హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ గూగుల్ అకౌంట్ సేఫ్... వెంటనే మార్చండి ఇలా

Google: ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ గూగుల్ అకౌంట్ సేఫ్... వెంటనే మార్చండి ఇలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Google Account Security Settings | మీ గూగుల్ అకౌంట్‌ని సేఫ్‌గా మార్చాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి.

  మీకు గూగుల్ అకౌంట్ ఉందా? జీమెయిల్ వాడుతున్నారా? అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అవుతున్నారా? మరి మీ గూగుల్ అకౌంట్ ఎంత వరకు సేఫ్‌గా ఉంది? మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ కాకుండా మీరేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసి వాడుకోవడం తప్ప సెక్యూరిటీ గురించి చాలామంది పెద్దగా పట్టించుకోరు. గూగుల్ అకౌంట్‌ని సేఫ్‌గా, సెక్యూర్‌గా మార్చేందుకు గూగుల్ చాలా సెట్టింగ్స్ అందిస్తోంది. వాటిని ఉపయోగించేవారు తక్కువ. ఇమెయిల్, గూగుల్ అకౌంట్ హ్యాక్ కాకుండా ఈ సెట్టింగ్స్ ఉపయోగపడతాయి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్, 2 స్టెప్ వెరిఫికేషన్ లాంటి వాటి ద్వారా మీ గూగుల్ అకౌంట్‌ను సురక్షితంగా మార్చుకోవచ్చు.

  Redmi Note 10 Pro Max: ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.1,999 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితం

  Samsung Galaxy F22: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 సేల్... డిస్కౌంట్ ఎంతంటే

  ఏ అకౌంట్‌కైనా స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఎలా పెట్టుకోవాలో తెలుసు. యూజర్లు తమ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో పాస్‌వర్డ్ క్రియేట్ చేయకూడదు. సులువుగా ఎవరైనా హ్యాక్ చేయగలరు. ఎవరూ గుర్తించని విధంగా పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలి. అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్, స్పెషల్ క్యారెక్టర్ కలిపి పాస్‌వర్డ్ క్రియేట్ చేస్తే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ని గుర్తించి మీ అకౌంట్ హ్యాక్ చేయడం కష్టమే. ఇక గూగుల్ అకౌంట్‌లో 2 స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్స్ చేయడం కూడా ముఖ్యమే. మీ అకౌంట్‌కు అదనపు సెక్యూరిటీ లేయర్‌గా ఇది ఉపయోగపడుతుంది. మరి 2 స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.

  WhatsApp: వాట్సప్ నోటిఫికేషన్ చిక్కులకు ఇక చెక్... ఈ 7 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి

  Amazon Offer: కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి గుడ్ న్యూస్... రూ.399 ధరకే ఈ ఆఫర్ పొందండి

  మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌లో https://myaccount.google.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  మీ గూగుల్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

  ఒకవేళ ముందే లాగిన్ చేసినట్టైతే మళ్లీ లాగిన్ చేయాల్సిన అవసరం లేదు.

  హోమ్ పేజీలో ఎడమవైపు Security పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత Signing in to Google క్లిక్ చేయాలి.

  మళ్లీ మీ పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

  ఆ తర్వాత 2-step verification ఆన్ చేయాలి.

  మళ్లీ మీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి 2-step verification పూర్తి చేయాలి.

  మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి

  Send పైన క్లిక్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్‌కు 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ వస్తుంది.

  మీ ఫోన్‌కు వచ్చిన 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

  ఆ తర్వాత Next పైన క్లిక్ చేస్తే 2 స్టెప్ వెరిఫికేషన్ పూర్తవుతుంది.

  గూగుల్ అకౌంట్‌కు 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటే మీరు ఏదైనా కొత్త డివైజ్‌లో గూగుల్ అకౌంట్ లాగిన్ చేసినప్పుడు పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోదు. రెండో స్టెప్ కూడా ఉంటుంది. మీ ఫోన్‌లో వెరిఫై చేయడం లేదా మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే కోడ్ ఎంటర్ చేయడం తప్పనిసరి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: GMAIL, Google, Google Assistant, Google Drive, Google Maps, Google news, Google search

  ఉత్తమ కథలు