చాలా కాలంగా యాపిల్ యూజర్‌లు మెసేజ్‌లకు సంబంధించి iMessageకు మాత్రమే పరిమితమయ్యారు. ఆండ్రాయిడ్ యూజర్‌లు ఈ ప్లాట్‌ఫారమ్‌ను వినియోగించలేరు. గూగుల్ కూడా SMSలకు సంబంధించి వివిధ మార్గాలను ప్రయత్నించింది, కానీ చాలా వరకు ఫలించలేదు. కానీ రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ లేదా RCS.. ఎమోజీలు, మరిన్ని మల్టీమీడియా ఫీచర్‌లకు సపోర్ట్ చేసే SMS సేవలను వినియోగదారులకు అందించడానికి ఉత్తమ మార్గాన్ని కనుగొంది. ఈ ఆర్‌సీఎస్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం దాని మెసేజెస్ యాప్‌తో ఇంటిగ్రేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌సీఎస్ టెక్నాలజీ అంటే ఏంటి? ఇది ఎలా పని చేస్తుంది, తదితర పూర్తి వివరాలు తెలుసుకోండి.
RCS మెసేజింగ్ అంటే ఏమిటి?
ఓల్డ్ SMS సర్వీస్‌కు వారసత్వంగా పేర్కొంటూ ఆర్‌సీఎస్ మెసేజింగ్‌ను 2007లో తిరిగి ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ఆర్‌సీఎస్ మెసేజింగ్ నెట్‌వర్క్‌ను అమలు చేసే టెలికాం ఆపరేటర్‌లతో కలిసి డేటా ద్వారా పని చేస్తుంది. కానీ GSM అసోసియేషన్ (GSMA) స్వాధీనం చేసుకోవడంతో, ఆర్‌సీఎస్‌ను అన్ని టెల్కోలు, ఫోన్ బ్రాండ్‌లు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా స్టాండర్డ్‌గా ఎంపిక చేసుకున్నాయి. ఆర్‌సీఎస్ బెస్ట్ ఆప్షన్‌గా మారుతుందని అందరూ ఊహించారు. అయితే భాగస్వాముల నుంచి ఆసక్తి, కృషి లేకపోవడంతో పురోగతి ఆగిపోయింది. వాట్సాప్, ఐమెసేజ్ వంటివి ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వచ్చిన ఆర్‌సీఎస్ కంటే పైచేయి సాధించాయి.
RCS మెసేజింగ్ ఏం అందించగలదు?
ఆర్‌సీఎస్ మెసేజింగ్ అనేది ఐమెసేజ్‌కు ఆండ్రాయిడ్ వెర్షన్ లాంటిది. దీని ఫీచర్లు వాట్సాప్ వంటి యాప్‌లతో పోలి ఉంటాయి. ఇది మల్టీమీడియా మెసేజ్‌లు, రిచ్ టెక్స్ట్ కంటెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫైల్‌లు, వీడియోలు, ఇమేజెస్‌ను కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ SMSలో ఎప్పుడూ సాధ్యపడవు కాబట్టి ఆర్‌సీఎస్ స్మార్ట్‌ఫోన్‌లకు లాజికల్, ఆధునిక వారసుడిగా భావించవచ్చు. డిజిటల్ బోర్డింగ్ పాస్ వంటి వాటిని కూడా స్వీకరించవచ్చు, వీటిని విమానాశ్రయ టెర్మినల్స్‌లో ఉపయోగించవచ్చు. ఇతర షాపింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా వస్తువులను కొనుగోలు చేయడానికి ఇది వన్-స్టాప్ షాప్ కూడా అవుతుంది. ఇవేవీ ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు.
RCSకి భవిష్యత్తు ఉందా?
కొన్ని సంవత్సరాల క్రితం గూగుల్ ప్రవేశించేంత వరకు ఆర్‌సీఎస్ మార్కెట్లో ప్రభావం చూపలేకపోయింది. ఆర్‌సీఎస్‌కు గూగుల్ సపోర్ట్ చేయడానికి మెసేజెస్ యాప్‌ను తెరిచింది, సేవను అమలు చేయడానికి దాని సొంత నెట్‌వర్క్‌ను అందించింది. Google I/O 2022 కీనోట్‌లో, ఆర్‌సీఎస్ నెట్‌వర్క్‌లో తమకు 500 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారని కంపెనీ పేర్కొంది. ఈ సేవ యూఎస్, యూకే, ఫ్రాన్స్, ఐరోపాలోని ఇతర ప్రాంతాలు, భారతదేశం వంటి దేశాలలో కూడా అందుబాటులో ఉంది. రష్యా, చైనా మినహా, ఆర్‌సీఎస్ ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పనిచేస్తోంది.
ఫోన్‌లో RCS మెసేజింగ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి?
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు మెసేజెస్ యాప్ సెట్టింగ్‌లకు వెళ్లి చాట్ ఫీచర్స్ అందుబాటులో ఉందో లేదో చూడాలి. అవసరాన్ని బట్టి దీన్ని మాన్యువల్‌గా ప్రారంభించవచ్చు లేదా నిలిపివేయవచ్చు. ఆర్‌సీఎస్ ద్వారా మెసేజ్‌లు పంపడానికి/స్వీకరించడానికి డేటా ప్యాక్ అవసరం. మెసేజ్‌లు SMS మార్గం ద్వారా సెండ్ కావు, ఆర్‌సీఎస్ మెసేజ్‌లకు రిసీవర్‌వైపు కూడా సపోర్ట్ చేయాలని గుర్తించాలి. లేదంటే వారు SMS రూపంలో మెసేజ్‌ను రిసీవ్ చేసుకుంటారు.
క్లయింట్ ప్రోటోకాల్ ఎన్‌క్రిప్షన్ ప్రమాణాల సహాయంతో ఆర్‌సీఎస్ మెసేజ్‌లు సురక్షితమైనవిగా గుర్తించారు. వాస్తవానికి, ఆర్‌సీఎస్ మెసేజ్‌లు స్పామ్-రహితంగా ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే ఇటీవల, భారతదేశంలో వ్యక్తులు ఆర్‌సీఎస్ ద్వారా స్పామ్ సందేశాలను పొందుతుండటంతో గూగుల్ నిలిపివేయవలసి వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా మార్కెట్‌లో ఉన్నప్పటికీ, ఆర్‌సీఎస్ ఇప్పటికీ ఒక ప్రొడక్ట్‌గా కొత్తది. సమీప భవిష్యత్తులో ప్రాచుర్యంలోకి వస్తుందని, గూగుల్ ఫలితాలను అందుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.