అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పు కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే అయోధ్య వ్యవహారంపై దేశప్రజలకు అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. వాటికి సమాధానం వెతికేందుకు గూగుల్‌ను ఆశ్రయించారు నెటిజన్లు. మూడు దశాబ్దాల నాటి కేసు కావడంతో ఈ తరానికి అయోధ్యకు సంబంధించిన కేసు గురించి తెలిసింది తక్కువే. అందుకే అయోధ్య కేసు గురించి లోతుగా తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా గూగుల్‌ను అడిగిన ప్రశ్నలు ఇవే.
What is Section 144?: అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే 144 సెక్షన్ అంటే ఏంటీ అని తెలుసుకునేందుకు గూగుల్‌లో వెతికారు.
Source: Google
Is tomorrow a holiday?: గూగుల్‌లో ఈరోజు ఎక్కువగా కనిపించిన ప్రశ్న ఇది. అయోధ్య తీర్పు వెలువడటంతో సెలవు ప్రకటించారా అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. అయితే పలు రాష్ట్రాల్లో నవంబర్ 11 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Who is Chief Justice Ranjan Gogoi?: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఎవరు అని తెలుసుకునేందుకు సెర్చ్ చేశారు నెటిజన్లు. అంతేకాదు... ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, మతం ఏంటీ అని గూగుల్‌ని అడిగారు.
అంతే కాదు... What is Ayodhya case, Ayodhya Verdict, Ayodhya case లాంటి పదాలతో గూగుల్‌లో సెర్చ్ చేస్తూ అయోధ్య కేసుకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుంటున్నారు.
Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.