Home /News /technology /

WHAT IS 5G ADVANCED HERE IS EVERYTHING YOU NEED TO KNOW ABOUT THE NEXT GEN 5G VARIANT GH SRD

5G Advanced: 5G అడ్వాన్స్‌డ్ అంటే ఏంటి? ఇది 5G టెక్నాలజీకి ఎలా భిన్నంగా ఉంటుంది? దీని ఉపయోగాలేంటి?

5G Advanced

5G Advanced

5G Advanced: భవిష్యత్తులో 5G తర్వాత రానున్న సరికొత్త టెక్నాలజీని నిపుణులు 5G అడ్వాన్స్‌డ్‌గా (5G Advanced) పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 5G అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవలసిన విషయాలు ఏవో చూద్దాం.

కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచ దేశాలు ముందుంటున్నాయి. ఇప్పుడు చాలా దేశాలు 5G నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మరికొన్ని దేశాలు ఈ దిశగా ముందగుడు వేస్తున్నాయి. 5G డేటా స్పీడ్‌కు కొత్త నిర్వచనం చెబుతుంది. వినియోగదారుల యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుపరుస్తుంది. విస్తృతమైన సేవలను క్షణాల్లోనే యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. AR/VR టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ గేమింగ్‌, IoT సేవలకు 5G నెక్ట్స్ జెనరేషన్ కనెక్టివిటీ సోర్స్‌గా మారింది. అయితే భవిష్యత్తులో దీని తర్వాత రానున్న సరికొత్త టెక్నాలజీని నిపుణులు 5G అడ్వాన్స్‌డ్‌గా (5G Advanced) పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 5G అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవలసిన విషయాలు ఏవో చూద్దాం.

* 5G అడ్వాన్స్‌డ్ అంటే ఏంటి?
ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం 5G అడ్వాన్స్‌డ్ అనేది ఇప్పటికే ఉన్న 5G నెట్‌వర్క్ కనెక్టివిటీకి అప్‌గ్రేడ్ లాంటిది. స్థిరమైన వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను అందించి, నెట్‌వర్క్ కవరేజీని ఇది గణనీయంగా మెరుగుపరుస్తుందని టెల్కోలు ఆశిస్తున్నాయి. దీని సామర్థ్యాలు 5G నెట్‌వర్క్ అందించే ప్రస్తుత ఫీచర్లను అధిగమించేలా ఉంటాయి.

* 5G అడ్వాన్స్‌డ్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
5G అడ్వాన్స్‌డ్ 2024లో లాంచ్ అవ్వాల్సి ఉంది. 2025కి ముందు ఈ టెక్నాలజీ అధికారికంగా రోల్‌అవుట్ అయ్యే అవకాశాలు లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

** 5G అడ్వాన్స్‌డ్ నుంచి ఏమేం ఆశించవచ్చు?

* కొత్త వర్చువల్ సిమ్యులేషన్స్
5G అడ్వాన్స్‌డ్‌లో మెటావర్స్ కాన్సెప్ట్ విజయవంతం కావడానికి అవసరమైన అన్ని సాధనాలు ఉన్నాయి. ఎక్స్‌టెండెడ్ రియాలిటీ ఎకోసిస్టమ్ కోసం 5G అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీని సాయంతో ఓ వ్యక్తి ఇంట్లోనే ఉండి బీచ్‌లో అలలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ పొందవచ్చు. సెలవులను ఎంజాయ్ చేసేందుకు ఏదైనా ప్రాంతానికి వెళ్లాలనుకునే ముందు.. అక్కడి పరిస్థితులను వర్చువల్‌గా వీక్షించవచ్చు. ఇది ఫిజికల్, వర్చువల్ ఈవెంట్ మధ్య అంతరాన్ని తగ్గించగలదు.

ఇది కూడా చదవండి :  వాట్సప్‌లో ఈ 10 ఫీచర్స్ వచ్చేస్తున్నాయి... వాడుకోండి ఇలా

* అటానమస్ వెహికల్స్
5G అడ్వాన్స్‌డ్ నెట్‌వర్క్ అటానమస్ వాహనాల అభివృద్ధికి నిజమైన పరిష్కారంగా భావిస్తున్నారు. ఆటోమేషన్ అనేది పూర్తి స్వయంప్రతిపత్తి కలిగిన సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు, ఇండస్ట్రీల అవసరాల కోసం సృష్టించే ఆటోమెటిక్ టెక్నాలజీకి మూలం. 5G అడ్వాన్స్‌డ్ మెరుగైన నావిగేషన్ సిస్టమ్‌లతో ఈ పరిష్కారాలను భర్తీ చేయనుంది.

* రోజువారీ కార్యకలాపాలు
ప్రస్తుతం నెట్‌వర్క్ అభివృద్ధి చెందింది. కానీ ఇప్పటికీ కనెక్టివిటీని అన్ని ప్రాంతాలకు చేరవేయడం సాధ్యం కాలేదు. ఈ అంతరాన్ని తగ్గించడానికి సరైన పరిష్కారాలతో రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించడానికి 5G అడ్వాన్స్‌డ్ కృషి చేస్తుంది. ఇది పవర్ అవుట్‌లెట్‌ల కోసం స్మార్ట్ గ్రిడ్‌లను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. రైతులు తమ వ్యవసాయ వనరులు, కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. డివైజ్‌లను ఇంటర్‌లింక్ చేయడం వల్ల పనితీరుపై రాజీ పడకుండా కనెక్టివిటీ ఖర్చులు తగ్గుతాయి. 5G అడ్వాన్స్‌డ్ 6G నెట్‌వర్క్ అభివృద్ధికి పునాదిగా చెప్పవచ్చు. ఇది రాబోయే దశాబ్దంలో టెలికాం పరిశ్రమకు దారిచూపగలదు.
Published by:Sridhar Reddy
First published:

Tags: 5G, 5g technology, New technology, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు