హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Cinematic Photos: గూగుల్ ఫొటోస్‌లో సినిమాటిక్ ఫొటోస్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?

Cinematic Photos: గూగుల్ ఫొటోస్‌లో సినిమాటిక్ ఫొటోస్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సినిమాటిక్ ఫొటోస్ ఫీచర్ సాయంతో సాధారణ ఫొటోలను మూవింగ్ ఫొటోస్‌గా మార్చవచ్చు. అప్పుడు ఫొటోలు మరింత రియలిస్టిక్‌గా, ఆకర్షణీయంగా మారతాయి. సినిమాటిక్ ఫొటోస్ ఫీచర్ అనేది మూవీ కాన్సెప్ట్ నుంచి డెవలప్ చేసింది.

ఫొటోలను సేవ్‌, షేర్‌, ఎడిట్ చేసుకునేందుకు ‘గూగుల్‌ ఫొటోస్’ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆండ్రాయిడ్ యూజర్లు ఉపయోగిస్తున్నారు. యూజర్ బేస్ పెంచుకునేందుకు ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది గూగుల్. ఇందులో భాగంగా 'సినిమాటిక్ ఫొటోస్ (Cinematic Photos) అనే సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. గూగుల్ ఫొటోస్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ సాయంతో సాధారణ ఫొటోలను మూవింగ్ ఫొటోస్‌గా మార్చవచ్చు. అప్పుడు ఫొటోలు మరింత రియలిస్టిక్‌గా, ఆకర్షణీయంగా మారతాయి. సినిమాటిక్ ఫొటోస్ ఫీచర్ అనేది మూవీ కాన్సెప్ట్ నుంచి డెవలప్ చేసింది. ఇది ఫొటోలకు సినిమాటిక్ లుక్ అందిస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది? యూజర్లు సినిమాటిక్ ఫొటోస్ క్రియేట్ చేయగలరా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Xiaomi Christmas Sale: షియోమి క్రిస్మస్​ సేల్ ప్రారంభం.. ఈ స్మార్ట్​ ఉత్పత్తులపై కళ్లు చెదిరే ఆఫర్లు..


సినిమాటిక్ ఫోటోలు ఎలా పని చేస్తాయి?

ఈ ఫీచర్ గూగుల్ మెషీన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌తో పనిచేస్తుంది. ఫోకస్‌లో ఉన్న ఫొటోలు, లేని ఫొటోల డేటాను యూజ్ చేసి ఫొటోను వివిధ లేయర్‌లుగా ఎలా విభజించాలో గూగుల్ ఏఐ సులభంగా గుర్తిస్తుంది. మెషిన్ లెర్నింగ్ ద్వారానే లేయర్‌లు పూర్తిగా నిర్ధారించడం జరుగుతుంది కాబట్టి ఫొటో డెప్త్ డేటాను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. లేయర్‌లను యాడ్ చేశాక వర్చువల్ కెమెరాను యానిమేట్ చేయడం ద్వారా 3డీ రిప్రజెంటేషన్ క్రియేట్ అవుతుంది. సోర్స్ ఫొటో 2డీలో ఉన్నప్పటికీ ప్రతి ఫొటోకు 3డీ లుక్ వస్తుంది. గూగుల్ ఏఐ సినిమాటిక్ ఫొటో డెవలప్ చేసేటప్పుడు లేయర్‌ల మధ్య గ్యాప్ ను ఫిల్ చేస్తుంది. దీనివల్ల వర్చువల్ కెమెరా అనేది ఫొటో అంతటా ఫ్రీగా మూవ్ అవుతుంది.

ITR Filing: 2021లో మారిన ఐటీ రూల్స్‌.. అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..


యూజర్లు సినిమాటిక్ ఫొటోలను సృష్టించగలరా?

ప్రస్తుతానికైతే యూజర్లు సినిమాటిక్ ఫొటోను మాన్యువల్‌గా క్రియేట్ చేయడానికి సాధ్యం కాదు. గూగుల్ ఏఐ మాత్రమే తగిన ఫొటోలను గుర్తించి వాటిని సినిమాటిక్ ఫొటోలుగా క్రియేట్ చేస్తుంది. లేయర్‌లను క్రియేట్ చేయడానికి.. గ్యాప్స్ ఫిల్ చేయడానికి.. అలాగే ఒక ఫోటోలోని మల్టిపుల్ లేయర్‌లను యానిమేట్ చేయడానికి చాలా ప్రాసెసింగ్ అవసరమవుతుంది. అందుకే సరైన ఫొటోలను ఎంపిక చేసుకొని ప్రాసెసింగ్ ని సులభంగా చేసేస్తోంది గూగుల్ ఏఐ.

Online Payments: క్రెడిట్​, డెబిట్​ కార్డు పేమెంట్ నిబంధనల్లో మార్పులు.. జనవరి 1 నుంచి అమల్లోకి.. వివరాలివే..


సినిమాటిక్ ఫొటోలను క్రియేట్ చేయలేకపోయినా.. ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలను యూజర్లు సేవ్ చేయవచ్చు. యాప్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే సినిమాటిక్ ఫొటోలు గూగుల్ ఏఐ ద్వారా ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. మీరు యాప్‌ని తెరిచినప్పుడు, సినిమాటిక్ ఫొటోలు పైన కనిపిస్తాయి. అలాగే ఒక సినిమాటిక్ ఫొటో క్రియేట్ అయినప్పుడు ఒక పుష్ నోటిఫికేషన్‌ స్టేటస్ బార్ లో కనిపిస్తుంది. వీటిని యూజర్లు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అయిన ఫొటోలను సెర్చ్ ట్యాబ్‌లోని సేవ్డ్ క్రియేషన్స్ ఆప్షన్‌లో చూడొచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Google photos, Latest Technology, Technology

ఉత్తమ కథలు