అంతరిక్షంలో అరుదైన గ్రహం... నాసా నెక్ట్స్ టార్గెట్ అదేనా?

Water Planet : ఇప్పటివరకూ భూమిపై తప్ప నీరు ఉన్న గ్రహం ఏదీ మనకు కనిపించలేదు. తొలిసారిగా అలాంటి గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అది కూడా హ్యాబిటబుల్ జోన్‌లో. దాని వివరాలు తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 12, 2019, 2:17 PM IST
అంతరిక్షంలో అరుదైన గ్రహం... నాసా నెక్ట్స్ టార్గెట్ అదేనా?
నీరు ఉన్న గ్రహం ఊహా చిత్రం (Image : Twitter - NASA)
  • Share this:
మన సౌర కుటుంబంలో 8 గ్రహాలున్నా... ఒక్క భూమిపై మాత్రమే జీవం ఎందుకుంది? ఎందుకంటే... మన భూమి... సూర్యుడి నుంచీ మరీ దూరంగా లేదు, అలాగని మరీ సూర్యుడికి దగ్గరగానూ లేదు. దూరంగా ఉంటే... సూర్యుడి ఎండ పడకపోవడం వల్ల భూమి పూర్తిగా గడ్డకట్టుకుపోయేది. అదే దగ్గరగా ఉండి ఉంటే... ఎండ ఎక్కువై మాడిపోయి ఉండేది. ఇలా మధ్యస్థంగా సరైన ప్రదేశంలో ఉండటంతో... జీవం మనుగడ సాధ్యమైంది. అందువల్ల మన భూమి ఉండే ప్రదేశాన్ని హ్యాబిటబుల్ జోన్ (జీవ మనుగడ సాధ్యమయ్యే ప్రదేశం)గా పిలుస్తారు. విశ్వంలో చాలా ఇతర సూర్యుళ్ల (నక్షత్రాల) చుట్టూ కూడా చాలా గ్రహాలున్నాయి. వాటిలో చాలా గ్రహాలు అక్కడి హ్యాబిటబుల్ జోన్లలో ఉన్నాయి. వాటినే ఎక్సోప్లానెట్స్ (Exoplanets) అంటున్నారు. అలాంటి గ్రహాల్లో మొదటిసారిగా ఓ గ్రహంపై నీరు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకూ హ్యాబిటబుల్ జోన్లలో 400కు పైగా గ్రహాల్ని గుర్తించినా... వాటిలో వేటిపైనా నీరు కనిపించలేదు. ఇప్పుడు కనిపించిన గ్రహం... శాస్త్రవేత్తలకు ఒకింత ఆనందం కలిగించింది. ఎందుకంటే... అది మన భూమి లాంటిది కావడంతో... అక్కడ జీవులు ఉండి ఉండొచ్చన్న ఆశలున్నాయి.


తాజాగా కనుక్కున్న గ్రహానికి K2-18b అనే పేరు పెట్టారు. అది మన భూమికి 110 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మరుగుజ్జు నక్షత్రం (అంతగా కాంతి లేని నక్షత్రం) K2-18 చుట్టూ తిరుగుతోంది. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగేందుకు 365 రోజులు పడుతుంటే... ఆ గ్రహం మాత్రం 33 రోజుల్లో రౌండ్ కంప్లీట్ చేస్తోంది. మన భూమి కంటే అది 8 రెట్లు పెద్దదనీ, అందులో నీటితోపాటూ... జీవులు జీవించేందుకు అనువైన వాతావరణం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.2016 - 2017 సమయంలో... హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఈ గ్రహాన్ని గుర్తించింది. దీనిపై నీరు ఆవిరి రూపంలో వెళ్తుండటాన్ని గమనించింది. ఆ ఫొటోలు పంపగానే... అప్పటి నుంచీ శాస్త్రవేత్తలు దీనిపై ఓ కన్నేశారు. ఇప్పటివరకూ ఈ విశ్వంలో భూమిపై మాత్రమే జీవులున్నట్లు శాస్త్రవేత్తలు నమ్మారు. మరి ఈ కొత్త గ్రహం మరో భూమి కాబోతోందా అన్నది కొన్నేళ్లలో తెలియనుంది.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading