Choose Municipal Ward
  CLICK HERE FOR DETAILED RESULTS

  Personal Data: మీరు చనిపోయాక మీ ఆన్‌లైన్ డేటా ఏమవుతుందో తెలుసా?

  Personal Data | మీ ఆస్తులకు వారసుల్ని, మీ ఇన్స్యూరెన్స్ డబ్బులకు నామినీలను ఎంపిక చేసినట్టే డిజిటల్ ప్రపంచంలోని మీ డేటాను ఎవరి చేతికి ఇవ్వాలో కూడా మీరు ముందే నిర్ణయించొచ్చు.

  news18-telugu
  Updated: October 30, 2019, 4:17 PM IST
  Personal Data: మీరు చనిపోయాక మీ ఆన్‌లైన్ డేటా ఏమవుతుందో తెలుసా?
  ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
  బాగా ఆస్తులు సంపాదిస్తే చనిపోయిన తర్వాత వారసులకు సొంతం అవుతాయి. లేదా విల్లులో ఎవరి పేరు రాస్తే వారికి మీ ఆస్తులు వెళ్తాయి. ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే నామినీలకు వెళ్తాయి. మరి మీరు చనిపోయాక మీ ఆన్‌లైన్ డేటా ఏమవుతుంది? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ప్రస్తుతం అందరూ రెండు ప్రపంచాల్లో బతుకుతున్నారు. ఒకటి నిజమైన ప్రపంచం. రెండోది డిజిటల్ ప్రపంచం. డిజిటల్ ప్రపంచంలో మీ ఇమెయిల్ అకౌంట్లు, క్లౌడ్ స్టోరేజీ, సోషల్ అకౌంట్స్ ఇలా అనేక ప్లాట్‌ఫామ్స్‌లో మీ పర్సనల్ డేటా ఉంటుంది. అందులో మీ వ్యక్తిగత వివరాలు, ఆర్థిక వివరాలు, ప్రైవేట్ వ్యవహారాలు... ఇలా సమస్త సమాచారం ఉంటుంది. మరి మీరు చనిపోయాక ఆ డేటా మొత్తం ఏం కావాలి? ఎవరి చేతుల్లోకి వెళ్లాలి? అసలు ఆ డేటా ఉండాలా వద్దా? ఆ డేటాను యాక్సెస్ చేయడానికి ఎవరికైనా అనుమతి ఇవ్వాలా? ఇలాంటివన్నీ మీరు ముందే నిర్ణయించుకోవచ్చు. మీ ఆస్తులకు వారసుల్ని, మీ ఇన్స్యూరెన్స్ డబ్బులకు నామినీలను ఎంపిక చేసినట్టే డిజిటల్ ప్రపంచంలోని మీ డేటాను ఎవరి చేతికి ఇవ్వాలో కూడా మీరు ముందే నిర్ణయించొచ్చు. అయితే ఈ విషయంలో వేర్వేరు సంస్థలు వేర్వేరు నిబంధనల్ని అమలు చేస్తున్నాయి. మరి మీ తదనంతరం మీ డిజిటల్ డేటా ఏమవుతుందో తెలుసుకోండి.

  Google: గూగుల్‌లో 'ఇనాక్టీవ్ అకౌంట్ మేనేజర్' ఫీచర్ ఉంది. ఇందులో మీరు 3, 6, 12, 18 నెలల సమయం సెట్ చేసుకోవచ్చు. మీరు ఎంత సమయం సెట్ చేస్తే అన్ని నెలలు మీ అకౌంట్ ఇనాక్టీవ్‌గా ఉన్నప్పుడు మీ డేటాను మీరు సూచించిన వ్యక్తులకు బదిలీ చేస్తుంది గూగుల్. మీరు 1 నుంచి 10 మంది వరకు నామినీల పేర్లను వెల్లడించొచ్చు. మీ జీమెయిల్, హ్యాంగౌట్స్, యూట్యూబ్, డ్రైవ్, గూగుల్ ఫోటోస్‌లో ఉన్న డేటా మొత్తం మీరు సూచించినవారికి చేరుతుంది. అయితే మీరు ఏ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాలో కూడా కస్టమైజ్ చేయొచ్చు. మీరు చెప్పినవారికి డేటా వెళ్లిన తర్వాత మూడు నెలల్లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అకౌంట్ డిలిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ఫీచర్ యాక్టివేట్ చేయకపోతే ఎలా అన్న అనుమానం రావొచ్చు. మీరు చనిపోయిన తర్వాత మీ డేటాను కోరుతూ మీ కుటుంబ సభ్యులు గూగుల్‌కు దరఖాస్తు చేయొచ్చు.

  Microsoft: మైక్రోసాఫ్ట్‌లో 'నెక్స్ట్ టు కిన్' పేరుతో ఫీచర్ ఉంది. మీ ఇమెయిల్స్, అటాచ్‌మెంట్స్, అడ్రస్ బుక్, మెసెంజర్ కాంటాక్ట్ లాంటివన్నీ మీరు సూచించిన వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఇందుకోసం ఆథెంటికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

  Facebook: ఫేస్‌బుక్‌లో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే ఫీచర్లు లేవు. అయితే మీరు చనిపోయారని ఫేస్‌బుక్‌కు సమాచారం అందిన తర్వాత వెరిఫై చేసి మీ అకౌంట్ డిలిట్ చేస్తుంది. లేదా మీ పేజీని 'మెమొరలైజ్డ్' అకౌంట్‌గా మార్చేందుకు అవకాశం ఇస్తుంది. అంటే మీ అకౌంట్ ఉంటుంది కానీ... అది ఎవరికీ దక్కదు. మీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు మీ జ్ఞాపకాలను షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మీ అకౌంట్ 'మెమొరలైజ్డ్' అయ్యాక ఎవరు ఆపరేట్ చేయాలో వారి పేరు వెల్లడించాలి. సెట్టింగ్స్ మెనూలో ‘Memorialisation Settings’ ఉంటాయి. మీ తదనంతరం మీ ఫేస్‌బుక్ అకౌంట్ డిలిట్ చేయాలంటే మాత్రం మీ కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

  Instagram: ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫేస్‌బుక్‌కు చెందిన కంపెనీ కావడంతో నియమనిబంధనలన్నీ ఒకేలా ఉన్నాయి. మీ అకౌంట్ మెమొరలైజ్డ్‌గా మార్చొచ్చు. లేదా మీ అకౌంట్ డిలిట్ చేయాలంటూ మీ కుటుంబ సభ్యులు కోరొచ్చు. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తైన తర్వాత మీ అకౌంట్ డిలిట్ అవుతుంది.

  Twitter: చనిపోయిన వ్యక్తి అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయాలంటూ ట్విట్టర్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే డీయాక్టివేషన్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం లేదు.

  LinkedIn: ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత అతని లింక్డ్‌ఇన్‌ అకౌంట్ డిలిట్ చేయాలంటే కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయాలి. ప్రూఫ్ ఆఫ్ డెత్ సబ్మిట్ చేయాలి. వెరిఫికేషన్ తర్వాత అకౌంట్ తొలగిస్తుంది లింక్డ్‌ఇన్.

  LG W30 Pro: ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్ ప్రారంభం... ఫోన్ ఎలా ఉందో చూడండి  ఇవి కూడా చదవండి:

  JioFiber Set-top Box: నెల రోజుల్లో వచ్చేస్తున్న జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్... ప్రత్యేకతలివే

  Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త... ఇక 'ఓటీపీ బేస్డ్ రీఫండ్'

  Mi Note 10: షావోమీ మరో సంచలనం... 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్
  Published by: Santhosh Kumar S
  First published: October 30, 2019, 4:17 PM IST
  మరిన్ని చదవండి
  తదుపరి వార్తలు

  Top Stories

  corona virus btn
  corona virus btn
  Loading