వాట్సప్‌లో అభ్యంతరకర పోస్ట్ వస్తే మీరేం చేయాలంటే..!

వాట్సప్... ఫేక్ న్యూస్‌తో పాటు అభ్యంతరక సందేశాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు అడ్డా. మరి మీరున్న గ్రూప్‌లో, లేక మీకు పర్సనల్‌గానో అలాంటి పోస్ట్ వస్తే ఏం చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 25, 2018, 11:31 AM IST
వాట్సప్‌లో అభ్యంతరకర పోస్ట్ వస్తే మీరేం చేయాలంటే..!
image. Reuters
  • Share this:
మీకు మధ్యప్రదేశ్‌కు చెందిన జునైద్ ఖాన్ గురించి తెలుసుగా. ఓ గ్రూప్‌లో డిఫాల్ట్ అడ్మిన్ కావడం, అందులో అభ్యంతరక పోస్టులు ఉండటంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. వాస్తవానికి ఆ గ్రూప్ క్రియేట్ చేసింది వేరొకరు. ఆ అడ్మిన్ ఎగ్జిట్ కావడంతో డిఫాల్ట్‌గా జునైద్ అడ్మిన్ అయ్యాడు. అంతకుముందు అడ్మిన్ చేసిన పోస్ట్‌కు జునైద్ చిక్కుల్లో పడ్డాడు. జైలుపాలయ్యాడు. ఐటీ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్ 124 ఏ కింద కేసు పెట్టారు పోలీసులు. ఐదు నెలలుగా జునైద్ జైలులోనే ఉన్నాడు. జునైద్ కథ ఇప్పుడు వాట్సప్ వాడుతున్నవారందరికీ ఓ హెచ్చరిక. వాట్సప్ గ్రూప్‌లల్లో ఇప్పుడు ఇదే చర్చ. ఎన్నో అనుమానాలు. ఎన్నో సందేహాలు. ఎన్నో భయాందోళనలు.

అసలు అభ్యంతరకర పోస్టులంటే ఏమిటి? వాటిని ఎలా గుర్తిస్తారు?

మీరు ఏదైనా పోస్ట్ చూసినప్పుడు అది ఇతరులను బాధిస్తుందనో, రెచ్చగొడుతుందనో, హింసను ప్రేరేపిస్తుందనో, అది నిజం కాదనో మీ మనస్సులో అనిపిస్తే అది అభ్యంతరకర పోస్టుగా భావించవచ్చు. ఒక్కసారి వాట్సప్‌లోని గైడ్‌లైన్స్ చదివితే ఈ విషయం తెలుస్తుంది. మెసేజ్, మీడియా, ప్రొఫైల్ ఫోటో ఏదైనా సరే. అభ్యంతరకరమైతే అడ్డుకోవాల్సిందే.

అది అక్రమం, చట్టవిరుద్ధం, అశ్లీలం, భయపెట్టడం, పరువుకు నష్టం కలిగించడం, వేధింపులు, జాతి వివక్ష, ద్వేషపూరితం, జాత్యహంకారం, దుష్ప్రవర్తన లాంటి పోస్టులన్నీ అభ్యంతరకరమైనవే.
వాట్సప్


మీరున్న గ్రూప్‌లోనో, లేక మీకు పర్సనల్‌గానో అలాంటి పోస్టులు, కంటెంట్ కనిపిస్తే మీరేం చేయాలి?
ఈరోజుల్లో ఫేక్ న్యూస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో మనం చూస్తున్నదే. అందులో వచ్చే తప్పుడు వార్తల్ని, సమాచారాన్ని నమ్మి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనలెన్నో జరిగాయి. మరి మీరున్న గ్రూప్‌లో ఇలాంటి తప్పుడు సమాచారం, అభ్యంతరకర పోస్టులు వస్తే మీరేం చేయాలో తెలుసుకోండి. అలాంటి పోస్ట్ చూడగానే అది ఎవరు పంపారో వారిని ఆ పోస్ట్ తొలగించాలని కోరండి. అవసరమైతే హెచ్చరించండి. మీరు గ్రూప్ అడ్మిన్ కావాల్సిన అవసరమే లేదు. మెంబర్ అయినా సరే మీ అభ్యంతరాన్ని వ్యక్తం చేయండి. అలాంటి కంటెంట్ పోస్ట్ చేయకూడదని మిగతా మెంబర్లనూ హెచ్చరించండి. మీరు అలా ఎదురుతిరిగినందుకు మిమ్మల్ని గ్రూప్ నుంచి తొలగించినా పర్లేదు. మీ పని మీరు చేయండి. మీరు హెచ్చరించినా వినకుండా అలాంటి పోస్టులు మళ్లీ మళ్లీ పంపిస్తున్నట్టైతే మీరు ఆ గ్రూప్‌లోంచి బయటపడటం మంచిది. ఒకవేళ మీరు క్రియేట్ చేసిన గ్రూప్‌లో ఇలాంటి కంటెంట్ పోస్ట్ అవుతున్నా మీరు ఎగ్జిట్ అవొచ్చు.ఆ తర్వాత ఏం చేయాలి?
మీరు గ్రూప్‌లోంచి బయటకొచ్చినంతమాత్రాన అందులో రాజుకున్న మంటలు చల్లారినట్టు కాదు. అందుకే మీరు ఛాట్ మొత్తం డిలిట్ చేసి, గ్రూప్‌లోంచి బయటకు రాగానే వాట్సప్‌కు కంప్లైంట్ చేయండి. అంతేకాదు... పోలీస్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసైనా, లేక సైబర్ సెల్‌కైనా సమాచారం ఇవ్వొచ్చు. అలా చేస్తే శతృవులు పెరుగుతారన్న భయం చాలామందిని వెంటాడుతుంది. కానీ ఏం పర్లేదు. తప్పుని తప్పు అని చెప్పడం మంచిది.

ఇవి కూడా చదవండి:

వాట్సప్‌లో 'అనుమానాస్పద లింక్' ఫీచర్!

వాట్సప్ లేటెస్ట్ ఫీచర్స్ చూశారా?
Published by: Santhosh Kumar S
First published: July 25, 2018, 10:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading