హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter Account Verification: ట్విట్టర్ అకౌంట్ ఎలా వెరిఫై చేయాలి..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

Twitter Account Verification: ట్విట్టర్ అకౌంట్ ఎలా వెరిఫై చేయాలి..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Twitter Account Verification: ప్రస్తుతం ట్విట్టర్‌ యూజర్లు తమ ప్రొఫైల్‌ను వెరిఫికేషన్ చేసుకోవాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. అవేంటో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కొత్త బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోని ట్విట్టర్ (Twitter) ఇప్పుడు డబ్బులు చెల్లిస్తేనే వెరిఫైడ్ అకౌంట్ అందిస్తోంది. వెరిఫికేషన్‌తో కూడిన ట్విట్టర్ బ్లూ (Twitter Blue) మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను మస్క్ తాజాగా కొన్ని దేశాల్లో లాంచ్ చేశారు. అధికారికంగా అందుబాటులోకి వస్తున్న ఈ ప్లాన్ త్వరలో ఇండియాలో కూడా లాంచ్ కానుంది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్స్ తమ అకౌంట్‌కు ఆటోమేటిక్‌గా బ్లూ టిక్ మార్క్ పొందొచ్చు. కాగా ఆల్రెడీ వెరిఫైడ్ అకౌంట్స్‌పై కొత్త ట్విట్టర్ బ్లూ ప్లాన్ ప్రభావం చూపదని, వారు బ్లూ బ్యాడ్జ్ కోసం మనీ చెల్లించాల్సిన అవసరం లేదని ఓ రిపోర్ట్ తెలిపింది. అయితే ప్రస్తుతం ట్విట్టర్‌లో ప్రొఫైల్‌ను వెరిఫికేషన్ చేసుకోవాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. అవేంటో చూద్దాం.

* ట్విట్టర్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఎలా అప్లై చేయాలి?

స్టెప్ 1: మీ ట్విట్టర్ అకౌంట్ సెట్టింగ్స్‌కు వెళ్లి, 'వెరిఫైడ్' సెక్షన్ కింద, 'వెరిఫికేషన్ రిక్వెస్ట్'పై క్లిక్ చేయాలి. అప్పుడు ఒక పాప్-అప్ విండో కనిపిస్తుంది. అందులో 'స్టార్ట్ నౌ' ఆప్షన్ పై క్లిక్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభించవచ్చు.

స్టెప్ 2: గవర్నమెంట్, న్యూస్ ఆర్గనైజేషన్, కంపెనీ, బ్రాండ్ వంటి మీ అకౌంట్/ప్రొఫైల్ కేటగిరీని ఎంచుకోవాలి. తరువాత మీ అఫీషియల్ వెబ్‌సైట్, ఆర్టికల్స్, మీ గురించి రిఫరెన్స్‌లు మొదలైన వాటిని షేర్ చేసి, సరైన కేటగిరీని ఎంచుకున్నారనే ప్రూఫ్ అందించాలి.

స్టెప్ 3: అఫీషియల్ ఈమెయిల్ ఐడీ, వెబ్‌సైట్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఐడీని సబ్మిట్ చేసి ట్విట్టర్‌లో మీ ఐడెంటిటీని వెరిఫై చేయాలి. అన్ని వివరాలను ఎంటర్ చేశాక, 'సబ్మిట్'పై క్లిక్ చేయాలి. తర్వాత ట్విట్టర్ మీ అకౌంట్‌ను వెరిఫై చేస్తుంది.

* అకౌంట్ వెరిఫికేషన్‌కు రిక్వైర్‌మెంట్స్

ఒక అకౌంట్ అథెంటిసిటీకి బ్లూటిక్ వెరిఫికేషన్ అనేది ప్రతీకగా నిలుస్తుంది. కాబట్టి యూజర్లు వెరిఫికేషన్ చేయించుకోవాడానికి యూజర్ తన బ్రాండ్, వెబ్‌సైట్, తన గురించి తెలిపే ఆర్టికల్స్ పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా చేస్తే, ఆ యూజర్ ఐడెంటిటీ మిగతా ట్విట్టర్ యూజర్లందరూ తెలుసుకోగలుగుతారు. బ్లూ టిక్-వెరిఫికేషన్ కోసం ప్రొఫైల్ పేరు, ఇమేజ్‌ని కోరే ట్విట్టర్ నియమాలకు అనుగుణంగా మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి. దరఖాస్తు సమయంలో, అకౌంట్ పబ్లిక్‌గా ఉండాలి.

గత ఆరు నెలల్లో మీ అకౌంట్‌కి మీరు లాగిన్ అయి ఉండటంతో పాటు.. ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌ మీ అకౌంట్‌లో సబ్మిట్ చేయాలి. యాక్టివ్‌గా ఉన్నవారు ట్విట్టర్‌లో తమ అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. గత 12 నెలల్లో ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించి 12 గంటల లేదా 7-రోజుల లాకౌట్‌ను ఫేస్ చేయకుండా ఉండాలి. అయితే కొత్త ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి బ్లూ చెక్ మార్క్ రిక్వైర్‌మెంట్స్ మారే అవకాశం. ట్విట్టర్‌లో వెరిఫైడ్‌ యూజర్స్ వారి అకౌంట్ నేమ్ పక్కన బ్లూ కలర్ చెక్‌మార్క్‌ని పొందుతారు. తద్వారా వారు స్పామర్, ట్రోల్ లేదా బాట్ కాదని అందరికీ తెలుస్తుంది.

First published:

Tags: Elon Musk, Tech news, Twitter

ఉత్తమ కథలు