ చేసిన తర్వాత వాటిని వాట్సప్‌లోకి యాడ్ చేయాలి.
ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఎమొజీ క్లిక్ చేస్తే స్టిక్కర్స్ ఐకాన్ కనిపిస్తుంది.
అందులో మీరు కొత్తగా క్రియేట్ చేసిన స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.
మీరు తయారు చేసిన స్టిక్కర్ ప్యాక్ నచ్చకపోతే త్రీ డాట్స్ ఐకాన్ క్లిక్ చేసి డిలిట్ చేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

PUBG Mobile: పబ్‌జీ ఆడుతున్నారా? ఈ 10 తప్పులు చేస్తే నిషేధం తప్పదు

Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్

మొబైల్ వ్యాలెట్‌లో డబ్బులు పోయాయా? మీరేం చేయాలో తెలుసుకోండి

Fake Apps: 85 యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?
First published: January 12, 2019, 9:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading