Home /News /technology /

WE WILL SHOW YOU HOW TO DOWNLOAD YOUR GOOGLE PHOTOS ALBUMS GH SSR

Google Photos: గూగుల్ ఫొటోస్ నుంచి ఆల్బమ్స్ డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Google Photos | గూగుల్ ఫొటోస్‌లో (Google Photos) స్టోరైన ఆల్బమ్స్‌ని ఏదో ఒక సందర్భంలో డౌన్‌లోడ్ చేసుకోవాలని యూజర్లు భావిస్తుంటారు. ఈ ఆన్‌లైన్‌ యాప్‌లో ఉన్న ఫొటోలు పొరపాటున డిలీట్ కావచ్చు కాబట్టి తమ ఫొటోలను శాశ్వతంగా ఆన్‌లైన్‌లోనే ఉంచాలని ఎవరూ అనుకోరు. అయితే చాలామందికి గూగుల్ ఫొటోస్ ఆల్బమ్స్ (Google Photos Albums) ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలియకపోవచ్చు.

ఇంకా చదవండి ...
చాలామంది మొబైల్ లేదా పీసీ యూజర్లు ఫొటోలు, వీడియోలను బ్యాకప్ చేస్తుంటారు. ఇలాంటి యూజర్ల కోసం గూగుల్ సంస్థ గూగుల్ ఫొటోస్ (Google Photos) యాప్‌ను తీసుకొచ్చింది. దీనితో యూజర్లు తమ విలువైన డేటాను థర్డ్ పార్టీ అప్లికేషన్ల (Third Party Apps) అవసరం లేకుండా గూగుల్ ఫొటోస్ యాప్‌లో బ్యాకప్ చేసుకుంటున్నారు. బ్యాకప్‌తో పాటు ఈ అప్లికేషన్‌లో యూజర్లు తమ వీడియో లేదా ఫొటో ఆల్బమ్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు.

అయితే గూగుల్ ఫొటోస్‌లో స్టోరైన ఆల్బమ్స్‌ని ఏదో ఒక సందర్భంలో డౌన్‌లోడ్ చేసుకోవాలని యూజర్లు భావిస్తుంటారు. ఈ ఆన్‌లైన్‌ యాప్‌లో ఉన్న ఫొటోలు పొరపాటున డిలీట్ కావచ్చు కాబట్టి తమ ఫొటోలను శాశ్వతంగా ఆన్‌లైన్‌లోనే ఉంచాలని ఎవరూ అనుకోరు. అయితే చాలామందికి గూగుల్ ఫొటోస్ ఆల్బమ్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలియకపోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.

గూగుల్ ఫోటోస్ ఆల్బమ్స్‌ను డౌన్‌లోడ్ చేయడం డెస్క్‌టాప్ లేదా మొబైల్ సైట్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ఆల్బమ్‌లను డౌన్‌లోడ్ చేయడమనేది ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ అప్లికేషన్ నుంచి వీలు పడదని యూజర్లు గుర్తించాలి. అయినప్పటికీ గూగుల్ ఫొటోస్ డౌన్‌లోడ్ చేయడం చాలా సులభం. డెస్క్‌టాప్, మొబైల్‌లో కూడా ఈ డౌన్‌లోడ్ ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది.

* గూగుల్ ఫొటోస్ ఆల్బమ్స్ డౌన్‌లోడ్ చేయండిలా..

స్టెప్ 1: ముందుగా గూగుల్ క్రోమ్ వంటి ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్‌లో photos.google.com సైట్ ఓపెన్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న ఫొటో/వీడియో ఆల్బమ్‌ని సెలక్ట్ చేయండి.

స్టెప్ 2: మీరు ఒక ఫొటో లేదా ఫొటో ఆల్బమ్‌పై క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత.. కుడి వైపు పైభాగంలో కనిపిస్తున్న త్రీ డాట్స్ మెనూ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: మీరు ఒకే ఒక ఫొటో సెలెక్ట్ చేసినట్లయితే.. త్రీ డాట్స్ మెనూలో "డౌన్‌లోడ్" అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ పూర్తి ఆల్బమ్ సెలక్ట్ చేసినట్లయితే "డౌన్‌లోడ్ ఆల్" అనే ఆప్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 4: "డౌన్‌లోడ్ ఆల్" అనే ఆప్షన్ ను క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఒక జిప్ (Zip) ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. ఆ జిప్ ఫైల్ లో మీకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉంటాయి.

స్టెప్ 5: జిప్ ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ అయిన మీ ఆల్బమ్ లోని ఫొటోలు, వీడియోలు చూసేందుకు మీరు దాన్ని అన్ జిప్ (unzip) చేయాల్సి ఉంటుంది. ఇందుకు మీరు ఒక జిప్ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తే సరిపోతుంది.

చూశారా గూగుల్ ఫొటోస్ నుంచి ఆల్బమ్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎంత సులభమో! గూగుల్ ఫొటోస్ లో మీ లైబ్రరీ పొరపాటున డిలీట్ అయినా.. మీరు ఆఫ్‌లైన్ బ్యాకప్‌లను కలిగి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Google, Google Drive, Photos, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు