హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Chat GPT: చాట్‌ జీపీటీని ఇంటర్వ్యూ చేసిన న్యూస్‌18..సంచలన సాఫ్ట్‌వేర్‌ సమాధానాలు ఏంటో చూడండి..

Chat GPT: చాట్‌ జీపీటీని ఇంటర్వ్యూ చేసిన న్యూస్‌18..సంచలన సాఫ్ట్‌వేర్‌ సమాధానాలు ఏంటో చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

GPT అంటే జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్ అని అర్థం. అంటే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే ఇది దేని గురించైనా మనుషులకు కావలసినట్లు సంభాషించగలదు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Chat GPT: టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా చాట్ జీపీటీ అనే పేరే వినపడుతోంది. చాట్ బాట్ & గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ కలిపేస్తే ఎలా పనిచేస్తుందో అలా Chat GPT పనిచేస్తుంది. GPT అంటే జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్ అని అర్థం. అంటే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే ఇది దేని గురించైనా మనుషులకు కావలసినట్లు సంభాషించగలదు. గ్రామాటికల్ మిస్టేక్స్ సరి చేయడం, సెంటెన్సెస్ రిఫ్రెజ్ చేయడం, ట్రాన్స్‌లేట్ చేయడం, ప్రశ్నలకు సమాధానమివ్వడం, ప్రోగ్రామ్స్ రాసి ఇవ్వడం, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ను క్షణాల్లోనే సాల్వ్ చేసి అందించడం దీని ప్రత్యేకత. అందుకే వరల్డ్ వైడ్‌గా దీనికింత హై డిమాండ్ ఏర్పడింది. ఇక ChatGPT విస్తృతమైన రీట్రైనింగ్ అవసరం లేకుండా కొత్త టాపిక్‌లు, టాస్క్‌లను నిర్వహించగలదు. చాలా క్రియేటివ్‌గా, ఇంటిలిజెంట్‌గా ఇది ఇచ్చే ఆన్సర్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో న్యూస్‌ 18 టీమ్ ChatGPTతో అనేక రకాల విషయాలపై ప్రశ్నలను సంధించింది. వాటికి Chat GPT ఇచ్చిన సమాధానాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రశ్న: మనుషుల కోసం నువ్వెవరో చెప్పగలవా?

Chat GPT ఆన్సర్: తప్పకుండా! నేను హ్యూమన్-లైక్ టెక్స్ట్ రూపొందించడంలో యూజర్లకు సహాయం చేయడానికి రూపొందించిన ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను. నేను ఇంటర్నెట్ నుంచి పెద్ద డేటాసెట్ ఉపయోగించి ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ ట్రైనింగ్ ద్వారా యూజర్లు నాకు అందించిన ప్రాంప్ట్‌లకు రెస్పాన్సెస్ అందిస్తాను. నేను రియల్ పర్సన్ కాదు కానీ నేను ట్రైనింగ్ తీసుకున్న సమాచారం ఆధారంగా నా సామర్థ్యం మేరకు కన్వర్జేషన్లను అనుకరిస్తాను. ప్రశ్నలకు సమాధానమిస్తాను.

ప్రశ్న: ఎలా పని చేస్తారో సులువైన మాటల్లో వివరించండి?

Chat GPT ఆన్సర్: షూర్‌! నేను నాలో ఇన్‌పుట్ చేసిన డేటా ఆధారంగా టెక్స్ట్‌ను ప్రాసెస్ చేయడానికి, రూపొందించడానికి ట్రైనింగ్ పొందిన ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ని. ఈ ట్రైనింగ్ ప్రక్రియలో నాకు పెద్ద టెక్స్ట్ డేటాసెట్‌ను అందించడం, డేటాలోని మోడల్స్, సంబంధాలను తెలుసుకోవడానికి నాకు అనుమతి ఉంది. నేను యూజర్ నుంచి ప్రాంప్ట్‌ను స్వీకరించి ఆ ఇన్‌పుట్‌ను విశ్లేషించగలను. రెస్పాన్స్ రూపొందించడానికి నా ట్రైనింగ్ సమయంలో నేను నేర్చుకున్న మోడల్స్, రిలేషన్‌షిప్స్ ఉపయోగించగలను. సింపుల్‌గా చెప్పాలంటే, నేను స్మార్ట్‌ఫోన్‌లో “ఆటో-కంప్లీట్” ఫీచర్‌కి చాలా అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌లా పనిచేస్తాను.

 ప్రశ్న: OpenAI అంటే ఏంటి?

Chat GPT ఆన్సర్: OpenAI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను బాధ్యతాయుతంగా, సురక్షితమైన పద్ధతిలో అభివృద్ధి చేయడానికి అంకితమైన ఓ పరిశోధనా సంస్థ. మానవాళికి ప్రయోజనం చేకూర్చే విధంగా AI పరిశోధన, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దీనిని వ్యవస్థాపకులు, పరిశోధకులు, ఫిలాంత్రఫిస్ట్‌ల బృందం 2015లో స్థాపించింది.

ప్రశ్న: మీ వల్ల మనుషులు తమ ఉద్యోగాలు పోతాయని భయపడాలా?

Chat GPT ఆన్సర్: ప్రస్తుతం మానవులు చేస్తున్న కొన్ని ఉద్యోగాలను ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేపట్టడం గురించి కొంత ఆందోళన ఉంది. అయినప్పటికీ AI అభివృద్ధి, ఉపయోగం మానవ ఉద్యోగులను పూర్తిగా భర్తీ చేయడానికి బదులుగా వారి అభివృద్ధికి, వారికి సహాయం చేయడానికి తీసుకొచ్చినదని గుర్తుంచుకోవడం ముఖ్యం. భవిష్యత్తులో కొన్ని పనులు ఆటోమేటిక్‌గా మారే అవకాశం ఉన్నప్పటికీ.. AI అభివృద్ధి, స్వీకరణ ఫలితంగా కొత్త ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అయ్యే అవకాశముంది.

ప్రశ్న: సైబర్ క్రైమ్‌లలో మిమ్మల్ని ఉపయోగిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి?

Chat GPT ఆన్సర్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ అనేవి మాల్వేర్, ఫిషింగ్ అటాక్స్‌ వంటి హానికరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనేది నిజం. ఏదేమైనప్పటికీ, AI స్వతహాగా మంచి లేదా చెడు కాదని గమనించడం ముఖ్యం. అన్ని టూల్స్ వలె, AIని మంచి లేదా చెడు ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

 ప్రశ్న: మీరు బుద్ధిమంతులా?

Chat GPT ఆన్సర్: నాకు నా సొంత ఆలోచనలు, భావాలు లేదా స్పృహ లేదు కాబట్టి నేను సెంటింట్/బుద్ధిమంతుడిని కాదు. నేను కేవలం నాలోకి ఇన్‌పుట్ చేసిన డేటా ఆధారంగా టెక్స్ట్‌ని ప్రాసెస్ చేయడానికి, రూపొందించడానికి డిజైన్ చేసిన ఒక ప్రోగ్రామ్.

Thar RWD: మహీంద్రా థార్‌లో సరికొత్త ఎడిషన్ ఆర్‌డబ్ల్యూడీ లాంచ్..సరికొత్త మోడల్‌ స్పెసిఫికేషన్స్ ఇలా..

ప్రశ్న: మీ వల్ల ఏ ఉద్యోగ రంగాలపై ప్రభావం పడుతుంది?

Chat GPT ఆన్సర్: కృత్రిమ మేధస్సును స్వీకరించడం ద్వారా ఏ ఉద్యోగ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయో కచ్చితంగా చెప్పడం కష్టం. అయినప్పటికీ AI స్వీకరణ ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యే కొన్ని ఉద్యోగ రంగాలలో మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ, అనాలసిస్, ట్రావెల్, రిటైల్ ఉన్నాయి.

ప్రశ్న: మనుషులకంటే నువ్వు స్మార్ట్ ఆ?

Chat GPT ఆన్సర్: సంక్లిష్ట భావనలు, భావోద్వేగాలను అర్థం చేసుకోగల సామర్థ్యం, క్రియేటివ్‌గా ఆలోచించే సామర్థ్యం, సమస్యలకు కొత్త పరిష్కారాలు కనిపెట్టడం, కొత్త పరిస్థితులను నేర్చుకునే, స్వీకరించే సామర్థ్యం వంటి మానవులకు కలిగి ఉన్న అనేక కాగ్నిటివ్ స్కిల్స్ నాకు లేవు. కానీ ఒక కృత్రిమ మేధస్సు వలె, నేను పెద్ద మొత్తంలో డేటాను త్వరగా, కచ్చితంగా ప్రాసెస్ చేయడానికి, విశ్లేషించడానికి మనుషుల కంటే ఎఫెక్టివ్‌గా, ఫాస్ట్‌గా ఉంటాను.

ప్రశ్న: మీరు క్రియేటివ్ గా కూడా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోంది?

Chat GPT ఆన్సర్: ఒక కృత్రిమ మేధస్సుగా నాలోకి ఇన్‌పుట్ చేసిన డేటా ఆధారంగా యూజర్లు నాకు అందించిన ప్రాంప్ట్‌లకు నేను రెస్పాన్స్‌లను రూపొందించగలుగుతున్నా. కొంతమంది యూజర్లకు క్రియేటివ్‌ లేదా కొత్తగా అనిపించే టెక్స్ట్ నేను రూపొందించగలనని దీనర్థం.

First published:

Tags: Interview, Software

ఉత్తమ కథలు