Google Account: ప్రస్తుత ప్రపంచంలో గూగుల్(Google) సర్వీసులు ప్రజల జీవితంలో భాగం అయిపోయాయి. రోజువారీ జీవితంలో నెట్ వినియోగించే వారు ఒకసారైనా గూగుల్ సేవలను వినియోగించక తప్పదు. ఫొటోలు, డాక్యుమెంట్లు వంటి డేటా గూగుల్ ఈమెయిల్ (Gmail) అకౌంట్‌తో లింక్ అయి సేవ్ అవుతుంది. ఒక వేళ వినియోగదారుడు మరణిస్తే? అతనికి సంబంధించిన డేటా ఏమవుతుంది? అలా కాలగర్భంలో కలిసి పోవల్సిందేనా? కానే కాదంటోంది గూగుల్. అందకు కొన్ని పరిష్కారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతోంది. తమ ఇనేక్టివ్ అకౌంట్ మేనేజర్ (Inactive Account manager) అనే టూల్ గురించి వివరిస్తోంది. ఈ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఇనేక్టివ్ మోడ్‌లోకి మారుతుంది
ఒక వ్యక్తి చనిపోయిన చాలా రోజుల తర్వాత ఆ అకౌంట్ ఆటోమేటిక్‌గా ఇనేక్టివ్గా మారిపోతుంది. ఈ సమయాన్ని మూడు నుంచి 18 నెలలలోపు ఎంత కాలం అనేది గూగుల్ నిర్ణయిస్తుంది. గూగుల్(Google) సపోర్ట్ పేజీలో పొందుపరిచిన వివరాల ప్రకారం.. చివరిగా యూజర్ ఎప్పుడు సైన్ఇన్ అయ్యారు? మొబైల్లో చివరిగా ఎప్పుడు జీమెయిల్లాంటి యాప్‌లను ఓపెన్ చేశారనే అంశాలను ఇనేక్టివ్ మేనేజర్ సిగ్నల్స్‌గా తీసుకుంటుంది. వాటి ఆధారంగా అది పని చేయడం ప్రారంభిస్తుంది.
* సన్నిహితులు డేటాను పొందవచ్చు
ఇనేక్టివ్ అకౌంట్ మేనేజర్ ద్వారా అకౌంట్‌ని యాక్సెస్ చేసి కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ కొంత డేటాని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ అకౌంట్ ఇనేక్టివ్ మోడ్‌లోకి మారిన కొన్ని రోజులకు వారికి ఆ సదుపాయం కలుగుతుంది. అందుకు యూజర్ ముందస్తుగా కొన్ని సెట్టింగ్స్ చేసుకోక తప్పదు. అవి చేసుకోకపోతే డేటా మొత్తం డిలీట్ అయిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా జీమెయిల్(Gmail) సర్వర్ యాక్సస్ బ్లాక్ అవుతుంది. ఈ ప్రమాదాల నుంచి మన అకౌంట్ రక్షించుకోవాలంటే ముందుగా కొన్ని సెట్టింగ్స్ చేసుకోక తప్పదు.
* ముందుగా సెట్టింగ్స్ చేయాలి
ముందుగా ఇనేక్టివ్ అకౌంట్ మేనేజర్‌లోకి వెళ్లి అకౌంట్‌కి సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవాలి. సన్నిహితుల ఫోన్ నెంబర్, ఈమెయిళ్లను అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ యాక్సెస్ ఎవరికి ఇవ్వాలో వారి ఈమెయిళ్లను అక్కడ నమోదు చేయాలి. అలా రెండు మెయిల్ అడ్రస్‌లను ఎంటర్ చేయవచ్చు. ఈ పనిని ముందే చేయగలిగితే, యూజర్ మరణించిన తర్వాత కూడా డేటా భద్రంగానే ఉంటుంది. అకౌంట్ ఇనేక్టివ్ మోడ్‌లోకి మారిన కొన్ని రోజుల తర్వాత ఈ ఇనేక్టివ్ ఎకౌంట్ మేనేజర్ ముందుగా పేర్కొన్న మెయిల్స్, ఫోన్ నెంబర్లకు సమాచారాన్ని పదే పదే పంపిస్తుంది. అలా వారు సంబంధిత యూజర్ డేటాతో లింక్ అవుతారు. వాటిని తిరిగి పొందగలుగుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GMAIL, Google, Technology