హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Buy Now, Pay Later: బయ్ నౌ, పే లేటర్ అంటే ఏంటి..? ఈ ఆప్షన్‌ను ఎప్పుడు, ఎలా యూజ్ చేసుకోవాలి?

Buy Now, Pay Later: బయ్ నౌ, పే లేటర్ అంటే ఏంటి..? ఈ ఆప్షన్‌ను ఎప్పుడు, ఎలా యూజ్ చేసుకోవాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో ప్రస్తుతం బయ్ నౌ, పే లేటర్ (BNPL) అనే పేమెంట్ ఆప్షన్‌ బాగా పాపులర్ అవుతోంది. BNPL అనేది వ్యక్తులు వస్తువులను కొనుగోలు చేయడానికి.. వాటిని తర్వాత చెల్లించడానికి ఒక మార్గం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భారతదేశంలో ప్రస్తుతం బయ్ నౌ, పే లేటర్ (BNPL) అనే పేమెంట్ ఆప్షన్‌ బాగా పాపులర్ అవుతోంది. BNPL అనేది వ్యక్తులు వస్తువులను కొనుగోలు చేయడానికి.. వాటిని తర్వాత చెల్లించడానికి ఒక మార్గం. ఈరోజుల్లో ప్రజలు బయట షాపింగ్ మాల్‌లలో కంటే ఆన్‌లైన్‌లోనే అధికంగా షాపింగ్ చేస్తున్నారు. అలానే వారు ఈజీగా పేమెంట్స్ చేసుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన బయ్ నౌ, పే లేటర్ (BNPL) యువత, పెద్దగా డబ్బు లేనివారికి బెస్ట్ పేమెంట్ ఆప్షన్‌గా మారిపోయింది. COVID-19 మహమ్మారి వల్ల ఆర్థికంగా చితికిపోయిన చాలామంది ఈ ఆప్షన్ వైపే మొగ్గు చెప్పారు. అలా కరోనా ఈ ఆప్షన్‌ను మరింత పాపులర్ చేసింది.

GlobalData అనే సంస్థ ఈ ఆప్షన్ గురించి స్టడీ చేసి చాలా ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ స్టడీ ప్రకారం, భారతదేశంలో బయ్ నౌ, పే లేటర్ (BNPL) పేమెంట్ సర్వీస్ రాబోయే కొన్నేళ్లలో బాగా పాపులరవుతుంది. అలానే ఈ రకమైన పేమెంట్ ట్రాన్సాక్షన్ వ్యాల్యూ 2022 నుంచి 2026 వరకు ఏటా 32.5% పెరుగుతుందని ఈ స్టడీ అంచనా వేసింది. దీనర్థం 2026 నాటికి, ఈ ట్రాన్సాక్షన్ వ్యాల్యూ సుమారు $15 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. షార్ట్ టర్మ్ లోన్స్‌, ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల వల్లే ఈ ఆప్షన్‌కి వాల్యూ పెరుగుతోంది.

బయ్ నౌ, పే లేటర్ అంటే ఏంటి

BNPL అనేది షార్ట్ టర్మ్ లోన్ లాంటిది. ఈ పేమెంట్ ఆప్షన్‌లో దుకాణం లేదా కంపెనీ యాజమాన్యం మీరు వస్తువును ఇంటికి తీసుకెళ్లి వాడుకోనిస్తుంది. అలానే దాని కోసం చెల్లించాల్సిన డబ్బులను తర్వాత చెల్లించడానికి అనుమతిస్తుంది. మీరు ఆ వస్తువు కోసం డబ్బులు చెల్లించడానికి సాధారణంగా కొంత సమయం ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలోగా ఎలాంటి వడ్డీ లేకుండా మీరు డబ్బులు చెల్లించవచ్చు. ప్లాట్‌ఫామ్‌ను బట్టి ఈ వడ్డీ రేటు మారవచ్చు. ఈ సేవను ఉపయోగించడానికి చాలా కంపెనీలు మీ ప్రభుత్వ ID, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి పర్సనల్ డీటెయిల్స్ అందించాలని కోరతాయి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

BNPLని ఉపయోగిస్తున్నప్పుడు, మీరు సకాలంలో డబ్బును తిరిగి చెల్లించకపోతే, కంపెనీలు ఆలస్యమైన పేమెంట్స్‌కు గాను మీ నుంచి ఎక్స్‌ట్రాగా లేట్ పేమెంట్ ఫీజు, ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్‌ దెబ్బతింటుంది. ఫలితంగా భవిష్యత్తులో మీరు రుణాలు పొందడం కష్టతరం అవుతుంది.

ఇదెలా పని చేస్తుంది

మీరు వస్తువును కొనేటప్పుడు BNPLని ఉపయోగిస్తే.. కంపెనీ మీకు బదులుగా స్టోర్‌కు డబ్బులు చెల్లిస్తుంది. మీరు వాటిని తర్వాత తిరిగి చెల్లిస్తారు. మీరు దీన్ని నిర్దిష్ట స్టోర్‌లలో మాత్రమే ఉపయోగించడం సాధ్యమవుతుంది. మీరు వడ్డీ లేకుండా డబ్బును తిరిగి చెల్లించాల్సిన సమయం కంపెనీని బట్టి 15 నుంచి 45 రోజుల వరకు మారవచ్చు. అలానే క్రెడిట్ పరిమితి రూ.500 నుంచి రూ.1 లక్ష వరకు మారవచ్చు.

BNPLను ఎక్కడ ఉపయోగించాలి?

సాధారణంగా, ఈ-కామర్స్ కంపెనీలు, ఫిన్‌టెక్ ప్లేయర్లు BNPL ఆప్షన్స్‌ను అందిస్తాయి. అయితే, కొన్ని బ్యాంకులు కూడా యూజర్ల కోసం ఈ ఆప్షన్‌ను అందించడం ప్రారంభించాయి.

First published:

Tags: E-commerce, Online shopping

ఉత్తమ కథలు