హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Services: 5జీ సేవలు ప్రారంభం... హైస్పీడ్ నెట్వర్క్‌పై మీ సందేహాలకు సమాధనాలివే

5G Services: 5జీ సేవలు ప్రారంభం... హైస్పీడ్ నెట్వర్క్‌పై మీ సందేహాలకు సమాధనాలివే

5G Services: 5జీ సేవలు ప్రారంభం... హైస్పీడ్ నెట్వర్క్‌పై మీ సందేహాలకు సమాధనాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

5G Services: 5జీ సేవలు ప్రారంభం... హైస్పీడ్ నెట్వర్క్‌పై మీ సందేహాలకు సమాధనాలివే (ప్రతీకాత్మక చిత్రం)

5G Services | భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. హైస్పీడ్ నెట్వర్క్‌పై ప్రజలకు అనేక సందేహాలు వస్తున్నాయి. 5జీ డేటా సామాన్యులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? డేటా ఛార్జీలు ఎలా ఉంటాయన్న డౌట్స్ ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

భారతీయులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న 5జీ సేవలు (5G Services) ఇండియాలో ప్రారంభం అయ్యాయి. న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో (India Mobile Congress) 5జీ సేవల్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) 5జీ సేవల్ని ప్రారంభించారు. త్వరలో 5జీ డివైజ్‌లు ఉన్నవారు 5జీ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ దీపావళిలోగా 5జీ సేవల్ని అందించబోతున్నాయి. ఇక వొడాఫోన్ ఐడియా త్వరలోనే 5జీ సేవల్ని అందించనుంది. 5జీ నెట్వర్క్ ప్రారంభం కావడంతో యూజర్లలో అనేక సందేహాలు మొదలయ్యాయి. ఆ సందేహాలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి.

5జీ అంటే ఏంటీ

ఇంటర్నెట్ స్పీడ్‌ను ఎక్కువ వేగంతో అందించే టెక్నాలజీని జనరేషన్స్‌తో పిలుస్తుంటారు. 3జీ, 4జీ, 5జీ అలాంటిదే. ఒక జనరేషన్ పెరిగినకొద్దీ డేటా స్పీడ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు 5వ జనరేషన్ అంటే 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. 5జీ లో బ్యాండ్, మిడ్ బ్యాండ్, హైబ్యాండ్ మిల్లీ మీటర్ వేవ్‌లో 24 GHz నుంచి 54 GHz వరకు లభిస్తుంది. ప్రస్తుతం 4జీ లోబ్యాండ్ 600Mhz నుంచి 900Mhz మధ్య లభిస్తున్న సంగతి తెలిసిందే.

IRCTC Food Delivery: పండక్కి ఊరెళ్తున్నారా? రైలులో ఫుడ్ కోసం వాట్సప్‌లో ఆర్డర్ చేయండిలా

భారతదేశంలో ఏ 5జీ బ్యాండ్ ఉంటుంది?

ఇండియాలో 5జీ టెక్నాలజీ ఆధారిత సేవల్ని అందించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మిడ్, హై బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించనున్నారు. ప్రస్తుతం లభిస్తున్న 4జీ కన్నా 10 రెట్లు వేగంతో డేటా లభించనుంది.

4జీ, 5జీ మధ్య తేడాలు ఏంటీ?

4జీతో పోలిస్తే 5జీ మరింత సామర్థ్యం గల ఇంటర్‌ఫేస్. 4జీతో గరిష్టంగా 150ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తే, 5జీతో 10జీబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్ లభిస్తుంది. 5జీతో హెచ్‌డీ సినిమాలను కూడా కొన్ని సెకండ్లలో డౌన్‌లోడ్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాదు అనేక డివైజ్‌లను కనెక్ట్ చేసేలా 5జీని రూపొందించారు.

Online Shopping: ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ డెలివరీ తీసుకుంటున్నారా? ఇలా చేయకపోతే చిక్కులే

4జీ కన్నా 5జీ ఖరీదు ఎక్కువా?

భారతదేశంలో 5జీ ప్లాన్స్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయితే 4జీ కన్నా 5జీ నెట్వర్క్ కోసం కాస్త ఎక్కువ ఖర్చు చేయాలి. కానీ ఆ తేడా మరీ ఎక్కువగా ఉండదు. భారతదేశంలో డేటా చాలా చౌకగా లభిస్తోంది. 5జీ విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది.

5జీ నెట్వర్క్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ దీపావళిలోపు 5జీ సేవల్ని అందించనున్నాయి. వొడాఫోన్ ఐడియా కూడా త్వరలో 5జీ సేవల్ని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొదట ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతాలో 5జీ సేవల్ని ప్రారంభించనున్నాయి జియో, ఎయిర్‌టెల్.

OnePlus Smart TV: 50 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ... కేవలం రూ.25,000 లోపే

5జీకి కొత్త మొబైల్ టవర్స్ కావాలా?

5జీ ప్రస్తుతం ఉన్న రేడియో ఫ్రీకెన్సీలపైనే పనిచేస్తుంది. మొబైల్ డేటా, వైఫై, శాటిలైట్ కమ్యూనికేషన్స్‌లో ఉపయోగిస్తున్న రేడియో ఫ్రీకెన్సీల్లో 5జీ ఉపయోగించవచ్చు. 5జీ సేవల్ని అందించడానికి ప్రత్యేకంగా టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు.

5జీ సామర్థ్యాలు ఏంటీ?

5జీతో కేవలం నెట్వర్క్ కనెక్షన్ మెరుగవడం మాత్రమే కాదు. ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి, బిలియన్ల కొద్దీ పరికరాలను రియల్ టైమ్‌లో సేకరించి సమాచారాన్ని పంచుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ లాంటి రంగాల్లో అనేక అవకాశాలను అందించనుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G, 5g technology, Pm modi, PM Narendra Modi

ఉత్తమ కథలు