WANT TO RECHARGE ONE YEAR PLAN KNOW ABOUT BEST ANNUAL PREPAID PLANS FROM BSNL AIRTEL RELIANCE JIO AND VI SS GH
Prepaid Annual Plan: ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్ సవరించిన BSNL... Airtel, Jio, Vi యాన్యువల్ ప్లాన్స్ వివరాలివే
Prepaid Annual Plan: ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్ సవరించిన బీఎస్ఎన్ఎల్... Airtel, Jio, Vi యాన్యువల్ ప్లాన్స్ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)
Prepaid Annual Plan | మీరు ఏడాదికి ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారా? బీఎస్ఎన్ఎల్, రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ యాన్యువల్ ప్లాన్స్ వివరాలివే.
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL ఇటీవలే తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించిన విషయం తెలిసిందే. ఇతర మైబైల్ ఆపరేటర్ల నుంచి ఎదుర్కొంటున్న గట్టి పోటీని దృష్టిలో పెట్టుకొని తన ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా సవరిస్తోంది. దీనిలో భాగంగానే ఏడాది వ్యాలిడిటీతో వచ్చే రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్‌లో ఇప్పుడు అదనంగా 60 రోజుల లోక్ధన్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 365 రోజుల ఈరోస్ నౌ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. మిగిలిన ప్రయోజనాలన్నీ మునుపటిలాగే ఉంటాయి. దీని కింద రోజుకు 100 SMS సౌకర్యం, 3GB రోజువారీ డేటాను వాడుకోవచ్చు. డేటా లిమిట్ అయిపోయిన తరువాత, ఇంటర్నెట్ స్పీడ్ 80Kbps కి పడిపోతుంది. ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌తో భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. దీంతో పాటు 365 రోజుల ఉచిత కాలర్‌ట్యూన్ యాక్సెస్ పొందుతారు. సవరించిన బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్ 2021 జనవరి 1 నుండి భారతదేశంలోని అన్ని ఆపరేటింగ్ సర్కిల్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఏడాది వ్యాలిడిటీతో వచ్చే జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ వంటి ఇతర ప్రీపెయిడ్ ప్లాన్లను పరిశీలిద్దాం.
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ రూ.1,498లకు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో 24GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, మొత్తం 3,600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఉచిత హెలోటూన్స్, వింక్ మ్యూజిక్, ఆన్లైన్ క్లాసెస్ వంటి వాటికి ఉచిత యాక్సెస్ పొందవచ్చు. వీటితో పాటు ప్రతిరోజూ 2 జిబి డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ చిప్పున 365 రోజుల పాటు లభిస్తాయి.
జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్
రిలయన్స్ జియో నుండి వచ్చిన బేస్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,121లకు లభిస్తుంది. ఈ ప్లాన్ కింద 1.5GB రోజువారీ డేటా, అనగా ఏడాది మొత్తం 504GB డేటా లభిస్తుంది. ఇతర ప్లాన్ల మాదిరిగా కాకుండా, ఇది జియో నుంచి జియోకు మాత్రమే అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. జియో నుంచి నాన్ -జియోకు 12,000 నిమిషాల ఉచిత కాలింగ్ సదుపాయాన్ని మాత్రమే అందిస్తుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు రోజుకు 100 ఉచిత SMS ప్రయోజనాలతో పాటు జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా పొందుతారు. దీనితో పాటు జియో రూ .2,399 విలువచేసే ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ కింద రోజుకు 2GB డేటా, 100 SMS, అపరిమిత జియో నుంచి జియో కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటులో ఉంటుంది.
ప్రముఖ టెలికాం దిగ్గజాలు వొడాఫోన్ ఐడియాలు ‘వి’(Vi) పేరుతో ఇటీవలే ఒక్కటైన విషయం తెలిసిందే. ‘వి’ రూ .1,499లకు ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ కింద 24 GB డేటాతో పాటు 365 రోజులు అపరిమిత కాలింగ్ సదుపాయం లభిస్తుంది. దీనిలో వోడాఫోన్ కస్టమర్లకు మొత్తం 3,600 SMS సౌకర్యం కూడా లభిస్తుంది. వినియోగదారులు Vi మూవీస్, TV యాప్‌లకు కూడా యాక్సెస్ పొందుతారు. Vi రూ.2,399లకు మరో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్‌ను కూడా అందిస్తుంది. దీనిలో 1.5GB రోజువారీ డేటా, 100 SMS, అపరిమిత కాల్ ప్రయోజనాలు లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.