తూర్పున మూడు గ్రహాలు... పైన శుక్రగ్రహం... దేనికి సంకేతం?

ఆకాశంలో ఎప్పుడోగానీ అంతరిక్ష వింతలు ఆవిష్కృతం అవ్వవు. అలాంటి ఓ అరుదైన సందర్భాన్ని నాసా ఇప్పుడు తెలిపింది.

news18-telugu
Updated: April 4, 2020, 10:11 AM IST
తూర్పున మూడు గ్రహాలు... పైన శుక్రగ్రహం... దేనికి సంకేతం?
తూర్పున మూడు గ్రహాలు... పైన శుక్రగ్రహం... (credit - twitter - NASA Solar System)
  • Share this:
ఈ వారంలో మీరు సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించిన తర్వాత... తూర్పు వైపున చూస్తే... మూడు నక్షత్రాలు వెలుగుతూ కనిపిస్తాయి. నిజానికి అవి నక్షత్రాలు కావు. మూడు గ్రహాలు. అవే... మార్స్ (అంగారకం), శాట్రన్ (శని), జూపిటర్ (గురుగ్రహం). ఈ మూడు గ్రహాలూ... రోజూ కొద్ది కొద్దిగా గతి మారుతూ ఉంటాయి. కానీ... మూడూ దాదాపు ఒకే చోట కనిపిస్తాయి. ఈ నెల 10 వరకూ ఈ దృశ్యం మనకు కనిపిస్తూ ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) తెలిపింది. ఈ గ్రహాలను మామూలు కళ్లతోనే చూడొచ్చని తెలిపింది. బైనాక్యులర్ లాంటివి ఉంటే... ఇవి మరింత బ్రైట్‌గా కనిపిస్తాయని వివరించింది.

చందమామ చుట్టూ గ్రహాలు ( Credit:NASA/JPL-Caltech )ఏప్రిల్ 14, 15, 16న... ఈ మూడు గ్రహాలతో చందమామ కూడా కలుస్తుంది. అందువల్ల ఆ రోజుల్లో రాత్రి కాగానే తూర్పువైపున గమనించాలని నాసా చెబుతోంది. ఎందుకంటే... మళ్లీ ఇలా మూడు గ్రహాలు, ఓ ఉపగ్రహం (చందమామ)... ఒకే చోట ఉండే దృశ్యం... కొన్నేళ్ల తర్వాత గానీ రాదని నాసా తెలిపింది.
ఏప్రిల్ 1 నుంచీ 5 వరకూ... రోజూ సాయంత్రం కాగానే... వీనస్ (శుక్రగ్రహం)... క్రమంగా మన తలపైకి వెళ్తూ... సూర్యుడు అస్తమించిన కొన్ని గంటల తర్వాత... సెవెన్ సిస్టర్స్ (Pleiades star cluster)గా పిలిచే ఏడు నక్షత్రాల కూటమి (సప్తర్షి మండలం లేదా సప్త రుషుల మండలం లేదా ఏడుగురు రుషుల మండలం) లోంచీ వెళ్తుంది. బైనాక్యులర్‌తో చూస్తే ఇది అద్భుతంగా కనిపిస్తుందని నాసా తెలిపింది.

శుక్రగ్రహ ప్రయాణం ( Credit:NASA/JPL-Caltech )
Published by: Krishna Kumar N
First published: April 4, 2020, 10:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading