హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

అంతరిక్ష యుద్ధం జరిగితే ఏమవుతుంది... భారత్‌కు కలిగే నష్టమేంటి?

అంతరిక్ష యుద్ధం జరిగితే ఏమవుతుంది... భారత్‌కు కలిగే నష్టమేంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Space War : భవిష్యత్తులో యుద్ధాలన్నీ అంతరిక్షంలోనే జరుగుతాయన్నది అమెరికా సహా నిపుణుల మాట. అందుకే భారత్ కూడా సన్నద్ధం అవుతోందా?

  గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైలెంట్‌గా ఓ ప్రకటన చేశారు. ఏంటంటే... అంతరిక్ష రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగించుకునేందుకు తాము ప్రత్యేకంగా స్పేస్ ఫోర్స్ (రోదసీ సైనిక వ్యవస్థ)ను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ ఫోర్స్... నిరంతరం అంతరిక్షాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. శత్రుదేశాలు అంతరిక్షంలోని అమెరికా శాటిలైట్లను టార్గెట్ చేస్తే... వెంటనే ఈ దళం... ఆ దేశాల శాటిలైట్లపై విరుచుకుపడుతుంది. ఫలితంగా రోదసీ యుద్ధం మొదలై... అన్ని దేశాల శాటిలైట్లూ సర్వనాశనం అవుతాయి. ఇక అప్పుడు మనకు ఇంటర్నెట్ ఉండదు. సెల్ ఫోన్లు పనిచెయ్యవు. సమాచార వ్యవస్థ పూర్తిగా ఆగిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం స్తంభించిపోతుంది.


  భారత్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి... భారత్‌పై దాడి చేస్తే... ఇండియా తన అణ్వాయుధాలు ప్రయోగిస్తుందన్న ఉద్దేశంతో... ఏ దేశమూ మన జోలికి రావట్లేదు. అలాగే అంతరిక్ష యుద్ధాల విషయంలోనూ ఆధిపత్యం ఉన్న దేశానిదే పై చేయి అవుతుంది. ఉదాహరణకు చైనా... మన దేశ శాటిలైట్లపై దాడి చేస్తే... మన సమాచార వ్యవస్థ మొత్తం నాశనమవుతుంది. అప్పుడు మనం చైనాపై తిరిగి దాడి చెయ్యలేం. ఎందుకంటే దాడి చేసేందుకు కూడా ఇంటర్నెట్, సమాచార వ్యవస్థ కావాల్సిందే. కానీ ఇప్పుడు భారత్... చైనా సహా ఏ దేశ శాటిలైట్లపైనైనా దాడి చెయ్యగల శక్తిని పొందింది. అందువల్ల చైనా కూడా వెంటనే మనపై రోదసీ యుద్ధానికి సాహసించదు. అలా చేస్తే... తిరిగి మనం తమ శాటిలైట్లపై దాడి చేస్తామేమో అన్న భయం శత్రు దేశానికి ఉంటుంది.


  భవిష్యత్తులో జరిగేవి రోదసీ యుద్ధాలే : రోదసీలో తిరిగే శాటిలైట్లు అత్యంత ఖరీదైనవి. వాటితో ప్రయోజనాలు అత్యంత ఎక్కువ. ఒక్క శాటిలైట్ దెబ్బతిన్నా... దాని వల్ల కలిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోదసీ యుద్ధం అనే ఆలోచన అత్యంత ఖరీదైనది. అది జరగకూడదన్నదే ప్రపంచ దేశాల ఆలోచన. కానీ అమెరికా, రష్యా, చైనా... తమ శక్తి సామర్ధ్యాలతో ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అంతరిక్షంలో శాటిలైట్లను కూల్చేందుకు కూడా తామూ సిద్ధమేననే ప్రకటనలతో భయపెడుతున్నాయి. జపాన్ సహా మిగతా దేశాలన్నీ ఈ ప్రకటనలకు భయపడుతున్నాయి. భారత్ మాత్రం వాటికి దీటుగా సమాధానం ఇస్తూ... శాటిలైట్లను కూల్చగలిగే శక్తి సామర్ధ్యాల్ని సాధించింది.


  అమెరికాతోపాటు రష్యా, ఇంకో 100 దేశాలు 1967లో చేసుకున్న అంతరిక్ష పరిరక్షణ ఒప్పందానికి ట్రంప్ చెప్పిన స్పేస్ ఫోర్స్ విరుద్ధం. రష్యా గతేడాది ‘హైపర్‌ సోనిక్‌ గ్లైడెడ్‌ వెహికల్‌’ తయారుచేసుకుంది. దాన్ని అంతరిక్షంలోకి ప్రయోగిస్తే చాలు... రాడార్‌ వ్యవస్థల కళ్లుగప్పి శత్రుదేశాలపై దాడులు చేయగలదు. చైనా కూడా ఒక ఉపగ్రహం సాయంతో ఇతర ఉపగ్రహాల్నీ, క్షిపణుల్నీ పేల్చివేసేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసి, పరీక్షలు జరిపింది. ఇవన్నీ అంతరిక్షంలో యుద్ధం జరిగితే... శత్రు దేశాల్ని ఎదుర్కోవడానికి అమెరికా, రష్యా, చైనా చేసుకుంటున్న ముందస్తు ఏర్పాట్లని చెప్పుకోవచ్చు.


  భూమిపై నుంచే లేజర్ల సాయంతో ఉపగ్రహాలు పనిచేయకుండా చేయడం ఒక రకమైన యుద్ధమైతే... అంతరిక్షం నుంచే ఈ పనులు చేయించడం రెండో రకం. అంతరిక్షం నుంచి భూమ్మీది లక్ష్యాలను ఛేదించే వ్యవస్థలు మూడో రకం. అమెరికాతోపాటు రష్యా, చైనాలు మూడింటికీ ఈ రకమైన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీని భారత్ కూడా అభివృద్ధి చేసుకుంటోంది.


   


  ఇవి కూడా చదవండి :


  త్వరలో అంతరిక్ష యుద్ధం జరగబోతోందా? భారత్ ప్రకటన శత్రుదేశాలకు ఓ హెచ్చరికా?


  ప్యాంట్ జేబులో పేలిన సెల్‌ఫోన్... యువకుడికి తీవ్ర గాయాలు


  నేరస్థుడి మాటను ఈసీ ఎలా నమ్ముతుంది... చంద్రబాబు ఫైర్... హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు


  చెన్నై వెళ్లిన శ్రీరెడ్డి... అక్కడ కొత్త పోరాటం మొదలుపెట్టిందిగా...

  First published:

  Tags: Donald trump, ISRO, Narendra modi

  ఉత్తమ కథలు