గతకొద్ది రోజులుగా రష్యన్ ఆర్మీ (Russian Army) ఉక్రెయిన్ (Ukraine)పై అలుపెరగని దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు రష్యాపై సంచలన ఆంక్షలు (Sanctions) విధిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు సైతం యుద్ధానికి తెగబడ్డ రష్యాకు వరుస షాకులు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple Company) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో తన ప్రొడక్ట్స్ సేల్స్‌ను (Product Sales) పూర్తిగా నిలిపివేసినట్లు తాజాగా యాపిల్ కంపెనీ(Company) వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడం పట్ల తామెంతో చింతిస్తున్నామని, హింసాత్మక చర్యలవల్ల బాధపడుతున్న ప్రజలకు అండగా నిలుస్తామని యాపిల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే యాపిల్ తీసుకున్న తాజా నిర్ణయంతో రష్యాలోని ప్రజలు యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయలేరు. యాపిల్ కంపెనీ తాజాగా తన ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
"ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం పట్ల మేం ఎంతో చింతిస్తున్నాం. అలానే రష్యన్ ఆర్మీ ముప్పేట దాడిలో బాధపడుతున్న ప్రజలందరికీ మేం అండగా ఉంటాం. మేం మానవతా కోణంలో జరిగే అన్ని పనులకు మద్దతు ఇస్తున్నాం. పెరిగిపోతున్న శరణార్థుల సంక్షోభానికి సహాయం అందిస్తున్నాం. ఈ ప్రాంతంలోని మా బృందాలకు మద్దతు ఇవ్వడానికి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం" అని కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం యాపిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిరసనగా..
దాని ప్రకటనలో యాపిల్ తన ప్రొడక్ట్స్ అమ్మకాల్లోని అన్నింటినీ నిలిపివేసినట్లు తెలిపింది. రష్యా స్టార్ట్ చేసిన యుద్ధానికి ప్రతిస్పందనగా గత వారం రష్యా సేల్స్ ఛానెల్లోకి ఎగుమతులు కూడా యాపిల్ సంస్థ నిలిపివేసింది. రష్యాలో యాపిల్ ఆన్లైన్ స్టోర్ ప్రస్తుతం లైవ్‌లో ఉంది కానీ ప్రొడక్ట్స్ అందుబాటులో లేనట్లుగా కనిపిస్తోంది. రష్యన్ పీపుల్ వాటిని కొనుగోలు చేయడం సాధ్యపడదు. పౌరుల భద్రతా కొరకు ఉక్రెయిన్‌లోని యాపిల్ మ్యాప్స్‌లో ట్రాఫిక్, లైవ్ ఇన్సిడెంట్స్ రెండింటినీ నిలిపివేసింది యాపిల్.
అంతేకాదు, రష్యాలో యాపిల్ పే, ఇతర సేవలు వినియోగంపై యాపిల్ ఆంక్షలు విధించింది. రష్యా వెలుపల ఉన్న యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా ఆర్టీ న్యూస్, స్పుత్నిక్ న్యూస్ ఛానళ్లను రిమూవ్ చేసింది యాపిల్. గత వారం ఉక్రెయిన్ వైస్ ప్రైమ్ మినిస్టర్ మైఖైలో ఫెడోరోవ్ (Mykhailo Fedorov) యాపిల్ సీఈఓ టిమ్ కుక్కి లేఖ రాస్తూ, రష్యాలో, రష్యన్ యూజర్లకు యాపిల్ ప్రొడక్ట్ అమ్మకాలు, సేవలను నిలిపివేయాలని కోరారు. అంతకుముందే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఉక్రెయిన్ దేశానికి అనుకూలంగా ఒక ట్వీట్ చేశారు. తమ కంపెనీ అక్కడ ఉన్న యాపిల్ బృందాల కోసం, స్థానిక మానవతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం కోసం చేయగలిగినదంతా చేస్తుందని ఆయన చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone