ఒక దశాబ్ద కాలం క్రితం వరకు కాలేజీలో అడ్మిషన్(Admission) పొందాలన్నా.. ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించి అప్లికేషన్ ను(Application) పంపించాలన్నా.. దరఖాస్తు ఫారమ్ ను నింపి ఆఫ్ లైన్ విధానాన్ని ఉపయోగించుకునే వాళ్లం. అప్పటికి ప్రస్తుతమున్న టెక్నాలజీ లేదు. ఇలా ఒకప్పుడు ఏదైనా ఫారం నింపాలంటే ఆ శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చింది. దీని కోసం.. ఇంటర్నెట్ బ్రౌజర్‌లో(Internet Browser) సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఇంట్లో కూర్చొని చాలా సులభంగా ఫారమ్‌ను నింపి ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఏ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకుండా వెబ్ అప్లికేషన్ ద్వారా చేసే కొన్ని పనులు కూడా ఉన్నాయి.
వెబ్ అప్లికేషన్ మరియు వెబ్‌సైట్ మధ్య వ్యత్యాసం ఉంది. HTML జావాస్క్రిప్ట్, CSS వెబ్ అప్లికేషన్‌లను రూపొందించడానికి ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగిస్తాయి. కాబట్టి వెబ్‌సైట్ మరియు వెబ్ అప్లికేషన్ ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటున్నాయి. అయితే వెబ్ సైట్ ను డైరెక్ట్ గా ఎలాంటి యాప్ లను ఉపయోగించకుండా వాడుకోవచ్చు. వెబ్ అప్లికేషన్ కు మాత్రం యాప్ లను ఉపయోగిస్తున్నారు.
వెబ్ అప్లికేషన్ అంటే ఏమిటి?
వెబ్ అప్లికేషన్ అనేది వెబ్ సర్వర్‌లో పనిచేసే ఒక రకమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్. దీన్ని ఏదైనా బ్రౌజర్ ద్వారా ఒపెన్ చేయవచ్చు. మనం వాడుక పదాలలో మాట్లాడటానికి.. ఏదైనా సమాచారాన్ని పొందడానికి, ఇంటర్నెట్ సహాయం తీసుకుంటే, దాన్ని Google Chrome లేదా Story Firefoxలో సెర్చ్ చేస్తాం. ఆ తర్వాత అనేక రిజల్ట్స్ అనేవి వెబ్ సైట్లో కనిపిస్తాయి. వాటిలో ఏదైనా ఒక ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా, మీరు ఏ సమాచారాన్ని అయితే కావాలని అనుకుంటున్నారో దానిని పొందవచ్చు. ఇలా ఏ రకమైన వెబ్‌సైట్‌నైనా వెబ్ అప్లికేషన్ అని పిలుస్తారు. HTML, జావాస్క్రిప్ట్, CSS వెబ్ అప్లికేషన్‌లను రూపొందించడానికి ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగిస్తారు.
వెబ్ అప్లికేషన్ యొక్క కొన్ని ఉదాహరణలు
వెబ్ అప్లికేషన్ అందరూ ఉపయోగించే Gmail అనేది చక్కటి ఉదాహరణ. ఏదైనా బ్రౌజర్ నుండి Gmailను ఉపయోగించవచ్చు. ఎవరికైనా మనం అనుకున్న సమాచారాన్ని చేరవేయవచ్చు. అంతే కాకుండా.. ఫైల్స్, డాక్యుమెంట్స్ లాంటివి కూడా అటాచ్ చేసి పంపవచ్చు. Facebook బ్రౌజర్ అనేది సాఫ్ట్‌వేర్ యాప్ ద్వారా ఉపయోగించబడుతుంది. ఇది ఒక వెబ్ అప్లికేషన్ . ఎందుకంటే చిత్రాలు, వీడియోలు మొదలైనవాటిని సేవ్ చేయడంతో పాటు, మీరు వ్యక్తుల నుండి అభిప్రాయాన్ని కూడా తీసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Aha web series, Technology, Web application, Website