Uber World Cup offer: ఊబెర్‌లో బుకింగ్... వరల్డ్ కప్‌ టికెట్ గెలిచే ఛాన్స్... ఆఫర్ ఇదే

ICC Cricket World Cup-Uber Contest | కాంటెస్ట్ ముగిసేలోపు అంటే జూలై 14 లోపు 50 రన్స్ చేసినవారికి ఊబెర్ రైడ్, ఊబెర్ ఈట్స్‌లో ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. ఊబెర్ ఈట్స్‌లో 5 ఆర్డర్స్‌కు 50% తగ్గింపు రూ.50 వరకు లభిస్తుంది.

news18-telugu
Updated: June 1, 2019, 10:03 AM IST
Uber World Cup offer: ఊబెర్‌లో బుకింగ్... వరల్డ్ కప్‌ టికెట్ గెలిచే ఛాన్స్... ఆఫర్ ఇదే
ICC Cricket World Cup-Uber Contest | కాంటెస్ట్ ముగిసేలోపు అంటే జూలై 14 లోపు 50 రన్స్ చేసినవారికి ఊబెర్ రైడ్, ఊబెర్ ఈట్స్‌లో ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. ఊబెర్ ఈట్స్‌లో 5 ఆర్డర్స్‌కు 50% తగ్గింపు రూ.50 వరకు లభిస్తుంది.
  • Share this:
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ మొదలైంది. మే 30 నుంచి మొదలైన క్రికెట్ వరల్డ్ కప్ జూలై 14న ముగుస్తుంది. మరి మీరు కూడా ఈ వాల్డ్ కప్‌కు వెళ్లాలనుకుంటున్నారా? సింపుల్‌గా ఊబెర్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినా, క్యాబ్ బుక్ చేసినా చాలు. క్రికెట్ వరల్డ్ కప్‌కు వెళ్లే అవకాశం దక్కించుకోవచ్చు. ఇందుకోసం మీరు ఊబెర్ కాంటెస్ట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో మీరు స్కోర్ చేస్తే చాలు... మీకు వరల్డ్ కప్ చూసే ఛాన్స్ రావొచ్చు. మే 13న ఈ ఆఫర్ ప్రారంభమైంది. మీరు ఊబెర్‌ ఈట్స్, ఊబెర్ రైడ్‌లో చేసే ప్రతీ ఆర్డర్‌పై మీకు రన్స్ వస్తాయి. ఎన్ని రన్స్ ఎక్కువగా ఉంటే వరల్డ్ కప్ చూసే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు... బహుమతులు కూడా ఉంటాయి.



Uber ICC World Cup contest: కాంటెస్ట్ వివరాలివే...


ఊబెర్ కాంటెస్ట్ మే 13న ప్రారంభమైంది. జూలై 14న ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో చేసే ప్రతీ ఆర్డర్‌పై మీకు రన్స్ వస్తాయి. ఎక్కువ రన్స్ సాధించినవారు వరల్డ్ కప్ ప్యాకేజీ గెలుచుకోవచ్చు. వరల్డ్ కప్ ప్యాకేజీ మ్యాచ్ టికెట్స్, ఫ్లై టికెట్స్, హోటల్ రూమ్ కలిపి ఉంటాయి. ఊబెర్ ఈట్స్‌లో రూ.100 నుంచి రూ.250 మధ్య ఆర్డర్ చేస్తే 4 రన్స్ వస్తాయి. రూ.250 దాటితే 6 రన్స్ వస్తాయి. ఇక UberAuto, UberMoto, UberPool, UberGo బుకింగ్స్‌పై 4 రన్స్, UberPremier, UberInterCity, UberXL, UberHire బుకింగ్స్‌పై 6 రన్స్ వస్తాయి. మీరు గెలుచుకున్న రన్స్‌ పెరిగితే వరల్డ్ కప్ ప్యాకేజీ గెలుచుకునే అవకాశాలు పెరుగుతాయి. గెలిచినవారికి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్‌లో నోటిఫికేషన్ వస్తుంది. ఈ కాంటెస్ట్‌పై విరాట్ కోహ్లీతో ప్రకటనలు ఇస్తోంది ఊబెర్.


కాంటెస్ట్ ముగిసేలోపు అంటే జూలై 14 లోపు 50 రన్స్ చేసినవారికి ఊబెర్ రైడ్, ఊబెర్ ఈట్స్‌లో ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. ఊబెర్ ఈట్స్‌లో 5 ఆర్డర్స్‌కు 50% తగ్గింపు రూ.50 వరకు లభిస్తుంది. ఊబెర్ రైడ్స్‌లో 5 బుకింగ్స్‌కు 25% తగ్గింపు రూ.75 వరకు లభిస్తుంది. 50 రన్స్ పొందినవారు జూలై 14 తర్వాత ICCEATS, ICCRIDES ప్రోమో కోడ్స్ ఉపయోగించుకోవచ్చు. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

ఆన్‌లైన్‌లో చెప్పులు కొంటున్నారా? ఈ 11 జాగ్రత్తలు తప్పనిసరి
Published by: Santhosh Kumar S
First published: June 1, 2019, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading