హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Dual WhatsApp: ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోండి ఇలా

Dual WhatsApp: ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోండి ఇలా

Dual WhatsApp: ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Dual WhatsApp: ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Dual WhatsApp | మీ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్స్ వాడాలనుకుంటున్నారా? అయితే ఈ సెట్టింగ్స్ మార్చండి.

ఒకప్పుడు ఫోన్‌లో ఒక సిమ్ కార్డ్ మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత డ్యూయెల్ సిమ్ ఫోన్లు వచ్చాయి. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత డ్యూయెల్ సిమ్ సపోర్ట్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు అన్ని స్మార్ట్‌ఫోన్లలో డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. యూజర్లు రెండు సిమ్ కార్డులు మెయింటైన్ చేస్తూ ఉంటారు. జాబ్ లేదా బిజినెస్ కోసం ఒక సిమ్ కార్డ్, మరొకటి పర్సనల్ సిమ్ కార్డ్ వాడుతుంటారు. రెండు ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి రెండు వాట్సప్ అకౌంట్ మెయింటైన్ చేయడం అవసరం. గతంలో ఒక వాట్సప్ అకౌంట్ మాత్రమే ఉపయోగించుకునే వీలుండేది. ఆ తర్వాత థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో రెండో వాట్సప్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లోనే రెండు వాట్సప్ అకౌంట్స్ ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని సెట్టింగ్స్ మారిస్తే చాలు.

Google App Crashing: మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ యాప్‌ క్రాష్‌ అవుతోందా... వెంటనే ఇలా చేయండి

Samsung Tab: సాంసంగ్ ట్యాబ్ సేల్ నేటి నుంచే... ధర రూ.11,999 మాత్రమే

సాంసంగ్, షావోమీ, రియల్‍మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలన్నీ డ్యూయెల్ యాప్స్ ఫీచర్‌ని అందిస్తున్నాయి. అంటే ఏ యాప్‌నైనా రెండు యాప్స్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌నే ప్యారలల్ యాప్స్ లేదా ట్విన్ యాప్స్ అని కూడా పిలుస్తారు. పేరు ఏదైనా ఫీచర్ మాత్రం ఒకటే. ఒక యాప్‌ని రెండు యాప్స్‌గా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది ఈ ఫీచర్. మరి మరి మీ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్స్ ఎలా వాడాలో తెలుసుకోండి.

Lava Probuds: రూ.2,199 విలువైన ఇయర్‌బడ్స్ రూ.1 ధరకే సొంతం చేసుకోండి ఇలా

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... ఈ రెండు ప్లాన్స్‌పై బెనిఫిట్స్ మారాయి

Xiaomi: మీరు రెడ్‌మీ, ఎంఐ, పోకో స్మార్ట్‌ఫోన్స్ వాడుతున్నారా? అయితే అందులో ఎంఐయూఐ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. అందులో సెట్టింగ్స్ ఓపెన్ చేసి, యాప్స్ సెక్షన్‌లో డ్యూయెల్ యాప్స్ ఎనేబుల్ చేస్తే చాలు. వాట్సప్ సెలెక్ట్ చేసుకుంటే రెండు వాట్సప్ యాప్స్ క్రియేట్ అవుతాయి.

Realme: రియల్‌మీ యూజర్లు సెట్టింగ్స్‌లో యాప్ మేనేజ్‌మెంట్ క్లిక్ చేసి యాప్ క్లోనర్ సెలెక్ట్ చేయాలి.

Samsung: సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు వాడేవారు సెట్టింగ్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఓపెన్ చేయాలి. అందులో డ్యూయెల్ మెసెంజర్ పేరుతో ఫీచర్ ఉంటుంది.

Vivo: వివో స్మార్ట్‌ఫోన్ యూజర్లు యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ సెక్షన్‌లో యాప్ క్లోన్ పైన క్లిక్ చేయాలి.

Oppo: ఒప్పో స్మార్ట్‌ఫోన్ యూజర్లు సెట్టింగ్స్‌లో యాప్ క్లోనర్ క్లిక్ చేసి డ్యూయెల్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు.

Honor: హానర్ లేదా హువావే స్మార్ట్‌ఫోన్ వాడేవారు సెట్టింగ్స్‌లో యాప్స్ ఓపెన్ చేసి యాప్ ట్విన్ సెలెక్ట్ చేయాలి.

OnePlus: వన్‌ప్లస్ యూజర్లు సెట్టింగ్స్‌లో యుటిలిటీస్ క్లిక్ చేసి ప్యారలల్ యాప్స్ పైన క్లిక్ చేయాలి.

First published:

Tags: 5G Smartphone, Android, Android 10, Android 11, Android 12, Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones, Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు