హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Explained: ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ NavIC అంటే ఏంటి? ఇస్రో డెవలప్‌ చేసిన ఈ టెక్నాలజీ ప్రత్యేకతలు ఇవే..

Explained: ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ NavIC అంటే ఏంటి? ఇస్రో డెవలప్‌ చేసిన ఈ టెక్నాలజీ ప్రత్యేకతలు ఇవే..

ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ NavIC అంటే ఏంటి?

ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ NavIC అంటే ఏంటి?

Explained: సొంత నావిగేషన్‌ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్న దేశాల జాబితాలో ఇండియా నిలవనుంది. నావిగేషన్‌ కోసం గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(GPS)కు ప్రత్యామ్నాయంగా నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్(NavIC) సిస్టమ్‌ను భారతీయులు వినియోగించే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

సొంత నావిగేషన్‌ సిస్టమ్‌ (Navigation System)ను ఉపయోగిస్తున్న దేశాల జాబితాలో ఇండియా (India) నిలవనుంది. నావిగేషన్‌ కోసం గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(GPS)కు ప్రత్యామ్నాయంగా నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్(NavIC) సిస్టమ్‌ను భారతీయులు వినియోగించే అవకాశం ఉంది. NavICను ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ISRO) అభివృద్ధి చేసింది. ఇండియన్ నావిగేషన్‌ సిస్టమ్‌ వినియోగానికి సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం షియోమి (Xiaomi), యాపిల్‌(Apple), శామ్‌సంగ్ (Samsung) వంటి స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో GPSకి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న NavIC అంటే ఏంటి? ఇది ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* నావిక్‌(NavIC) అంటే ఏంటి?

NavIC అనేది చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న GPSకి ఇండియన్‌ వెర్షన్. దీని అభివృద్ధిలో చిప్ తయారీ కోసం ఇస్రో, క్వాల్‌కామ్‌(Qualcomm)తో కలిసి పని చేసింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ లొకేషన్‌ ట్రాకింగ్‌, వెహికల్‌ ట్రాకింగ్‌ కోసం NavIC ఉపయోగపడుతుంది. కానీ NavIC ప్రధాన దృష్టి స్మార్ట్‌ఫోన్ నావిగేషన్‌పైనే ఉంటుంది.

ఇది వినియోగదారులు ఫుడ్ డెలివరీ, ట్యాక్సీ బుకింగ్ సర్వీస్‌లను పొందడానికి సహాయపడుతుంది. NavIC స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్, సెక్యూరిటీ ఏజెన్సీల కోసం ఎన్‌క్రిప్టెడ్ సర్వీస్, మిలిటరీ యాక్సెస్ సేవలను అందిస్తుంది. NavIC సిస్టమ్‌ 7 శాటిలైట్స్‌పై ఆధారపడుతుంది. వీటిలో 3 జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్(GEO) శాటిలైట్స్‌, 4 జియోసింక్రోనస్ ఆర్బిట్ (GSO) శాటిలైట్స్‌ ఉన్నాయి.

* చాలా దేశాలకు సొంత నావిగేషన్‌ సిస్టమ్‌

ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌లో డెవలప్‌ అయిన GPSని ఎక్కువ దేశాలు నావిగేషన్‌ సేవల కోసం వినియోగిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు సొంత నావిగేషన్‌ సిస్టమ్‌ను డెవలప్‌ చేసుకున్నాయి. రష్యాలో గ్లోనాస్‌, యూరోపియన్ యూనియన్‌కు గెలీలియో, చైనాకు బీడౌ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉన్నాయి. NavICను తీసుకురావడంతో సొంత నావిగేషన్‌ సిస్టమ్‌ ఉన్న దేశాల సరసన ఇండియా చేరింది.

ఇది కూడా చదవండి : స్మార్ట్‌ఫోన్లలో ఇక GPS ఉండదు.. కొత్త సిస్టమ్‌ను తీసుకురానున్న కేంద్రం.. కారణాలు ఇవే..

* ఇండియాలో NavIC సపోర్ట్ ఉన్న ఫోన్‌లు ఉన్నాయా?

క్వాల్‌కామ్‌ ఇప్పటికే తయారు చేసిన స్నాప్‌డ్రాగన్ 720G, స్నాప్‌డ్రాగన్ 662, స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌లు NavICకు సపోర్ట్‌ చేస్తాయి. లొకేషన్ సేవల కోసం NavIC పొజిషనింగ్ సిస్టమ్‌ను ఉపయోగించే బడ్జెట్, మిడ్‌ రేంజ్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల కోసం ఈ ప్రాసెసర్‌లు డెవలప్‌ చేసింది. షియోమి, రియల్మీ వంటి బ్రాండ్‌లు కూడా NavICకు సపోర్ట్‌ చేసే ఫోన్‌లను ప్రారంభించాయి. అయితే గ్లోబల్ కంపెనీలు ఇప్పటికీ నావిగేషన్ కోసం GPSని ఉపయోగిస్తున్నాయి.

* NAVIC, GPS మధ్య తేడాలు

GPSని యూఎస్‌లో డెవలప్‌ చేశారు. అక్కడి నుంచే మేనేజ్‌ చేస్తున్నారు. NavICను ఇండియాలో ISRO డెవలప్‌ చేసింది. ఈ సిస్టమ్‌పై ఇండియన్‌ గవర్నమెంట్‌కు మెరుగైన నియంత్రణ లభిస్తుంది. భారత ప్రభుత్వం NavICను తీసుకురావడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు కూడా వినియోగించేందుకు సొంత నావిగేషన్ సిస్టమ్‌ భారతదేశానికి అందింది. లోకల్‌ సిస్టమ్‌తో, నావిగేషన్ కచ్చితత్వం మెరుగ్గా ఉంటుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, Gps, New technology, Tech news

ఉత్తమ కథలు