Home /News /technology /

WEARABLE ACTIVITY TRACKERS MOTIVATE PEOPLE TO EXERCISE MORE LOSE WEIGHT STUDY SAYS UMG GH

Fitness Trackers: ఫిట్‌నెస్ ట్రాకర్స్ వాడుతున్నారా..? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..?

ఫిట్‌నెస్ ట్రాకర్స్ వాడుతున్నారా..? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..?

ఫిట్‌నెస్ ట్రాకర్స్ వాడుతున్నారా..? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..?

ఫిట్‌నెస్ ట్రాకర్లు, పెడోమీటర్లు, స్మార్ట్ వాచ్‌లు ఎక్కువ వ్యాయామం చేయడానికి ఉపయోగపడుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ గ్యాడ్జెట్స్‌ కొన్నవారు ఎక్కువ సమయం వ్యాయామం చేస్తూ బరువు కూడా తగ్గుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు నమ్ముతున్నారు.

ఇంకా చదవండి ...
ఫిట్‌నెస్ ట్రాకర్లు, పెడోమీటర్లు, స్మార్ట్ వాచ్‌లు ఎక్కువ వ్యాయామం చేయడానికి ఉపయోగపడుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ గ్యాడ్జెట్స్‌ కొన్నవారు ఎక్కువ సమయం వ్యాయామం చేస్తూ బరువు కూడా తగ్గుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు నమ్ముతున్నారు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియన్ పరిశోధకులు చేసిన కొత్త అధ్యయనం ఫలితాలు లాన్సెట్ డిజిటల్ హెల్త్‌లో ప్రచురితమయ్యాయి. వ్యాయామం చేసేవారు వేరబుల్‌ యాక్టివిటీ ట్రాకర్‌లు(Wearable Activity Trackers) ధరించడం ద్వారా ప్రతిరోజూ 40 నిమిషాలు ఎక్కువగా నడుస్తున్నట్లు తెలిపారు. ఇలా రోజులో సుమారు 1,800 అడుగులు ఎక్కువగా నడవడంతో.. ఐదు నెలల్లో సగటున 1 కేజీ బరువు తగ్గుతున్నారని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 164,000 మంది వ్యక్తుల శారీరక శ్రమను పర్యవేక్షించడానికి వేరబుల్‌ యాక్టివిటీ ట్రాకర్‌లను ఉపయోగించారు. ఇలా దాదాపు 400 అధ్యయనాలను మానిటర్‌ చేశారు.

* వ్యాధులను దూరం చేస్తున్న డివైజ్‌లు
వ్యాయామం లేకపోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్లు, మానసిక అనారోగ్యం తదితరాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో తక్కువ ధరకు లభ్యమయ్యే డివైజ్‌లు ఎక్కువగా వ్యాయామం చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. వ్యాధుల ముప్పును దూరం చేసుకోవడానికి ఇలాంటి డివైజ్‌లు అవసరమని కొందరు అభిప్రాయపడ్డారు.

 ఇదీ చదవండి: వారెవ్వా.. ఫేస్ బుక్ లో టిక్ టాక్.. ఇక పండగే పండుగ.. ఎప్పటి నుంచి అంటే!


అధ్యయన బృంద సభ్యుడు టై ఫెర్గూసన్ మాట్లాడుతూ..‘వేరబుల్‌ యాక్టివిటీ ట్రాకర్‌లకు ప్రజాదరణ ఉన్నప్పటికీ, వాటి ఎఫెక్టివ్‌నెస్‌, కచ్చితత్వం తెలియవు. అవి అబ్సెసివ్ బిహేవియర్‌, తినే అలవాట్లను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై విస్తృతమైన సందేహాలు ఉన్నాయి. కానీ వీటికి స్పందన చాలా పాజిటివ్‌గా ఉంది. వేరబుల్‌ యాక్టివిటీ ట్రాకర్‌లు అన్ని వయస్సుల వారికి, చాలా కాలం పాటు ప్రభావవంతంగా ఉన్నాయని మా స్టడీ సూచిస్తోంది. రోజూ వ్యాయామం చేయమని ఇవి ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవడానికి, బరువు తగ్గడానికి లక్ష్యాలను నిర్ధేశించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. 1 కేజీ బరువు తగ్గడం పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ ప్రజారోగ్య దృక్పథం నుంచి ఇది అర్ధవంతమైన మార్పు.’ అని చెప్పారు.



* మూడింట రెండు వంతుల మందికి ఊబకాయం
రివ్యూ కో-ఆథర్‌, యునిసా ప్రొఫెసర్ కరోల్ మహర్ మాట్లాడుతూ..‘ఇవి బరువు తగ్గించే అధ్యయనాలు కాదు, జీవనశైలి శారీరక శ్రమ అధ్యయనాలు. కాబట్టి నాటకీయంగా బరువు తగ్గడాన్ని ఆశించలేం. సగటు వ్యక్తి సంవత్సరానికి 0.5 కిలోలు బరువు పెరుగుతాడు. కాబట్టి ఐదు నెలల్లో 1 కిలోల బరువు తగ్గడం ప్రధాన అంశం. ముఖ్యంగా ఆస్ట్రేలియన్లలో మూడింట రెండు వంతుల మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు.’ అని చెప్పారు. 2014, 2020 మధ్య, ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ చేసిన వేరబుల్‌ యాక్టివిటీ ట్రాకర్‌ల సంఖ్య దాదాపు 1,500 శాతం పెరిగింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా 2.8 బిలియన్‌ డాలర్‌ల(దాదాపు రూ.22,500 కోట్లు)ను వీటి కోసం ఖర్చు చేశారు.
Published by:Mahesh
First published:

Tags: Fitness, Health, Health care, Smart watch

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు