WATCHING PORN MAY GET YOU SCAMMED IN LATEST ONLINE FRAUD GH VB
Watching Porn: మీకు ఆ వీడియోలు చూసే అలవాటు ఉందా..? అయితే మీరు ఇది తప్పక తెలుసుకోవాలి..
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో 4జీ సేవలు అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ (Internet) స్పీడ్ పెరిగిపోయింది. అదే సమయంలో దేశంలోని పలు టెలికామ్ సంస్థలు కస్టమర్లను ఆకర్షించడానికి ఇంటర్నెట్ను చాలా చౌకగా అందుబాటులోకి తెచ్చాయి.
దేశంలో 4జీ సేవలు అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ (Internet) స్పీడ్ పెరిగిపోయింది. అదే సమయంలో దేశంలోని పలు టెలికామ్ సంస్థలు కస్టమర్లను ఆకర్షించడానికి ఇంటర్నెట్ను చాలా చౌకగా అందుబాటులోకి తెచ్చాయి. దాంతో చాలా మంది పోర్న్ సైట్ (Porn Sites)లకు, బ్లూ ఫిల్మ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. దేశంలో పోర్న్ వెబ్సైట్లపై నిషేధం ఉన్నా... డొమైన్ పేర్లను మార్చో లేదా వీపీఎన్‌లను యాక్టివేట్ చేసుకొనో ఇలాంటి వీడియోలను చూస్తుంటారు. వీరిని టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్లు డబ్బును సంపాదిస్తున్నారు. పోర్న్ చూసేవారిని లక్ష్యంగా చేసుకొని డబ్బును సంపాదించడానికి ఆన్లైన్ స్కామర్స్ (Scammers) కొత్త దారులను వెతుకుతున్నారు.
దీనికి సంబంధించి తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో పోర్న్ చూస్తున్నప్పుడు మీ వెబ్సైట్ లాక్ అయ్యిందనే పాప్ అప్ (Pop Up) మీ సెర్చ్ బ్రౌజర్లో కనిపిస్తుంది. అంతేకాకుండా వెబ్‌సైట్‌ను అన్‌లాక్ చేయాలంటే రూ. 29 వేలు చెల్లించాలంటూ పేమెంట్ ఆప్షన్ కూడా వస్తుంది. ఈ మెసేజ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ (ministry of law and justice) నుంచి వచ్చినట్లు కనిపిస్తుంది. మీరు గాబరా పడి డబ్బు చెల్లించారో.. మీరు మోసపోయారని అర్థం.
ఆ పాప్ అప్ ప్రభుత్వం నుంచి రాలేదా?
తాజాగా బాధితుడు మోసపోయిన ఘటనలో పాప్ అప్ నోటిఫికేషన్ గవర్నమెంట్ (Government) నుంచి రాలేదు. ఈ విషయాన్ని ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇదంతా డబ్బు లాగడానికి సైబర్ నేరగాళ్లు చేస్తున్న ట్రాప్ అని ఆయన పేర్కొన్నారు.
దేశంలో పోర్న్ చూసే వారిలో చాలా మందికి భారత్‌లో వీటిపై నిషేధం ఉందని తెలుసు. అయితే దానికి బానిసగా మారో లేదా చూడటాన్ని ఒక అలవాటుగా మార్చుకొనో చాలా మంది యువకులు కొన్ని సైట్లను చూస్తుంటారు.
దీన్ని ఆసరాగా చేసుకొని... గవర్నమెంట్ నుంచి ఒక ఫేక్ పాప్ అప్ను పంపి... యూజర్లను భయపెడితే చాలా సులభంగా డబ్బులు వసూలు చేయొచ్చనే ఆలోచనతో నేరగాళ్లు ఈ పని చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సెక్షన్ల పేర్లను చెప్పి తమ పనిని సులభంగా పూర్తి చేస్తున్నారు. మీ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేశామనే పాప్ అప్ను పంపి, మీరు ఆరు గంటల్లో తాము చెప్పిన అమౌంట్ పంపకపోతే... మీరు చట్టబద్ధమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని వారు తమ సందేశంలో పేర్కొంటారు. ఇది బయట తెలిస్తే పరువు పోతుందనే భయంతో చాలా మంది యువత డబ్బును చెల్లిస్తున్నారని సమాచారం.
ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏం చెయ్యాలి?
ముందు పార్న్ సైట్లకు దూరంగా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్లో పడమనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఒక వేళ ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నా... ముందు ఆందోళన పడకండి. ఎందుకంటే గవర్నమెంట్ వ్యక్తి బ్రౌజర్‌ను ఎప్పటికీ బ్లాక్ చేయదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక వేళ మీ వెబ్సైట్ బ్లాక్ అయితే ముందు దానిని క్లోజ్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక్కడితోనే మీ సమస్య దాదాపుగా ముగిసిపోతుంది. ఒకవేళ క్లోజ్ కాకపోతే... మీరు ల్యాప్టాపలో ఈ సమస్యను ఎదర్కొన్నట్లయితే వెంటనే టాస్క్ మేనేజర్ (ctrl + alt + delete)ని ఉపయోగించి బ్లాక్ అయిన వెబ్‌సైట్‌ను క్లోజ్ చేయండి. ఇక్కడితో మీరు సమస్య నుంచి దాదాపుగా బయట పడతారు. ఒకవేళ ఈ రెండు పద్ధతులు పనిచేయకపోతే మీ ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేయండి. అంతేకాని వీరి మాయలో పడి డబ్బును పోగొట్టుకోకండి. ఇటువంటి సందేశాల ద్వారానే గతేడాది ఒక వ్యక్తి నుంచి రూ. 3 వేల దాకా సైబర్ నేరగాళ్లు రాబట్టారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.