హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా వచ్చిన "క్విక్ షేర్" ఫీచర్ అంటే ఏంటి.. దాన్ని ఎలా వాడాలి..

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా వచ్చిన "క్విక్ షేర్" ఫీచర్ అంటే ఏంటి.. దాన్ని ఎలా వాడాలి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఫొటో-షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను మెప్పిస్తుంది. తాజాగా మరొక సరికొత్త ఫీచర్‌ (New feature)ను ఇన్‌స్టాగ్రామ్ రోల్-అవుట్ చేసింది.

ప్రముఖ ఫొటో-షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను మెప్పిస్తుంది. తాజాగా మరొక సరికొత్త ఫీచర్‌ (New feature)ను ఇన్‌స్టాగ్రామ్ రోల్-అవుట్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ యూజర్ల కోసం క్విక్ షేర్ (Quick Share) ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో యూజర్లు ఏదైనా ఫొటో, వీడియో లేదా రీల్స్‌ను తాము ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన కాంటాక్ట్‌కి నేరుగా షేర్ చేసుకోవచ్చు. యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల కింద ఉన్న సెండ్ కీలో ఈ ఫీచర్‌ను కనుగొనవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ సెలెక్టెడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

ఈ అప్‌డేట్‌కు ముందు యూజర్లు డైరెక్టర్ మెసేజ్ (DM)లను షో చేసే లాంగ్ లిస్ట్ ద్వారా ఇతర యూజర్లకు పోస్ట్‌లను షేర్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బాగా ఇంటరాక్ట్ అయిన కాంటాక్ట్‌లతో నేరుగా షేర్ చేయడం వీలవుతుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ కంపెనీ సెలెక్టెడ్ యూజర్లతో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

Success Story: పేపర్ బాయ్‌గా పనిచేస్తూ.. ఎలాంటి కోచింగ్ లేకుండా ఐఏఎస్ సాధించాడు.. అతడి సక్సెస్ స్టోరీ ఇదే..


ఇన్‌స్టాగ్రామ్‌లో క్విక్ షేర్ ఫీచర్‌ను ఉపయోగించండిలా..

- మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను లాంచ్ చేయండి.

- మీ ఫీడ్ నుంచి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయాలనుకుంటున్న పోస్ట్‌ను సెలెక్ట్ చేసుకుని, ఓపెన్ చేయండి.

- పోస్ట్ కింద ఎడమ వైపున ఉన్న సెండ్ ఐకాన్ లేదా యారో మార్క్ ఐకాన్ ని నొక్కి పట్టుకోండి.

- ఈ కొత్త ఫీచర్ అప్‌డేట్‌ను మీ యాప్ రిసీవ్ చేసుకున్నట్లయితే... మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన ప్రొఫైల్ ఫొటోలతో ఓ కొత్త పాప్‌-అప్‌ను చూడగలుగుతారు.

- ఇప్పుడు మీరు పోస్ట్‌ను పంపాలనుకుంటున్న కాంటాక్ట్‌ను సెలెక్ట్ చేసుకొని, మీ వేలిని సెలెక్టెడ్ డీపీపై స్లైడ్ చేసి వదిలివేయండి.

- అంతే, ఆ పోస్ట్ డైరెక్ట్ మెసేజ్ ద్వారా కాంటాక్ట్‌కి సెండ్ అయిపోతుంది. మీరు మీ ఫీడ్‌ను స్క్రోల్ చేసుకోవడానికి తిరిగి వెనక్కి వెళ్లవచ్చు.

New Smartphone: త్వరలో మార్కెట్​లోకి రియల్​మీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్​.. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఇలా..


ఫిబ్రవరిలో కూడా ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఎలాంటి డైరెక్ట్ మెసేజ్ పంపకుండా స్టోరీస్ లైక్ చేసే ఓ ఆప్షన్ ను ఇన్‌స్టాగ్రామ్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు కింద కుడి వైపున 'లైక్' ఐకాన్ యాడ్ చేసింది. ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ఒక వీడియోలో కన్ఫామ్ చేశారు. అక్కడ అతను ఫీచర్‌ను కూడా వివరించాడు. డీఎం థ్రెడ్‌ని ప్రారంభించే బదులు, వ్యూయర్ షీట్‌లో స్టోరీస్ అథార్స్ కు లైకులు కనిపిస్తాయని అతను యూజర్లకు చెప్పాడు.

ఈ ఫీచర్‌కి 'స్టోయ్ లైక్ (Stoy Like)' అని పేరు పెట్టారు. దీనికి ముందు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ రియాక్షన్ అనేది లైవ్ లింక్‌తో పాటు యూజర్ల చాట్ థ్రెడ్‌లో కనిపించేది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ టీవీ (ఐజీటీవీ) కోసం అందుబాటులోకి తెచ్చిన ప్రత్యేక యాప్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ సంస్థ మూసివేస్తోంది. యూట్యూబ్‌తో పోటీపడే లక్ష్యంతో ఐజీటీవీ యాప్ ఇన్‌స్టాగ్రామ్ 2018లో ప్రవేశపెట్టబడింది. కానీ అది అంతగా పాపులర్ కావడంతో దాన్ని మూసేయడానికి సిద్ధమయ్యింది.

Published by:Veera Babu
First published:

Tags: Instagram, New feature, New features

ఉత్తమ కథలు