VPN BAN: వీపీఎన్ బ్యాన్ అవుతుందా..? వీపీఎన్ అంటే ఏమిటి

(ప్రతీకాత్మక చిత్రం)

పార్ల‌మెంట్‌కు చెందిన హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(Standing committee) వీపీఎన్‌ను నిషేధించాల‌ని సిఫార్సు చేసింది. అస‌లు వీపీఎన్ అంటే ఏమిటి? ఎందుకు దీనిని బ్యాన్ చేయాలని సిఫార్సు చేసిందో తెలుసుకుందాం.

  • Share this:
    పార్ల‌మెంట్‌కు చెందిన హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(Standing committee) వీపీఎన్‌ను నిషేధించాల‌ని సిఫార్సు చేసింది. దీంతో వీపీఎన్(VPN) దేశంలో బ్యాన్ అవుతుందా? అనే ఊహాగానాలు ప్రారంభ‌మ‌య్యాయి. అస‌లు వీపీఎన్ అంటే ఏమిటి తెల‌సుకుందాం..
    వీపీఎన్ అంటే..
    ఆన్‌లైన్‌లో మనల్ని ఎవరూ ట్రాక్ చేయకుండా మనకు కావాల్సిన వెబ్ సైట్లు(Websites), స్ట్రీమింగ్ వెబ్‌సైట్లను చూసే వీలుంటుంది.  ఫ్రీగా VPN అందించే సంస్థల్లో ఏవీ బెస్ట్ ఫీచర్లను అందించలేవు. అయితే పబ్లిక్ వైఫై లాంటివి ఉపయోగించినప్పుడు వీటిని ఉపయోగించడం వల్ల మీ వివరాలు ఇతరులకు తెలియకుండా కాపాడుకునే వీలుంటుంది. ఫ్రీ VPN అందించే సంస్థలు కొన్ని సర్వీసులను ప్రీమియంగా నిర్వచించి వాటికి డబ్బు కట్టేలా చేస్తాయి. మరికొన్ని మీ బ్రౌజర్లలో వచ్చే యాడ్స్ ద్వారా ఇంకొన్ని సంస్థలు మీ వివరాలను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. అందుకే వీలైనంత వరకూ మరీ అవసరం అయితే తప్ప ఫ్రీ VPN కి దూరంగా ఉండాలి.
    ఇలా ప‌నిచేస్తాయి..
    ఫ్రీ VPN సర్వీసులు మీ డేటాను ఎన్ క్రిప్ట్ చేస్తాయి. మీరు చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని సులువుగా చేరేలా చేస్తాయి. కేవలం సెక్యూర్ వెబ్ సెషన్ ని, డేటా ఎన్ క్రిప్షన్ ని అందించడమే కాదు.. సెండర్, రెసిపియంట్ వివరాలను కూడా రహస్యంగా ఉంచుతాయి. ఇవన్నీ ఇంటర్నెట్ ప్రొటోకాల్ సెక్యూరిటీని ఉపయోగించుకుంటాయి.

    Netflix UPI Payment: నెట్‌ఫ్లిక్స్‌లో ఇక‌ యూపీఐ పేమెంట్స్‌




    అయితే VPN మీ డేటాను సెక్యూర్ చేయడంలో భాగంగా మీ డేటా స్పీడ్(Data Speed) ఒక్కోసారి చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రీ VPN ని ఉపయోగించేటప్పుడు ఇది ఇంకా ఎక్కువ. బెస్ట్ ఫ్రీ VPN అయితే పెద్ద పెద్ద డేటా పైప్స్‌ని కలిగి ఉండి ఈ వేగాన్ని తగ్గకుండా కాపాడతాయి.
    ఎందుకు నిషేధం..
    సైబర్ బెదిరింపులు & ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి అడ్డుగా ఉన్న వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ సేవల(వీపీఎన్)ను మన దేశంలో హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిషేధించాలని చూస్తున్నట్లు సమాచారం. మీడియానామా మొదట నివేదించినట్లుగా వీపీఎన్ యాప్స్, సాధనాలు ఆన్‌లైన్‌లో సులభంగా అందుబాటులో ఉన్నాయని, దీంతో నేరస్థులు ఆన్‌లైన్‌(Online)లో అనామకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే దాని వాడకాన్ని నిషేదించాలని కోరుతున్నట్లు కమిటీ సిఫార్సు చేసింది. వీపీఎన్‌లను గుర్తించడానికి, శాశ్వతంగా నిరోధించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని కమిటీ హోం మంత్రిత్వ శాఖను కోరింది. దేశంలో వీపీఎన్ సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్(Tracking), నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖను కమిటీ కోరింది.
    Published by:Sharath Chandra
    First published: