మీరు ఊరెళ్లేందుకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా? ట్రైన్ కోసం రైల్వే స్టేషన్‌లో ఎదురుచూసి బోర్ కొడుతోందా? మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. మీరు రైలు ఎక్కాల్సిన స్టేషన్‌కు ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందో సరిగ్గా సమయం తెలిస్తే అందుకు తగ్గట్టుగా మీ జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వే ప్రయాణికులకు ట్రైన్ రన్నింగ్ స్టేటస్ (Train Running Status), లైవ్ ట్రైన్ ట్రాక్ (Live Train Track) లాంటి సేవల్ని అందించేందుకు అనేక ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. వెబ్‌సైట్‌లో, యాప్స్ ద్వారా మీ ట్రైన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక్సిగో, రైల్ యాత్రి, గూగుల్‌కు చెందిన వేర్ ఈజ్ మై ట్రైన్ (Where is my train) లాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ట్రైన్ స్టేటస్ సులువుగా తెలుసుకోవచ్చు.
ఎన్ని యాప్స్, ప్లాట్‌ఫామ్స్ ఉన్నా వాటి అవసరం లేకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా మీ ట్రైన్ స్టేటస్ సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటుంది. కాబట్టి ట్రైన్ స్టేటస్ తెలుసుకోవడానికి మరో వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. యాప్ కూడా డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మరి గూగుల్ మ్యాప్స్‌లో ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
iQOO Z6: కాసేపట్లో ఐకూ జెడ్6... వారికి రూ.2,000 డిస్కౌంట్
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి.
Step 2- మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ స్టేషన్ పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
Step 3- ఉదాహరణకు మీరు తిరుపతి వెళ్లాలనుకుంటే Tirupati Railway Station అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.
Step 4- మ్యాప్‌లో మీకు తిరుపతి రైల్వే స్టేషన్ లొకేషన్ కనిపిస్తుంది.
Step 5- ట్రైన్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.
Step 6- మీకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు వచ్చే రైళ్ల జాబితా కనిపిస్తుంది.
Step 7- ఆ లిస్ట్ నుంచి మీ ట్రైన్ నెంబర్ లేదా రూట్ సెలెక్ట్ చేయాలి.
Step 8- మీరు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో రైలు టికెట్ బుక్ చేసినట్టైతే ఆ ట్రైన్ సెలెక్ట్ చేయాలి.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కడ ఉంది? ఏ స్టేషన్‌కు ఎన్ని గంటలకు చేరుకుంటుంది? ఎంత ఆలస్యంగా ఈ రైలు నడుస్తోంది అన్న వివరాలన్నీ తెలుస్తోంది. మీ ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. గూగుల్ మ్యాప్స్‌లో మీ రైల్వే స్టేషన్‌కు ఆ రైలు ఎన్ని గంటలకు వస్తుందో తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Realme 9 Pro: రియల్‌మీ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై తొలిసారి భారీ డిస్కౌంట్... ఆఫర్స్ వివరాలివే
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి.
Step 2- మీరు రైలు ఎక్కాలనుకునుకుంటున్న రైల్వే స్టేషన్ పేరు ఎంటర్ చేయండి.
Step 3- ఉదాహరణకు మీరు మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కాలనుకుంటే
Step 4- Mahabubnagar Railway Station అని సెర్చ్ చేయాలి.
Step 5- మ్యాప్‌లో మీకు మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ లొకేషన్ కనిపిస్తుంది.
Step 6- ట్రైన్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.
Step 7- మీకు మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్ల జాబితా కనిపిస్తుంది.
Step 8- ఆ లిస్ట్ నుంచి మీ ట్రైన్ నెంబర్ లేదా రూట్ సెలెక్ట్ చేయాలి.
ఆ రైలు ఇప్పుడు ఎక్కడ ఉంది? మీరు ఎక్కాలనుకుంటున్న రైల్వే స్టేషన్‌కు ఎన్ని గంటలకు చేరుకుంటుంది? అన్న వివరాలు తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.