రాత్రి 10.30 గంటలకు యాపిల్ ఈవెంట్‌

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ లవర్స్ ఎదురుచూస్తున్న ఈవెంట్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. భారతకాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.30 గంటలకు ఈవెంట్ జరగనుంది.

news18-telugu
Updated: September 12, 2018, 1:41 PM IST
రాత్రి 10.30 గంటలకు యాపిల్ ఈవెంట్‌
(image: Apple Byte Crunch)
  • Share this:
యాపిల్ ఈవెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ఈవెంట్‌లో ఏఏ ప్రొడక్ట్స్ లాంఛ్ కానున్నాయో ఇప్పటికే కొన్ని లీక్స్ వచ్చాయి. ఆ లీక్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే ఈవెంట్ వరకు ఆగాల్సిందే. అయితే యాపిల్ ఏఏ ప్రొడక్ట్స్ లాంఛ్ చేయనుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మూడు ఫోన్లు
యాపిల్ మూడు కొత్త ఐఫోన్లు లాంఛ్ చేస్తుందని అంచనా. 5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్‌తో ఐఫోన్ ఎక్స్‌సీ మోడల్, 6.5 అంగుళాల ఓలెడ్ స్క్రీన్‌తో ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్, 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఐఫోన్ ఎక్స్ఎస్ ఫోన్లు కావచ్చన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అంచనా వేస్తున్న దాని కన్నా ఈసారి ఫోన్ల ధరలు ఎక్కువగా ఉంటాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకుడు వంశీమోహన్ అంచనా ప్రకారం ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్ ధర సుమారు రూ.75,000, ఐఫోన్ ఎక్స్ఎస్ ధర సుమారు 71,000, ఐఫోన్ ఎక్స్‌సీ ధర రూ.57,000. ఈ ఫోన్లకు సంబంధించిన ఫోటోలు లీకయ్యాయి.

12న రాత్రి 10.30 గంటలకు యాపిల్ ఈవెంట్‌, What to Expect at Apple’s iPhone Event Tomorrow: 'S' and Beyondరెండు ఐప్యాడ్ ప్రో మోడల్స్
ఐఫోన్లతో పాటు యాపిల్ ఐప్యాడ్ ప్రో మోడల్స్‌ని కూడా లాంఛ్ చేయనుంది. అవి హోమ్ బటన్ లేకుండా ఫేస్ ఐడీతో వస్తాయని భావిస్తున్నారు. ఒకటి 12.9 అంగుళాలు, మరొకటి 10.5 అంగుళాల డిస్‌ప్లేతో ఉంటాయని అంచనా.

12న రాత్రి 10.30 గంటలకు యాపిల్ ఈవెంట్‌, What to Expect at Apple’s iPhone Event Tomorrow: 'S' and Beyondసరికొత్త మ్యాక్ లైనప్
ఈ ఈవెంట్‌లో సరికొత్త మ్యాక్ లైనప్‌ కూడా లాంఛ్ కానుందని ప్రచారం జరుగుతోంది. మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ప్రో, ఐమ్యాక్‌తో పాటు మ్యాక్ మినీ కూడా ఉండొచ్చు. డిస్‌ప్లే పెర్ఫామెన్స్‌లో అప్‌గ్రేడ్స్ చాలా ఉంటాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో పాటు తక్కువ ధర గల నోట్‌బుక్‌ను మ్యాక్ బుక్ ఎయిర్ పేరుతో లాంఛ్ చేయనుంది యాపిల్.

12న రాత్రి 10.30 గంటలకు యాపిల్ ఈవెంట్‌, What to Expect at Apple’s iPhone Event Tomorrow: 'S' and Beyond

2018 యాపిల్ వాచ్
వీటన్నిటితో పాటు 2018 యాపిల్ వాచ్ కూడా లాంఛ్ కానుంది. 1.57 అంగుళాలు, 1.78 అంగుళాల పెద్ద డిస్‌ప్లేలతో యాపిల్ వాచ్ ఉంటాయని భావిస్తున్నారు. ఇంకా ఎలాంటి మార్పులు ఉంటాయన్నది తెలియదు.

ఇవి కూడా చదవండి:

ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్

బీపీ చెక్ చేసే ఐఫోన్ యాప్!

మోటో జీ6 ప్లస్ వచ్చేసింది!

ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న 'ఇన్విజిబుల్ ఛాలెంజ్'

Video: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్

Video: ఆరోగ్యం కోసం 10 సూపర్‌ఫుడ్స్!

పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

 
First published: September 12, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు