బ్యాంకుల వెబ్‌సైట్లలో వర్చువల్ కీ బోర్డ్ ఎందుకు... తప్పక తెలుసుకోవాల్సిందే...

Virtual Key Board : వర్చువల్ కీ బోర్డ్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: March 17, 2019, 2:45 PM IST
బ్యాంకుల వెబ్‌సైట్లలో వర్చువల్ కీ బోర్డ్ ఎందుకు... తప్పక తెలుసుకోవాల్సిందే...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: March 17, 2019, 2:45 PM IST
మనం ఎప్పుడోకప్పుడు మన బ్యాంక్ అకౌంట్‌లోకి లాగ్ ఇన్ అవుతాం. అది మొబైల్‌లో కావచ్చు, పర్సనల్ కంప్యూటర్లలో కావచ్చు... లేదా ఏ ఇంటర్నెట్ కేఫ్‌లోనో కావచ్చు. ఐతే... లాగిన్ అయ్యేటప్పుడు... బ్యాంకుల వెబ్‌సైట్లలో వర్చువల్ కీ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ పక్కనే వర్చువల్ కీ బోర్డ్ ఇమేజ్ కూడా ఉంటుంది. దాన్ని చూసిన చాలా మంది ఇది ఎందుకు... టైపింగ్ రాని వాళ్ల కోసం పెట్టారా అని అనుకుంటారు. కానీ దాని ప్రయోజనం తెలిస్తే మాత్రం ప్రతిసారీ దాన్నే వాడతారు. ఎందుకంటే... మన ఇళ్లలోని పర్సనల్ కంప్యూటర్లలో లాగిన్ అయితే పర్వాలేదు గానీ, ఏ ఇంటర్నెట్ కేఫ్‌లోనో లాగిన్ అయితే మాత్రం తప్పనిసరిగా వర్చువల్ కీబోర్డునే ఉపయోగించాలి. ఎందుకంటే...

virtual keyboard,keyboard,virtual,virtual keyboards,laser keyboard,keyboards,laser projection keyboard,best virtual keyboards,virtual keyboards work,virtual keyboards reviews,the virtual keyboard,best virtual keyboard,virtual laser keyboard,future keyboard,laser bluetooth keyboard,futuristic keyboard,projection keyboard,bluetooth keyboard,portable keyboard,iphone keyboard,#virtual keyboards,virtual keyboards market,banking,net banking,website hosting,website,online banking,mobile banking,digital banking,bank website,websites,buy websites,banking jobs,django for websites,fund websites,turnkey websites,best website and app for ssc and banking,banking pendrive course,online banking system,job website,asset management websites,best bankingf features,banking protection,paytm payment in website,banking preparation,బ్యాంకుల వెబ్ సైట్లు,కీలాగ్గర్,కీలాగర్,సాఫ్ట్ వేర్,వర్చువల్ కీబోర్డ్,వర్చువల్ కీ బోర్డ్,హ్యాకర్ల నుంచీ తప్పించుకోవడం ఎలా
ప్రతీకాత్మక చిత్రం


చాలా ఇంటర్నెట్ కేఫ్‌లలో... హ్యాకర్లు, దొంగలు... కీలాగర్ (Keylogger) అనే సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. దీని పనేంటంటే... మనం కీ బోర్డుపై ఏయే కీలను ప్రెస్ చేస్తున్నామో రికార్డు చేస్తుంది. మనం వెళ్లిపోయిన తర్వాత ఆ హ్యాకర్ వచ్చి... మనం ఏయే వెబ్ సైట్లలో లాగిన్ అయ్యామో తెలుసుకుంటాడు. ఆ వెబ్‌సైట్‌లో మనం ఏయే కీలను ప్రెస్ చేశామో తెలుసుకుంటాం. తద్వారా బ్యాంకుల వెబ్ సైట్లలో మనం ఏ కీలను నొక్కామో, అవే కీలను నొక్కి... మన అకౌంట్‌లోకి వాడు లాగిన్ అవుతాడు. ఆ తర్వాతేమవుతుందో మీకు తెలుసు కదా.

ఇలా కీ బోర్డు కీలను రికార్డు చేసే సాఫ్ట్ వేర్ నుంచీ తప్పించుకోవాలంటే... మనం వర్చువల్ కీ బోర్డును వాడాలి. ఆ కీ బోర్డుపై మౌస్‌తో ఐడీ, పాస్‌వర్డ్‌ను క్లిక్ చెయ్యాలి. అప్పుడు అవి రికార్డ్ అవ్వవు. తద్వారా మనం హ్యాకర్ నుంచీ తప్పించుకోగలం. కాబట్టి... ఇకపై ఎప్పుడైనా బయటెక్కడైనా బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాల్సి వస్తే... తప్పనిసరిగా వర్చువల్ కీబోర్డునే వాడండి. ఓకేనా.

First published: March 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...